Astro tips: స్నానం చేసే నీళ్లలో వీటిని కలిపారంటే.. మీకు అదృష్టం వరిస్తుంది
కష్టపడినా ఆశించిన ఫలితాలను పొందని వారు చాలా మందే ఉంటారు. వాస్తు ప్రకారం.. కొన్ని పనులను చేస్తే మీరు చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మీరు రోజూ స్నానం చేసే నీళ్లలో కొన్నింటిని కలిపి స్నానం చేస్తే దురదృష్టం కాస్త అదృష్టంగా మారుతుంది.
హిందూ మతంలో జ్యోతిష్యాన్ని ఎంతో ముఖ్యమైందిగా భావిస్తారు. జ్యోతిష్యుల ప్రకారం.. జ్యోతిష్య నియమాలను పాటిస్తే ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపితే మీ జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చిపాలు
అవును స్నానం చేసే నీటిలో పచ్చిపాలను కలిసి స్నానం చేస్తే రోగాలు దరిచేరవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఇలా స్నానం చేసేవారి వయస్సు కూడా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే కంటిచూపు దెబ్బతినే ప్రమాదం కూడా ఉండదట.
పసుపు
చిటికెడు పసుపు కలిపి నీటితో స్నానం చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది. దీంతో మీరు విధిలో సానుకూల మార్పులను చూస్తారు. పసుపుతో పాటుగా గంధాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే మీ అదృష్టం బాగుంటుంది.
ఉప్పు
మీరు రోజూ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేస్తే నెగెటివ్ ఎనర్జీ మీ నుంచి దూరమవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే ఆగిపోయిన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
రోజ్ వాటర్
రోజ్ వాటర్ మన అందాన్ని పెంచుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అయితే ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో రెండు చుక్కల రోజ్ వాటర్ కలిపి స్నానం చేయడం వల్ల కూడా ప్రయోజనాలను పొందుతారు. జ్యోతిష్యం ప్రకారం.. ఇలా స్నానం చేయడం వల్ల మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. అలాగే యాలకులను నీటిలో వేసి స్నానం చేస్తే నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.