Planet with Diamonds: వజ్రాలతో నిండి గ్రహం ఇది, భూమికి ఎంత దగ్గరగా ఉందో తెలుసా?
వజ్రం పేరు చెబితేనే అందరి కళ్ళు ఒక్కసారిగా విచ్చుకుంటాయి. అలాంటిది పూర్తిగా వజ్రాలతోనే ఏర్పడిన గ్రహం గురించి ఇక్కడ మేము చెప్పబోతున్నాం. ఈ గ్రహం భూమి కంటే ఐదు రెట్లు పెద్దదైనది. దీనిపై చిన్న గులకరాయి కూడా కోట్ల విలువచేసే వజ్రమే.

అత్యంత రహస్య గ్రహం
అంతరిక్షంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు నాసా, ఇస్రో సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు రహస్యాలను వెలికి తీసే పనిలోనే ఉంటారు. ఇప్పుడు మన గెలాక్సీలో ఉన్న అత్యంత రహస్యమైన గ్రహం గురించి బయటపడింది. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారము ఈ గ్రహం పూర్తిగా వజ్రాలతో తయారైంది. ఇది భూమి కంటే ఐదు రెట్లు పెద్దది కూడా.
ఎంత దూరంలో ఉంది?
నాసా ఈ కొత్త గ్రహాన్ని కనిపెట్టింది. ఈ గ్రహాన్ని చేరుకోవాలంటే 41 కాంతి సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వజ్రాపు గ్రహాన్ని సూపర్ ఎర్త్ విభాగంలోనే పెట్టారు. శాస్త్రవేత్తలు అయితే ఈ గ్రహం పై ఉష్ణోగ్రత మనుషులు జీవించడానికి వీలుగా ఉండదని చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
అన్నీ వజ్రాలే
ఈ అద్భుతమైన గ్రహానికి ‘55 కాన్ క్రి’ అనే పేరును పెట్టారు. ఈ గ్రహాన్ని నాసాకు చెందిన జేమ్స్ బేస్ టెలిస్కోపు కనిపెట్టింది. నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న ప్రకారం ఈ గ్రహం పై భారీగా వజ్రాలు లభించే అవకాశం ఉంది. ఈ గ్రహంలో సగభాగం వజ్రాలు మిగతా సగభాగం గ్రాఫైట్, కార్బన్ తో తయారైనట్టు చెబుతున్నారు.
వాతావరణం భిన్నంగా...
ఈ గ్రహం పై వాతావరణం భూమి కంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి మనుషుల జీవించే అవకాశం తక్కువే అని చెప్పుకోవాలి. ఇది చాలా వేడి గ్రహంగా చెబుతున్నారు. దాని ఉష్ణోగ్రత 2400 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ వజ్రాలు ఎక్కువగా ఏర్పడి ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు.
ఆ గ్రహంపై అడుగుపెడితే...
ఈ గ్రహాన్ని టెలిస్కోపులో చూస్తున్నప్పుడు కరిగిపోయిన లావా లాగా మెరుస్తూ కనిపిస్తుంది. దీనిపై ఉన్న వేడి కారణంగా ఈ గ్రహం పై జీవం ఉండే అవకాశం దాదాపు అసాధ్యమైనది అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిపైన ఉండే వజ్రాలను భూమి మీదకు తెస్తే కోట్లకు కోట్లు సంపద పెరిగే అవకాశం ఉంది. కానీ వాటిని తీసుకురావడం మాత్రం చాలా కష్టం. ఆ గ్రహం మీదకి వెళ్ళాక ఆ వేడిని తట్టుకోవడం అందరివల్ల కాదు. దాని కోసం నాసా ఏదైనా స్పెషల్ ఆస్ట్రోనాట్ సూట్ ను తయారు చేయాల్సి ఉంటుంది.