MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • బంగారం పెట్టుకుంటే బోలెడు లాభాలు.. కానీ ఇలా ధరిస్తేనే ప్రయోజనం..!

బంగారం పెట్టుకుంటే బోలెడు లాభాలు.. కానీ ఇలా ధరిస్తేనే ప్రయోజనం..!

బంగారం ఎంతో విలువైన లోహం. బంగారు ఆభరణాలను కేవలం ఆడవారే కాదు మగవారు కూడా ధరిస్తారు. జ్యోతిష్యుల ప్రకారం.. బంగారం ధరించడం వల్ల కూడా అదృష్టం కలుగుతుందట. అవును బంగారాన్ని ధరించడం వల్ల ఎన్నో లాభాలున్నాయని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. మరి అవేంటో ఓ లుక్కేద్దాం పండి. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 15 2023, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హిందూ విశ్వాసాల ప్రకారం.. బంగారాన్ని ఎంతో ముఖ్యమైన లోహంగా భావిస్తారు. అందుకే కాస్త డబ్బు ఉన్నా.. బంగారాన్ని కొంటుంటారు. బంగారు ఆభరణాలు అందాన్ని పెంచడమే కాకుండా మనకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయంటున్నారు జ్యోతిష్యులు. అవేంటో తెలుసుకుందాం పందండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ గ్రహానికి సంబంధించి..

బంగారం బృహస్పతి గ్రహానికి సంబంధించిందని నమ్ముతారు. అందుకే బంగారు ఆభరణాలను ధరిస్తే గురు గ్రహాన్ని బలోపేతం అవుతుందట. అలాగే మీ జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు,  శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. వీటిని ధరించడం వల్ల ఎన్నో రకాల శారీరక ప్రయోజనాలు కూడా లభిస్తాయంటున్నారు. కాగా తులారాశి, మకర రాశి వారు బంగారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది వారికి ఎన్నో విధాలుగా కలిసి వస్తుందని నమ్ముతారు.

35

వైవాహిక జీవితానికి మేలు 

జ్యోతిష్యుల ప్రకారం.. బంగారు ఆభరణాలు వైవాహిక జీవితానికి కూడా మేలు చేస్తాయట. అంటే పెళ్లైన వారు బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల వారికి సంపద కలుగుతుందట. అలాగేవివాహిత దంపతులు వీటిని ధరిస్తే వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని నమ్ముతారు. 

45

ఇంటి లోపాలు తొలగిపోతాయి

రత్నశాస్త్రం ప్రకారం..  వేళ్లకు బంగారు ఉంగరాలను ధరిస్తే గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే దీన్ని లక్కీ మెటల్ గా భావిస్తారు. అంతేకాదు ఉంగరం వల్ల సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందట. 
 

55

బంగారం ధరించడానికి నియమాలు

బంగారంతో బోలెడు లాభాలున్నా.. దీని ధరించడానికి కొన్ని నియమాలను పాటించాల్సిందేనంటున్నారు జ్యోతిష్యులు. అవును గోల్డ్ రింగ్ ను చూపుడు వేలికి పెట్టుకుంటే మీ ఏకాగ్రత పెరుగుతుందట. అలాగే మెడలో  బంగారు గొలుసును వేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట. ఉంగరపు వేలికి గోల్డ్ రింగ్ ను పెట్టుకుంటే సంతానం కలుగుతుందట. మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు రాశి వారు బంగారం నగలను కొనడం, పెట్టుకోవడం శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rain: వ‌ర్షం ప‌డ‌గానే క‌మ్మ‌టి వాస‌న ఎందుకు వ‌స్తుంది.? రీజ‌న్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు
Recommended image2
ATM PIN : ఏటీఎం పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీ ఇదే
Recommended image3
AI Cannibalism: ఏఐ క్యానిబలిజం రచ్చ.. ఏంటి సామీ ఇది? అలీబాబా కొట్టిన దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved