- Home
- Feature
- రెండు పూటలా తిండి తినలేరు.. రూ.100 కోట్ల ఆస్తి కావాలి, గరికపాటి చురకలు ఎవరి గురించి తెలుసా?
రెండు పూటలా తిండి తినలేరు.. రూ.100 కోట్ల ఆస్తి కావాలి, గరికపాటి చురకలు ఎవరి గురించి తెలుసా?
కోట్లకు కోట్లు డబ్బు సంపాదించినవారందరు చాలా హ్యాపీగా ఉంటారా? 100కోట్ల ఆస్తులు ఉంటే కడుపునిండా తిండి తినవచ్చా? ఒక్క చపాతి తినడం కోసం 100 కోట్లు సంపాదించేది ఎవరు? ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి చెప్పిన జీవిత సత్యం ఏంటి?
రెండు పూటలా తిండి కూడా తినలేరు
మనం నిత్య జీవితంలో డబ్బు సంపాదించడమే పరమావధిగా భావిస్తాం. కోట్లు సంపాదిస్తే సకల సౌకర్యాలు లభిస్తాయని, జీవితం ఆనందంగా సాగిపోతుందని చాలా మంది నమ్ముతారు. అయితే, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మాత్రం ఈ విషయంపై తనదైన స్టైల్ లో పంచ్ లు వేస్తూ.. చురకలు వేశారు. సమాజంలోని ఒక కఠినమైన వాస్తవాన్ని ఎత్తిచూపారు. విపరీతంగా ఆస్తులు, కోట్లు సంపాదించే కొంతమంది కోటీశ్వరులు కనీసం రెండు పూటలా మనసారా తిండి కూడా తినలేని స్థితిలో ఉంటారని ఆయన పేర్కొన్నారు.
ఒక్క చపాతికోసం 100 కోట్లా..
డబ్బు ఎంత ఉన్నప్పటికీ, ఆరోగ్యం సహకరించకపోతే ఆ సంపద వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. చాలామంది ధనవంతులు ఆరోగ్య సమస్యల కారణంగా (బీపీ, షుగర్ వంటివి) కడుపు నిండా నచ్చిన ఆహారాన్ని తినలేక, కేవలం ఒక్క చపాతి తింటూ ఉడకని జీవితాన్ని గడుపుతుంటారని, దాని కోసం 100 కోట్లు సంపాదించడం ఎందుకని కామెంట్ చేశారు. కోట్లు సంపాదించడం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, చివరకు ఆ డబ్బును అనుభవించే అదృష్టం కూడా కోల్పోవడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
కష్టపడే ఆటో డ్రైవర్ జీవితం చాలా హాయి
అంతేకాకుండా, తిండి తినడానికి నోచుకోని, కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు లేని, ప్రశాంతంగా నిద్రపోలేని స్థితిలో ఉన్నవారు కోట్లకు అధిపతులైతే లాభం ఏమిటని నిలదీశారు. దీనికి విరుద్ధంగా, ఎలాంటి ఆస్తులు లేకపోయినా, ఎలాంటి టెన్షన్లు లేకుండా ఆటో నడుపుకుంటూ జీవించే సాధారణ డ్రైవర్ హాయిగా రాత్రి నిద్రపోగలడని, కానీ నిద్రలేని రాత్రులు గడిపే కోటీశ్వరులు ఆటో డ్రైవర్ జీవితాన్ని చూసి అసూయపడే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.
శారీరక ఆరోగ్యం - మానసిక ప్రశాంతత ముఖ్యం
ఈ ప్రవచనం ద్వారా మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే – జీవితంలో సంపద ఎంత ముఖ్యమో, శారీరక ఆరోగ్యం - మానసిక ప్రశాంతత అంతకంటే ఎంతో ముఖ్యం. కేవలం డబ్బు వెనుకే పరుగులు పెడుతూ, తిండి నిద్రలను త్యాగం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఉన్నంతలో సంతోషంగా జీవించడమే నిజమైన విజయమని చక్కటి సందేశాన్ని ఇచ్చారు.

