MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Smallest War: కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన యుద్ధం.. ఏఏ దేశాల మధ్యే జరిగిందో తెలుసా?

Smallest War: కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన యుద్ధం.. ఏఏ దేశాల మధ్యే జరిగిందో తెలుసా?

Smallest War: ప్రపంచంలో అతి తక్కువ సమయంలో ముగిసిపోయిన యుద్ధం గురించి తెలుసా? ఆ యుద్ధం ఏఏ దేశాల మధ్య జరిగిందో, అంత తక్కువ సమయంలో యుద్ధం ఎలా ముగిసిపోయిందో ఇక్కడ వివరించాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 20 2026, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అతి చిన్న యుద్ధం
Image Credit : Chat Gpt

అతి చిన్న యుద్ధం

యుద్ధం అంటే రోజులు, నెలలు, కొన్నిసార్లు ఏళ్ల తరబడి సాగుతుందని అనుకుంటాం. కానీ చరిత్రలో ఓ యుద్ధం మాత్రం కేవలం 38 నిమిషాల్లోనే ముగిసింది. అదే బ్రిటన్, జాంజిబార్ మధ్య జరిగిన యుద్ధం. 1896 ఆగస్టు 27న జరిగిన ఈ పోరాటం ప్రపంచ చరిత్రలో అతి తక్కువ సమయం సాగిన యుద్ధంగా గుర్తింపు పొందింది. జాంజిబార్ ప్రస్తుతం తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో భాగంగా ఉంది. అప్పట్లో అక్కడ సుల్తాన్ హమద్ బిన్ తువైనీ పాలించేవారు. ఆయన మరణించిన తర్వాత ఖలీద్ బిన్ బర్ఘష్ బ్రిటన్ అనుమతి లేకుండానే సింహాసనాన్ని అధిష్ఠించారు. అప్పటికే జాంజిబార్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తున్న బ్రిటన్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దీంతో రెండు పక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బ్రిటన్ హెచ్చరికను పట్టించుకోకపోవడంతో
Image Credit : Pixabay

బ్రిటన్ హెచ్చరికను పట్టించుకోకపోవడంతో

ఖలీద్ సింహాసనం నుంచి దిగిపోవాలని బ్రిటన్ అధికారులు హెచ్చరించారు. ఇందుకోసం గడువు కూడా విధించారు. అయినా ఖలీద్ వెనక్కి తగ్గలేదు. తనకు మద్దతుగా ఉన్న సైనికులతో రాజభవనం చుట్టూ రక్షణ ఏర్పాటు చేశారు. 1896 ఆగస్టు 27న ఉదయం గడువు ముగిసిన తర్వాత బ్రిటిష్ నౌకాదళం దాడి ప్రారంభించింది. ఉదయం 9.02 గంటలకు మొదలైన బాంబుల దాడితో రాజభవనం తీవ్రంగా దెబ్బతింది. జాంజిబార్ సైనికులు బ్రిటన్ ఆధునిక ఆయుధాలను ఎదుర్కోలేకపోయారు. రాజభవనం మంటల్లో చిక్కుకుంది. చివరకు ఉదయం 9.40 గంటలకు జాంజిబార్ సైనికులు తెల్లజెండా ఎగురవేసి లొంగిపోయారు. దీంతో కేవలం 38 నిమిషాల్లోనే యుద్ధం ముగిసింది.

33
500 మందికి పైగా ప్రాణనష్టం..
Image Credit : Pixabay

500 మందికి పైగా ప్రాణనష్టం..

ఈ యుద్ధంలో జాంజిబార్‌కు చెందిన సైనికులు, పౌరులు కలిపి సుమారు 500 మంది మరణించినట్లు లేదా గాయపడినట్లు చారిత్రక నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్ తరఫున ఒక నావికుడు గాయపడ్డాడు. యుద్ధం మొదలైన కొద్దిసేపటికే ఖలీద్ రాజభవనం నుంచి తప్పించుకుని జర్మనీ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందారు. ఆ తర్వాత ఆయన జాంజిబార్‌ను విడిచిపెట్టారు. బ్రిటన్ మద్దతున్న హమూద్ బిన్ మహమ్మద్‌ను కొత్త సుల్తాన్‌గా నియమించారు. ఈ యుద్ధం కేవలం 38 నిమిషాలే సాగినా, జాంజిబార్‌పై బ్రిటన్ ఆధిపత్యం మరింత బలపడింది. ఆధునిక ఆయుధాలు, సైనిక బలం మధ్య ఉన్న తేడా ఒక చిన్న రాజ్యంపై ఎంతటి ప్రభావం చూపగలదో ఈ సంఘటన చరిత్రలో గుర్తుండిపోయింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River Water: న‌దుల్లో నీరు ఎందుకు తియ్య‌గా ఉంటాయో తెలుసా.?
Recommended image2
Train: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చైన్ లాగితే ఏం జరుగుతుంది? చైన్ ఎవరు లాగారో ఎలా తెలుస్తుంది?
Recommended image3
Blue River: మనదేశంలో ఏకైక ‘నీలం రంగు నది’ ఎక్కడ ఉంది? ఈ నది నీళ్లు అంత నీలం రంగులో ఎందుకుంటాయి?
Related Stories
Recommended image1
Blue River: మనదేశంలో ఏకైక ‘నీలం రంగు నది’ ఎక్కడ ఉంది? ఈ నది నీళ్లు అంత నీలం రంగులో ఎందుకుంటాయి?
Recommended image2
Gold: తులం బంగారం అంటే ఎన్ని గ్రాములు? పది గ్రాములా? లేక అంతకన్నా ఎక్కువ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved