MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కానీ.. ఇన్నేళ్ల తర్వాత 'జంజీర్' డైరెక్టర్ హాట్ కామెంట్స్

రాంచరణ్ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కానీ.. ఇన్నేళ్ల తర్వాత 'జంజీర్' డైరెక్టర్ హాట్ కామెంట్స్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజెర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం ఇదే. శంకర్ మరోవైపు కమల్ హాసన్ ఇండియన్ 2 తో బిజీగా ఉండడం వల్ల రాంచరణ్ మూవీ ఆలస్యం అవుతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 30 2023, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజెర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం ఇదే. శంకర్ మరోవైపు కమల్ హాసన్ ఇండియన్ 2 తో బిజీగా ఉండడం వల్ల రాంచరణ్ మూవీ ఆలస్యం అవుతోంది.  కానీ శంకర్ మాత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని పవర్ ఫుల్ గా మలుస్తున్నారు. 

26

ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ బాలీవుడ్ దర్శకుల్లో కూడా హాట్ టాపిక్ అయ్యాడు. చరణ్ తో పాన్ ఇండియా చిత్రాలు చేసేందుకు పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు, దర్శకులు ముందుకు వస్తున్నాయి. అయితే చరణ్ 2013లో స్ట్రైట్ బాలీవుడ్ మూవీ చేశారు. అప్పట్లో చరణ్ జంజీర్ అనే చిత్రంలో నటించగా అది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.  

36

ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కించారు. జంజీర్ తర్వాత ఇన్నేళ్ళలో అపూర్వ లఖియా ఒకటి రెండు చిత్రాలకు మాత్రమే పరిమితం అయ్యారు. జంజీర్ కొట్టిన దెబ్బ అలాంటిది మరి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళి అపూర్వ లఖియా వెలుగులోకి వచ్చారు. ఓ ఇంటర్వ్యూలో అపూర్వ లఖియా రాంచరణ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రాంచరణ్ ప్రస్తుతం తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

46

జంజీర్ తర్వాత చరణ్, అపూర్వ లఖియా మధ్య విభేదాలు వచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఇంటర్వ్యూలో అపూర్వ లఖియా స్పందించారు. జంజీర్ తర్వాత నేను , చరణ్ మంచి స్నేహితులం అయ్యాము. జంజీర్ తర్వాత కూడా చరణ్ ని ఎన్నోసార్లు మీట్ అయ్యాను. వాళ్ళ ఇంటికి కూడా వెళ్లాను. 

56

కానీ ఇప్పుడు చరణ్ నా ఫోన్ కాల్స్ కి ఆన్సర్ చేయడం లేదు. బహుశా చరణ్ తన సినిమాలతో చాలా బిజీగా ఉంది ఉండొచ్చు. అలాగే చరణ్ స్వయంగా ఫోన్ ఆన్సర్ చేసే అలవాటు కూడా లేదు. కొన్ని సార్లు ఆయన సతీమణి ఉపాసన లిఫ్ట్ చేస్తుంటారు. అంతేకాని మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని అపూర్వ లఖియా అన్నారు. 

66

రాంచరణ్ చివరగా తనతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ లో మాట్లాడాడని అపూర్వ గుర్తు చేసుకున్నారు. రాంచరణ్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ ఇలా స్టార్ కాస్టింగ్ తో జంజీర్ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ ఆ మూవీ ఎందుకో వర్కౌట్ కాలేదని అన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య
Recommended image2
Peddi Item Song : పవన్ కళ్యాణ్ హీరోయిన్ తో రామ్ చరణ్ రొమాన్స్.. పాట కోసం కోటి డిమాండ్ చేస్తున్న బ్యూటీ ఎవరు?
Recommended image3
Tabu Home Tour: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టబు.. రేటు తెలిస్తే కళ్తు తిరగాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved