MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Feature
  • Car Tyres: టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి.? వేరే కలర్‌లో ఎందుకు ఉండవో ఆలోచించారా.?

Car Tyres: టైర్లు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి.? వేరే కలర్‌లో ఎందుకు ఉండవో ఆలోచించారా.?

Car Tyres: కార్లు, బైకులు, బస్సులు ఏవైనా వాటి టైర్లన్నీ నలుపు రంగులోనే ఉంటాయి. అయితే ఇదేదో యాదృశ్చికం కాదు. టైర్ల‌న్నీ ఒకే రంగులో ఉండ‌డం వెన‌కాల శాస్త్రీయ కారణం ఉందని మీకు తెలుసా.? ఇంత‌కీ దీని వెన‌కాల ఉన్న అస‌లు సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 25 2026, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొదట్లో టైర్లు నలుపు రంగులో ఉండేవి కావు
Image Credit : Gemini AI

మొదట్లో టైర్లు నలుపు రంగులో ఉండేవి కావు

వాహనాల ప్రారంభ దశలో టైర్లు సహజ రబ్బరుతో తయారయ్యేవి. ఆ రబ్బరు స్వభావం వల్ల టైర్లు తెలుపు లేదా లేత గోధుమ రంగులో కనిపించేవి. అయితే అవి ఎక్కువ కాలం మన్నేవి కాదు. రోడ్లపై ఉండే వేడి, వాహనం బరువు, ఘర్షణ వంటి అంశాలను ఎక్కువసేపు తట్టుకోలేక త్వరగా దెబ్బతినేవి. దీంతో మరింత బలమైన టైర్ల అవసరం ఏర్పడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కార్బన్ బ్లాక్ వల్లే టైర్లకు నలుపు రంగు
Image Credit : Social Media

కార్బన్ బ్లాక్ వల్లే టైర్లకు నలుపు రంగు

టైర్ల తయారీలో రబ్బరుతో పాటు "కార్బన్ బ్లాక్" అనే ప్రత్యేక పొడిని కలుపుతారు. ఈ పదార్థమే టైర్లకు నలుపు రంగును ఇస్తుంది. కానీ దీని పని కేవలం రంగు మార్చడం మాత్రమే కాదు. కార్బన్ బ్లాక్ రబ్బరును మరింత గట్టిగా, బలంగా మారుస్తుంది. దీనివల్ల టైర్లు త్వరగా అరిగిపోవు. ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే రోడ్లపై మెరుగైన పనితీరును చూపుతాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని టైర్ల తయారీలో ఈ పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు.

Related Articles

Related image1
Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్‌కు మూడు రెక్క‌లే ఎందుకు ఉంటాయి.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే
Related image2
AC Tips: ఏసీని ఇలా వాడితే క‌రెంట్ బిల్లు స‌గానికి త‌గ్గుతుంది.. సింపుల్ టిప్స్
35
అధిక వేడి నుంచి టైర్లకు రక్షణ
Image Credit : FREEPIK

అధిక వేడి నుంచి టైర్లకు రక్షణ

వాహనం ప్రయాణిస్తున్నప్పుడు టైర్లు రోడ్లతో నిరంతరం తాక‌డం వల్ల వేడెక్కుతాయి. వేసవికాలంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. కార్బన్ బ్లాక్ ఈ వేడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని వల్ల టైర్లు అధిక ఉష్ణోగ్రతల కారణంగా బలహీనపడకుండా ఉంటాయి. ఒకవేళ ఈ పదార్థం లేకపోతే రబ్బరు త్వరగా పగిలిపోవడం లేదా చిట్లిపోవడం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల టైర్ల జీవితకాలం కూడా తగ్గిపోతుంది.

45
రోడ్డు భద్రతలో కీలక పాత్ర
Image Credit : our own

రోడ్డు భద్రతలో కీలక పాత్ర

నలుపు రంగు టైర్లు వాహన భద్రతలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కార్బన్ బ్లాక్ కలిగిన టైర్లు రోడ్డుపై మంచి గ్రిప్‌ను అందిస్తాయి. దీనివల్ల బ్రేక్ వేస్తే వాహనం సులభంగా నియంత్రణలోకి వస్తుంది. వర్షాకాలం లేదా అధిక వేగంతో ప్రయాణించే సమయంలో కూడా టైర్లు రోడ్డుపై మెరుగైన పట్టును కలిగి ఉంటాయి. దీంతో ప్రమాదాల అవకాశాలు తగ్గుతాయి. టైర్లు అధిక వేడి కారణంగా పేలిపోయే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.

55
రంగుల టైర్లు ఎందుకు విజయవంతం కాలేదు?
Image Credit : Google

రంగుల టైర్లు ఎందుకు విజయవంతం కాలేదు?

గతంలో కొన్ని కంపెనీలు ఎరుపు, నీలం, తెలుపు వంటి రంగుల టైర్లను తయారు చేయడానికి ప్రయత్నించాయి. అయితే అవి నలుపు టైర్లతో పోలిస్తే అంత బలంగా, మన్నికగా ఉండలేకపోయాయి. వేడి తట్టుకునే సామర్థ్యం కూడా తక్కువగా ఉండేది. దీంతో యూజ‌ర్లు కూడా నలుపు టైర్లకే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ప్రస్తుతం చిన్న కార్ల నుంచి భారీ ట్రక్కులు, రేసింగ్ కార్ల వరకు అన్ని వాహనాల్లో నలుపు రంగు టైర్లే ఉపయోగిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ లీక్ కాకుండా ఉండాలంటే.. ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేయండి
Recommended image2
న‌మ్మ‌క ద్రోహం మ‌హా పాపం.. త‌ప్పు చేసి త‌ప్పించుకోవ‌డం అసాధ్యమ‌ని చెప్పే క‌థ
Recommended image3
IRCTC గోదావరి టెంపుల్ టూర్: అంతర్వేది, అన్నవరం, ద్రాక్షారామ క్షేత్రాల దర్శనం.. బడ్జెట్‌లో ఇవి ఫ్రీ
Related Stories
Recommended image1
Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్‌కు మూడు రెక్క‌లే ఎందుకు ఉంటాయి.? దీనికి అస‌లు కార‌ణం ఏంటంటే
Recommended image2
AC Tips: ఏసీని ఇలా వాడితే క‌రెంట్ బిల్లు స‌గానికి త‌గ్గుతుంది.. సింపుల్ టిప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved