MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Top Egg Producing State : దేశంలోని ప్రతి 3 కోడిగుడ్లలో 1 తెలుగు రాష్ట్రానిదే.. ఏపీ, తెలంగాణలో ఎన్ని గుడ్లు ఉత్పత్తవుతాయో తెలుసాా?

Top Egg Producing State : దేశంలోని ప్రతి 3 కోడిగుడ్లలో 1 తెలుగు రాష్ట్రానిదే.. ఏపీ, తెలంగాణలో ఎన్ని గుడ్లు ఉత్పత్తవుతాయో తెలుసాా?

భారతదేశంలో కోడిగుడ్లను ఉత్పత్తిచేసే రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ టాప్ లో ఉన్నాయి. మరి ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా గుడ్లను ఉత్పత్తిచేసే రాష్ట్రమేదో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
Published : Nov 09 2026, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోడి గుడ్ల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలే టాప్
Image Credit : Gemini AI

కోడి గుడ్ల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలే టాప్

భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, ఆక్వా రంగాలతో పాటు పౌల్ట్రీ పరిశ్రమ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా కోడిగుడ్ల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఔత్సాహిక రైతులు వేలాది పౌల్ట్రీ ఫారాలు నిర్వహిస్తున్నారు.. దీంతో ప్రపంచంలోనే కోడిగుడ్ల ఉత్పత్తిలో ఇండియా టాప్ 2 లో ఉంది.

అయితే ఇండియాలోనే కొన్ని రాష్ట్రాలు మాంసం ఉత్పత్తిలో, మరికొన్ని గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ పౌల్ట్రీ రంగంలో తెలుగు రాష్ట్రాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది… ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా కోడిగుడ్లను ఉత్పత్తి చేస్తూ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు తెలంగాణ కూడా గుడ్ల ఉత్పత్తిలో గణనీయమైన వాటాను కలిగివుంది. అసలు దేశంలో ఏ రాష్ట్రం ఎన్ని గుడ్లను ఉత్పత్తి చేస్తోంది? తెలుగు రాష్ట్రాల వాటా ఎంత? తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ టాప్
Image Credit : Gemini AI

కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ టాప్

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో ఏకంగా 2,739 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తయ్యాయి. దేశవ్యాప్తంగా ఇదే కాలంలో మొత్తం 14,911 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా.. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా సుమారు 18.4 శాతంగా ఉంది. అంటే దేశంలో ఉత్పత్తయ్యే ప్రతి 100 గుడ్లలో దాదాపు 18 గుడ్లు ఏపీ నుంచే వచ్చాయన్నమాట.

ఏపీలో పౌల్ట్రీ పరిశ్రమ విస్తరణకు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు పౌల్ట్రీ రంగానికి కీలక కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నారు. వ్యాపారులు ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ, కోళ్ల పెంపకం నుంచి గుడ్ల సేకరణ, నిల్వ, సరఫరా వరకు వివిధ దశల్లో మెరుగైన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. దీంతో ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు మార్కెట్‌కు నిరంతరం గుడ్ల సరఫరా జరుగుతోంది.

రెండో స్థానంలో తమిళనాడు

ఆంధ్రప్రదేశ్ తర్వాత కోడిగుడ్ల ఉత్పత్తిలో తమిళనాడు రెండో స్థానంలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మొత్తం గుడ్లలో ఈ రాష్ట్రం వాటా సుమారు 15 శాతంగా ఉంది.

తమిళనాడులో పౌల్ట్రీ పరిశ్రమకు మంచి ఆదరణ ఉంది... పెద్ద ఎత్తున కోళ్ల ఫారాలు నిర్వహిస్తుండటంతో పాటు గుడ్ల ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా వాణిజ్య స్థాయిలో కోళ్ల పెంపకం ఈ రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతోంది.

35
మూడో స్థానంలో తెలంగాణ
Image Credit : Getty

మూడో స్థానంలో తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలంగాణ కూడా కోడిగుడ్ల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే గుడ్లలో తెలంగాణ వాటా సుమారు 13 శాతంగా ఉంది. ఈ గణాంకాలతో దేశంలోనే మూడో అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది.

తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ముఖ్యమైన మార్కెట్లుగా ఉన్నాయి. కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తి, రవాణా, విక్రయాల ద్వారా ఈ రంగం అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే గుడ్లు స్థానిక అవసరాలను తీర్చడంతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా సరఫరా అవుతున్నాయి.

దేశ గుడ్ల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గణాంకాలను కలిపి చూస్తే తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఏపీలో 2,739 కోట్లు, తెలంగాణలో సుమారు 1,734 కోట్లు గుడ్లు ఉత్పత్తవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 4,473 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మొత్తం గుడ్లలో ఈ రెండు రాష్ట్రాల వాటానే దాదాపు 30 శాతం. అంటే భారతదేశంలో ఉత్పత్తయ్యే ప్రతి మూడు గుడ్లలో దాదాపు ఒకటి తెలుగు రాష్ట్రాల నుంచే వస్తోందన్నమాట. ఇది దక్షిణ భారతదేశంలో పౌల్ట్రీ పరిశ్రమ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది.

45
ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది?
Image Credit : X

ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది?

కోడి గుడ్ల ఉత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాలే కాకుండా తూర్పు, దక్షిణ భారతదేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా కీలకంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ దేశంలోని ప్రధాన గుడ్ల ఉత్పత్తి రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉంది. జాతీయ ఉత్పత్తిలో ఈ రాష్ట్రం వాటా సుమారు 10.72 శాతంగా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న కర్ణాటక కూడా ఈ రంగంలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే కోడిగుడ్లలో కర్ణాటక వాటా సుమారు 6.67 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలు భారతదేశ గుడ్ల ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.

55
పౌల్ట్రీ రంగానికి తెలుగు రాష్ట్రాలు కీలకం
Image Credit : AI

పౌల్ట్రీ రంగానికి తెలుగు రాష్ట్రాలు కీలకం

కోడిగుడ్లు ప్రజలకు అందుబాటులో ఉండే పోషకాహార వనరుల్లో ఒకటి. ప్రోటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందించే గుడ్లకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న వినియోగానికి అనుగుణంగా ఉత్పత్తిని కొనసాగించడం పౌల్ట్రీ పరిశ్రమకు కీలకం.

ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో, తెలంగాణ మూడో స్థానంలో ఉండటం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా గుడ్ల ఉత్పత్తిలో ముందుండటంతో దక్షిణ భారతదేశం ఈ రంగానికి ప్రధాన కేంద్రంగా మారింది. ఆధునిక పౌల్ట్రీ ఫారాలు, మెరుగైన నిర్వహణ పద్ధతులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి కొనసాగితే రానున్న రోజుల్లో ఈ రంగం మరింత విస్తరించే అవకాశం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 
1st TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(59.5 ov)246/4
SLSL
-
Day 1 - Session 3
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
Result
ARACARAC
114/1
RDCRDC
112/6
Arabian Aces beat Royal Desert Champions by 9 wickets
Schedule ›
5th T10 • ABDT10
Result
UNTUNT
126/6
UABUAB
101/4
United Tigers won by 25 runs
Schedule ›
4th T10 • ABDT10
Result
YASLYASL
117/4
EEEE
115/4
Yas Lions beat Emirates Eagles by 6 wickets
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
10th T10 • ABDT10
UABUAB
Tue, 10 Nov, 2026
EEEE
09:30 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Fri, 13 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
World's Cleanest Country: ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశం ఏదో తెలుసా? 2026 లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన కంట్రీ
Recommended image2
ఆ దేశంలో ఏడాదికి 1500 భారీ భూకంపాలు.. అయినా ఆ దేశంలోని ఒక్క భవనానికి కూడా ఏమీ కాదు, ఇదెలా?
Recommended image3
Top 10 Tourist Places: తెలంగాణ టాప్ 10 టూరిస్ట్ స్పాట్స్ ఇవే.. లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే !
Related Stories
Recommended image1
Chicken vs Fish vs Eggs: రోజూ నాన్‌వెజ్ తింటున్నారా? చేపలు, చికెన్, గుడ్లు..ఈ మూడింటిలో ఏది బెటర్?
Recommended image2
Eggs: రోజుకి ఎన్ని కోడిగుడ్లు తినాలి? మరీ ఎక్కువగా తింటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved