కార్తీక పౌర్ణమి నాడు ఈ రాశుల వారు ధనలాభం పొందుతారు
Karthika Pournami 2023: జాతకంలో బలమైన బుధుడు ఉండటం వల్ల ఈ రాశుల వారు తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. నవంబర్ 27న బుధుడు వేరే రాశిలోకి మారుతాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అన్ని రాశుల్లో గ్రహాల ఉనికిని బట్టి ఫలితాలు వస్తాయి. అయితే కొన్ని రాశుల వారు మాత్రం లాభాలను పొందుతారు. ఏయే రాశుల వారంటే?
జ్యోతిషశాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో బలమైన బుధుడు ఉండటం వల్ల జాతకుడు తన జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతాడనే నమ్మకం ఉంది. నవంబర్ 27న అంటే కార్తీక పౌర్ణమి నాడు బుధుడు వేరే రాశిలోకి ప్రవేశిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీన్నివల్ల కొన్ని రాశుల వారు లాభాలను పొందుతారు. ఏయే రాశుల వారు పౌర్ణమి నాడు ప్రయోజనాలను పొందుతారంటే?
నవంబర్ 27 న అంటే కార్తీక పౌర్ణమి నాడు ఉదయం 05:53 గంటలకు బుధుడు వృశ్చిక రాశిని వదిలి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఈ రాశిలో మొత్తం 31 రోజులు ఉంటాడు. ఆ తర్వాత ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఏయే రాశుల వారికి లాభం కలుగుతుందంటే?
మేషం
ప్రస్తుతం బుధుడు మేష రాశిలో ఉన్నాడు. ఈ కారణంగా బృహస్పతి ప్రత్యేక అనుగ్రహం మేష రాశి జాతకులపై ఉంటుంది. దీంతో ఈ రాశివారు వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. అలాగే బుధుడు రాశి మారడం వల్ల మేష రాశి వారికి శుభకార్యాలు పెరిగి విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. గణేశుని అనుగ్రహంతో ఆదాయం, అదృష్టం విపరీతంగా పెరుగుతాయి.
కుంభ రాశి
కుంభ రాశి జాతకులు కూడా బుధుడి రాశి మార్పుతో ప్రయోజనం పొందుతారు. ఈ రాశివారికి అదృష్టం కలుగుతుంది. వినాయకుని అనుగ్రహంతో అన్ని పనులను పూర్తి చేస్తారు. ఈ రాశివారు ధనం పొందే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపారాలు కూడా పెరుగుతాయి.
మీన రాశి
బుధుడు రాశిచక్రం మారుతున్న సమయంలో మీన రాశి జాతకులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే కెరీర్ కు కొత్త కోణం వస్తుందన్న మాట. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే ఈ సమయం ఉత్తమం. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే పరీక్షలో మెరుగైన ఫలితాలను సాధిస్తారు.