MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Salary: ఆఫ్రికాలో స్కూల్ టీచర్ల జీతం ఎంత ఉంటుంది? ఫీజులు ఎంత వసూలు చేస్తారో తెలుసా?

Salary: ఆఫ్రికాలో స్కూల్ టీచర్ల జీతం ఎంత ఉంటుంది? ఫీజులు ఎంత వసూలు చేస్తారో తెలుసా?

Salary: ఆఫ్రికా అనగానే ముందుగా పేదరికం గుర్తుకు వస్తుంది. అక్కడ పరిస్థితుల గురించి యూట్యూబర్లు కళ్లకు కట్టినట్టు నిజాలు చూపిస్తుంటారు. మరి ఆఫ్రికా దేశాల్లో స్కూల్ పిల్లల ఫీజులు ఎంత ఉంటాయి? టీచర్లకు ఎంత శాలరీ ఇస్తారో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 17 2026, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దేశం బాగుండాలి అంటే అందరు చదువుకోవాలి..
Image Credit : Uma Telugu Traveller

దేశం బాగుండాలి అంటే అందరు చదువుకోవాలి..

పేద దేశాలతో కూడిన ఆఫ్రికా ఖండం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది. ఆఫ్రికాలో కొన్ని దేశాలు ఇప్పటికే అభివృద్ది చెందాయి. మరికొన్ని డెవలప్ అవుతున్నాయి. కాని కొన్ని దేశాలు మాత్రం దరిద్రంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. దేశం బాగుపడాలంటే అక్కడి ప్రజలు చదువుకోవడం చాలా ముఖ్యం. ఆఫ్రికాలో స్కూల్స్ ఎలా ఉంటాయి? టీచర్లకు ఎంత జీతం ఇస్తుంటారు? ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య తేడా ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్కూల్ టీచర్ల జీతాలు ఎంత ఉంటాయి?
Image Credit : Gemini AI

స్కూల్ టీచర్ల జీతాలు ఎంత ఉంటాయి?

ఆఫ్రికా పర్యటనలో భాగంగా ఒక యూట్యూబర్ చెప్పిన వివరాల ప్రకారం.. గాంబియా (Gambia) దేశంలో అక్కడ స్థానిక ప్రజల జీవన విధానం, పిల్లల చదువులు, పాఠశాలల నిర్వహణ , ఉపాధ్యాయుల జీతభత్యాల గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆఫ్రికాలోని ఒక మారుమూల ప్రాంతంలో విద్యారంగం ఎలా ఉందనే దానిపై ఓ వీడియో వైరల్ అవుతోంది.

గాంబియా వంటి ఆఫ్రికన్ దేశాలలో ఉపాధ్యాయుల జీతాలు పాఠశాల రకాన్ని బట్టి మారుతుంటాయి. ఒక తెలుగు ట్రావెలర్ స్థానికులతో మాట్లాడినప్పుడు వెల్లడైన వివరాల ప్రకారం, ప్రైవేట్ పాఠశాలల్లో.. కొంత మెరుగైన ఉపాధి ఉన్న చోట టీచర్ల జీతాలు సుమారు 200 డాలర్ల వరకు (స్థానిక కరెన్సీలో సుమారు 10,000 నుండి 15,000 గంబియన్ దలాసి) ఉండగా, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయుల వేతనాలు 100 డాలర్లు తక్కువగా ఉంటాయని తేలింది.

34
స్కూల్ ఫీజులు ‌- విద్యా విధానం
Image Credit : Uma Telugu Traveller

స్కూల్ ఫీజులు ‌- విద్యా విధానం

అధికారిక నివేదికల ప్రకారం కూడా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సగటు నెలసరి జీతం వారి అనుభవాన్ని బట్టి మారుతూ వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ ట్యూషన్లపై లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడాల్సి వస్తోందని సమాచారం. ఆఫ్రికాలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, మౌలిక వసతుల కొరత కారణంగా ప్రైవేట్, అరబిక్ స్కూల్స్ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ పిల్లలను బడికి పంపడానికి నానా తంటాలు పడుతుంటాయి. అయినప్పటికీ, అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా మంచి చదువు చెప్పించడమే ముఖ్యమని భావిస్తారు. ఆఫ్రికాలో ఇప్పటికే చాలామంది పిల్లలు చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడగలగడం, రాయడం విశేషం.

44
పేదరికంలోనూ చదువుకు ప్రాధాన్యత
Image Credit : Gemini AI

పేదరికంలోనూ చదువుకు ప్రాధాన్యత

గాంబియాలో తీవ్రమైన పేదరిక పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రజలు విద్య ద్వారానే తమ భవిష్యత్తును మార్చుకోగలమని గట్టిగా నమ్ముతున్నారు. సింగిల్ మదర్స్ సైతం కష్టపడి తమ పిల్లలను ప్రైవేట్ లో కానీ.. ప్రభుత్వ స్కూల్స్ కు కానీ పంపిస్తుంటారు. తమ ఆర్ధిక పరిస్థితిని బట్టి స్కూల్ ను సెలెక్ట్ చేసుకుంటుంటారు. అందులో చాలామంది ఉన్నత చదువులు చదిని వారు కూడా ఉన్నారు. ఇక్కడ స్థానిక భాషలతో పాటు అధికారిక భాషగా ఇంగ్లీష్‌ను బోధిస్తున్నారు. పాఠశాలల్లో సరైన వసతులు లేకపోయినా, పిల్లల్లో చదువుకోవాలనే తపన మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
World Best Cities: ప్రపంచంలో నంబర్ 1 నగరం ఏదో తెలుసా? టాప్ 7 బెస్ట్ సిటీల లిస్ట్ ఇదే
Recommended image2
Weird Tradition: చనిపోయిన వారిని ఇంటి ముందే సమాధి చేసే వింత ఆచారం.. ఎక్కడో తెలుసా?
Recommended image3
భార‌త‌దేశంలో తొలిసారి విద్యుత్ ఎక్క‌డొచ్చింది.? అప్ప‌ట్లో క‌రెంట్ బిల్లు ఎంత ఉండేది
Related Stories
Recommended image1
గవర్నమెంట్ జాబ్ వదిలేసి.. జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన కమెడియన్‌, యాక్టర్‌గా సక్సెస్
Recommended image2
కన్నకొడుకుల్ని విదేశాలకు పంపి.. అక్కడి నుంచి కుక్కల్ని తెచ్చుకుంటున్నారు, గరికపాటి మాస్ కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved