- Home
- Feature
- Best Sunset Spots : ఇక్కడినుండి సూర్యాస్తమయం చూడటం వర్త్ వర్మ వర్త్ .. ఈ దసరా సెలవుల్లో ప్లాన్ చేసుకొండి
Best Sunset Spots : ఇక్కడినుండి సూర్యాస్తమయం చూడటం వర్త్ వర్మ వర్త్ .. ఈ దసరా సెలవుల్లో ప్లాన్ చేసుకొండి
Best Sunset Spots : సూర్యోదయం, సూర్యస్తమయ దృశ్యాలు కొన్ని ప్రాంతాల నుండి చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని బీచ్‌లు, ఎడారులు, కొండల పైనుంచి ఆకాశంలో అందాలను ఆస్వాదించవచ్చు. ఇలా ఇండియాలో 6 అద్భుతమైన సన్‌సెట్ స్పాట్స్ ఏవో చూద్దాం.

1. కన్యాకుమారి
Best Sunset Spots : సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటానికి కన్యాకుమారి ఉత్తమమైన ప్రదేశం. మూడు సముద్రాల (అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలు) కలిసేచోట సూర్యోదయం, సూర్యాస్తమయం చూడవచ్చు. ఉదయం ఈ సముద్రపు నీటిలోంచి అలా బయటకు వచ్చే సూర్యుడు సాయంత్రం అదే సముద్రంలో మెళ్లిగా మునిగిపోతాడు... ఈ రెండు దృశ్యాలను సముద్రం ఒడ్డున కూర్చుని ఆస్వాదించవచ్చు.
2. పుష్కర్ సరస్సు
రాజస్థాన్ అజ్మీర్ జిల్లాలోని పుష్కర్ పట్టణంలో ఉంది ఈ సరస్సు. స్వయంగా బ్రహ్మదేవుడే ఈ సరస్సును సృష్టించాడని హిందువులు నమ్ముతారు. ప్రతిరోజు సూర్యాస్తమయం సమయంలో ఆకాశం నారింజ రంగులోకి మారడం… ఆ రంగులు పుష్కర్ సరస్సులో ప్రతిబింబించడం చూడొచ్చు. ప్రశాంతమైన సూర్యాస్తమయ దృశ్యాలు కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక.
3. రాధానగర్ బీచ్
ఆసియాలోని అత్యంత అందమైన బీచ్‌లలో రాధానగర్ బీచ్ ఒకటి. ఇది అండమాన్ దీవులలో ఉంది. నీలిరంగులో సముద్రపు నీరు అలలు అలలుగా ఎగసిపడుతుంటే... తెల్లగా మెరిసిపోయే ఇసుకలో కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సూర్యాస్తమయాన్ని చూడొచ్చు.
4. రాన్ ఆఫ్ కచ్
ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఎడారుల్లో గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ ఒకటి. ఇలాంటి విశాలమైన ఉప్పు ఎడారిలో అద్భుతమైన సూర్యాస్తమయాన్ని చూడటం ఒక ప్రత్యేక అనుభూతి. ముఖ్యంగా రాన్ ఉత్సవ్ సమయంలో అయితే జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను అందిస్తుంది.
5. తాజ్ మహల్
ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో యమునానది ఒడ్డునగల అందమైన కట్టడం తాజ్ మహల్. ఇక్కడ యమునా నది నీరు, తాజ్ మహల్ అందాల చాటుకు సూర్యుడు జారిపోతుంటే ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఇలా సూర్యుడు అస్తమించడాన్ని ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది.. మరి కనులారా చూస్తే ఇంతకంటే గొప్ప దృశ్యం మరొకటి ఉండదని అంటారు.
6. వర్కాల
కేరళలోని అందమైన పర్యాటక ప్రాంతం వర్కాలా. ఇక్కడ అరేబియా సముద్రంలో సూర్యుడు మునిగిపోతున్నాడేమో అనిపించేలా అస్తమించడాన్ని ఒక కొండపై వ్యూ పాయింట్ నుంచి చూడొచ్చు. ప్రశాంతమైన బీచ్, అందమైన సూర్యాస్తమయ దృశ్యాల చూడటానికే వర్కాల వెళ్లవచ్చు.