- Home
- Feature
- Gollapudi Maruti Rao: ఇంట్లో నైటీలు, చుడీదార్ బ్యాన్ చేసిన నటుడు.. కానీ గొల్లపూడి కొడుకులు ఏంచేశారంటే?
Gollapudi Maruti Rao: ఇంట్లో నైటీలు, చుడీదార్ బ్యాన్ చేసిన నటుడు.. కానీ గొల్లపూడి కొడుకులు ఏంచేశారంటే?
Gollapudi Maruti Rao: ప్రస్తుతం కాలంలో ఆడవారి డ్రెస్సింగ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చాయి. గతంలో ఆడాళ్లు చీరలు మాత్రమే కట్టేవారు. ఇప్పుడు మాత్రం నైటీలు, చుడిదార్ లు ఫ్యాషన్ అయిపోయాయి. కానీ ఒక నటుడు మాత్రం తన ఇంట్లో వాటిని బ్యాన్ చేశాడని మీకుతెలుసా?

బహుముఖ ప్రజ్ఞాశీలి ...
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ కలిగినవారు ఎందరో ఉన్నారు. టాలీవుడ్ కు తమ ప్రతిభ ద్వారా వన్నెతెచ్చిన వారిలో ప్రముఖ నటులు, రచయిత , బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన గొల్లపూడి మారుతీరావు కూడా ఒకరు. ఆయన నటుడిగా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేశారు. కవిగా, దర్శకుడిగా, వక్తగా..హోస్ట్ గా ఎన్నో అద్భుతాలు చేశారు గొల్లపూడి. ఇక ఆయన ఏదైనా ముక్కుసూటిగా ఉండేవారు, మాట్లాడేవారు.
తన జీవిత కాలంలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండేవి. కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేసేవారు. కాలం మారుతున్న కొద్దీ సమాజంలో, కుటుంబ వ్యవస్థలో వచ్చే మార్పుల పట్ల ఆయనకు కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు, సిద్ధాంతాలు ఉండేవి. తన ఇంట జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఆయన కుటుంబ సాంప్రదాయాలు, ఆధునికత గురించి పలు ఆసక్తికరమైన విషయాలను గతంలో జరిగిన ఓఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
కోడళ్ల విషయంలో గొల్లపూడి పెట్టిన నిబంధనలు
గొల్లపూడి మారుతీరావు తన ఇంట జరిగిన ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ, తన కోడళ్ళ కాపురానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉండేవని తెలిపారు. తన కోడళ్ళు తమ కాపురానికి వచ్చిన ఇన్నేళ్లలో ఎప్పుడూ చుడీదార్లు, పైజామాలు లేదా నైటీలు ధరించకూడదనే రెండు కఠినమైన షరతులు పెట్టానని ఆయన స్వయంగా పేర్కొన్నారు. ఆయన పెద్ద కోడలు బీఎస్సీ ఫస్ట్ క్లాస్, మరో కోడలు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతులే అయినప్పటికీ, ఇంటి పరిధిలో మాత్రం ఆయన ఈ సాంప్రదాయ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూశారు.
తన పెద్ద కొడుక్కి పెళ్లై 55 ఏళ్ళు, మనవరాలి వయసు 27 ఏళ్ళు అయినప్పటికీ, తమ ఇంట్లో కోడళ్ళు ఎప్పుడూ ఆ వస్త్రధారణలో తన కంటికి కనిపించలేదని ఆయన గర్వంగా చెప్పుకున్నారు. తాను ఏదో చాలా గొప్ప పని చేస్తున్నానని చెప్పడం లేదని, అప్పట్లో తన ఆలోచనా విధానం అలా ఉండేదని ఆయన స్పష్టం చేశారు.
గొల్లపూడి మనవరాళ్ళ ఏం చేస్తున్నారంటే?
తాను సంప్రదాయ బద్ధమైన బ్రాహ్మిణ్ నేపథ్యం నుండి వచ్చినందువల్లనే ఆ రకమైన భావజాలంతో పెరిగానని గొల్లపూడి మారుతీరావు వివరించారు. అయితే, కాలం మారుతున్న కొద్దీ కొత్త తరంలో వస్తున్న మార్పులను కూడా ఆయన గమనించారు. తన పెద్దబ్బాయి ఆధునిక కాలానికి తగినట్లుగా తన పిల్లల (మనమరాళ్లు) వస్త్రధారణ విషయంలో వేరే విధంగా ఆలోచించేవారని తెలిపారు.
తన మనమరాళ్లు జీన్స్ ప్యాంట్లు, ఇతర ఆధునిక దుస్తులు ధరిస్తుంటారని, వాటి పేర్లు కూడా తనకు సరిగ్గా తెలియవని ఆయన అన్నారు. "కాలం మారుతోంది, నీకు వీలైతే వాళ్లను ఆపి చూడు" అని తన కొడుకు తనతో అన్నట్లుగా మారుతీరావు గుర్తుచేసుకున్నారు.
అంగీకరించక తప్పదు..
కాలం మారుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ దానిని అంగీకరించక తప్పదని గొల్లపూడి అభిప్రాయపడ్డారు. తాను గతం నుండి వస్తున్న సాంప్రదాయ కట్టుబాట్లను ఇష్టపడినప్పటికీ, మారుతున్న కాలానికి తగినట్లుగా భావాలను పూర్తిగా మార్చుకోలేకపోయినా, కొత్త తరపు ఆలోచనలను క్రమంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఒక కాలపు విలువలకు, నేటి ఆధునిక జీవన శైలికి మధ్య ఉండే అంతరాన్ని ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు.
గొల్లపూడి మారుతీరావు పాత తరపు సాంప్రదాయాలు గల వ్యక్తిగా తన కుటుంబంలో కొన్ని కట్టుబాట్లు పాటించినప్పటికీ, మారుతున్న కాలం ముందు పాత నిబంధనలు ఎక్కువ కాలం నిలవవని, కాలంతో పాటు వచ్చే మార్పులను సమాజం ఎలా స్వీకరిస్తుందో ఆయన తన జీవిత అనుభవాల ద్వారా స్పష్టం చేశారు.













