- Home
- Feature
- Most Dangerous Places: ప్రపంచంలో మనుషులు అడుగుపెట్టడానికి భయపడే 3 అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు
Most Dangerous Places: ప్రపంచంలో మనుషులు అడుగుపెట్టడానికి భయపడే 3 అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు
ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే, కొన్ని ప్రదేశాలు మాత్రం ఎంత అందంగా ఉన్నా.. అంతకంటే ఎక్కువగా ప్రాణాంతకంగా మారుతుంటాయి. అక్కడికి వెళ్లాలంటేనే మనుషులు భయపడతారు. అలాంటి 3 అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు గురించి తెలుసుకుందాం.

డెత్ వాలీ (అమెరికా)
అమెరికాలో ఉన్న డెత్ వాలీ (Death Valley) ప్రపంచంలోనే అత్యంత వేడిగా, కఠినంగా ఉండే ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఏకంగా 56 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయింది.
ఇక్కడ తీవ్రమైన వేడితో పాటు నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. సరైన రక్షణ ఏర్పాట్లు, తగినన్ని నీరు లేకుండా ఈ ప్రాంతంలోకి అడుగుపెడితే, కేవలం కొన్ని గంటల్లోనే తీవ్రమైన డీహైడ్రేషన్ బారిన పడి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే సాహసయాత్రికులు సైతం ఇటువైపు వెళ్లేందుకు వణికిపోతుంటారు.
డానకిల్ డిప్రెషన్ (ఇథియోపియా
ఇథియోపియాలో ఉన్న డానకిల్ డిప్రెషన్ (Danakil Depression) చూసేందుకు అచ్చం వేరే గ్రహం మీద ఉన్న వాతావరణంలా కనిపిస్తుంది. భూగర్భంలోని ప్రత్యేక ఉష్ణోగ్రతల కారణంగా ఈ ప్రాంతం నిత్యం మండిపోతూ ఉంటుంది. ఇక్కడ భూమి అంతర్గత భాగం నుంచి వెలువడే ప్రమాదకరమైన విష వాయువులు, నిత్యం మరిగే వేడినీటి బుగ్గలు ఉంటాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు, గాలిలో నిండే విషపూరిత వాయువులు మనుషులకు క్షణాల్లో ప్రాణాంతకంగా మారవచ్చు. ఎలాంటి రక్షణ లేకుండా ఇక్కడికి వెళ్లడం అసాధ్యం.
నార్త్ సెంటినల్ ఐలాండ్ (భారతదేశం)
భారతదేశంలోని అండమాన్ దీవుల్లో ఉన్న ఈ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, ప్రమాదకరమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ సెంటినలీస్ (Sentinelese) అనే ఆదివాసీ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఈ తెగ ప్రజలు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు కోరుకోరు. ఆధునిక నాగరికతకు పూర్తిగా దూరంగా జీవిస్తూ, తమ ప్రాంతానికి ఎవరైనా వస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
పర్యాటకులు లేదా బయటి వ్యక్తులు ఎవరైనా ఈ ద్వీపంలోకి వెళితే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే భారత ప్రభుత్వం ఈ ద్వీపానికి అనుమతి లేకుండా వెళ్లడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడమే కాకుండా, పూర్తిగా నిషేధించింది. ఇక్కడికి వెళ్లాని ప్రయత్నించి చాలామంది ప్రణాలు కోల్పోయారు. ఈ మూడు ప్రదేశాలు మానవ మనుగడకు అత్యంత సవాలు విసిరే ప్రాంతాలే కాక, ప్రాణాలను బలిగొనే ప్రమాదకరమైన స్థలాలు.













