గవర్నమెంట్ జాబ్ వదిలేసి.. జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన కమెడియన్, యాక్టర్‌గా సక్సెస్
Jabardasth: కళాకారుడిగా బ్రతకాలన్న ఆశ ఆ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. ఇండస్ట్రీలో ఎదగాల కోరిక కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకునేలా చేసింది. మంచి జీతం, హ్యాపీ లైఫ్ ను వదిలేసి కంటెస్టెంట్ గా జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన కమెడియన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ కు ఎంతో మంది నటులను అందించిన షో..
బుల్లితెరపై సక్సెస్ ఫుల్ కామెడీ షోలు ఎంతో మంది టాలెంట్ ఉన్న కళాకారులకు జీవితాన్నిచ్చాయి. ముఖ్యంగా జబర్దస్త్ లాంటి షోల ద్వారా టాలీవుడ్ కు చాలామంది కొత్త నటులు పరిచయం అయ్యారు. కొన్ని విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, ఎంతో టాలెంటెడ్ కళాకారులను వెలుగులోకి తీసుకురావడంలో ఇలాంటి షోలు కీలక పాత్ర పోషించాయి. ఈ క్రమంలోనే సాధారణ మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వుల రారాజుగా ఎదిగిన ప్రముఖ కమెడియన్ గురించి మీకు తెలుసా? ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసుకుని జబర్దస్త్ స్టేజ్ ఎక్కింది ఎవరు? ‘ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
చదువులో ప్రతిభ.. ప్రభుత్వ ఉద్యోగం
అతను మరెవరో కాదు వెంకీ మంకీ’ అలియాస్ బొజ్జపల్లి వెంకట్. తెలంగాణ ప్రాంతానికి చెందిన వెంకీ కేవలం నటుడే కాదు, చదువులోనూ టాపర్ . కాకతీయ యూనివర్సిటీ నుంచి మిమిక్రీలో డిప్లమా పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. తన అద్భుతమైన టాలెంట్‌తో వీడియో జాకీగా, మిమిక్రీ , వెంట్రిలాక్విజం ఆర్టిస్టుగా పలు కార్యక్రమాల్లో పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రతిభను గుర్తించిన పలు ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా సింగరేణి సంస్థతో పాటు ఇతర విభాగాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వరించాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే సామాన్యమైన విషయం కాదు, కానీ వెంకీ మాత్రం ఆ అదృష్టాన్ని దక్కించుకున్నారు.
గొప్ప లక్ష్యం కోసం కొలువు త్యాగం
అయితే జీవితంలో స్థిరపడడం కంటే, సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే బలమైన కోరిక వెంకీలో ఉండేది. కేవలం తన ఊరికే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు తనను గుర్తించాలని ఆయన కలలు కన్నారు. ఆ ఆశయం ముందు ప్రభుత్వ ఉద్యోగం చిన్నదిగా అనిపించడంతో, వచ్చిన కొలువును సైతం సునాయాసంగా వదిలేసి తన కలల ప్రపంచం వైపు అడుగులు వేశారు.
జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గా ప్రస్థానం
ఉద్యోగం వదిలిన తర్వాత ఆర్టిస్ట్ గా రాణించాలనే ఉద్దేశంతో ముందుకు సాగిన ఆయనకు ‘జబర్దస్త్’ కామెడీ షో అవకాశం ఇచ్చింది. ఫస్ట్ ఒక సాధారణ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన వెంకీ, తన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, పంచ్ డైలాగ్స్‌తో అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కంటెస్టెంట్ స్థాయి నుంచి ఏకంగా ‘టీమ్ లీడర్’ స్థాయికి ఎదిగి తన సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నప్పటికీ, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు నిరూపించి చూపించాడు వెంకీ మంకీ.
