Ram Asur Review : రామ్ అసుర్ మూవీ రివ్యూ
ఈవారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల సందడి నెలకొంది. వాటిలో రామ్ అసుర్ ఒకటి. రొమాంటిక్ అండ్ సస్పెన్సు అంశాలు జోడించి, కొత్తవారితో చేసిన ఈ ప్రయోగాత్మక చిత్రం ఎలా ఉందో చూద్దాం...
కథ:
గొప్ప టాలెంటెడ్ ఉన్న రామ్ (రామ్ కార్తీక్) కృత్రిమంగా వజ్రం రూపొందించాలని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ప్రియ (షెర్రీ అగర్వాల్) ని ఎంతగానో ప్రేమిస్తాడు. అనూహ్యంగా ఓ రోజు రామ్‌కు ప్రియ బ్రేకప్ చెబుతుంది. ఈ పరిణామం రామ్ ని డిప్రెషన్ లోకి నెడుతుంది. మానసిక వేదన అనుభవిస్తున్న రామ్ స్నేహితుడి సలహా మేరకు తమిళనాడు వైదీశ్వరున్ కోయిల్‌లోని పండితుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. తన లక్ష్యం నెరవేరాలంటే నర్సీపట్నంలోని సూరి (అభినవ్ సర్దార్)ను కలువమని రామా చారి సలహా ఇస్తాడు. అయితే కృత్రిమ వజ్రం రామ్ సృష్టించడంలో సక్సెస్ అయ్యాడా? రామ్‌కు ప్రియ ఎందుకు బ్రేకప్ చెప్పింది? సూరిని కలవమని రామ్‌కు ఎందుకు రామాచారి సలహా ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రశ్నల సమాహారమే రామ్ అసుర్ మూవీ..
రామ్ అసుర్ రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన కథతో తెరకెక్కిన ప్రయోగాత్మకంగా తెరకెక్కిన చిత్రంగా చెప్పవచ్చు. అనుకున్న పాయింట్ ని ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. రామ్ అసుర్ మొదటి భాగంలో రామ్, ప్రియకు మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, వారి మధ్య కెమిస్ట్రీ అలరిస్తాయి. అలాగే సూరి, ప్రియ మధ్య ప్రేమ సన్నివేశాలు క్లీన్‌గా ఫన్నీగా సాగుతాయి. కృత్రిమ వజ్రం తయారీ, అరుదైన వజ్రాల వజ్రాల వేటలో భాగంగా ప్రధాన పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతాయి.
కథ:
గొప్ప టాలెంటెడ్ ఉన్న రామ్ (రామ్ కార్తీక్) కృత్రిమంగా వజ్రం రూపొందించాలని ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ప్రియ (షెర్రీ అగర్వాల్) ని ఎంతగానో ప్రేమిస్తాడు. అనూహ్యంగా ఓ రోజు రామ్‌కు ప్రియ బ్రేకప్ చెబుతుంది. ఈ పరిణామం రామ్ ని డిప్రెషన్ లోకి నెడుతుంది. మానసిక వేదన అనుభవిస్తున్న రామ్ స్నేహితుడి సలహా మేరకు తమిళనాడు వైదీశ్వరున్ కోయిల్‌లోని పండితుడు రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలుస్తాడు. తన లక్ష్యం నెరవేరాలంటే నర్సీపట్నంలోని సూరి (అభినవ్ సర్దార్)ను కలువమని రామా చారి సలహా ఇస్తాడు. అయితే కృత్రిమ వజ్రం రామ్ సృష్టించడంలో సక్సెస్ అయ్యాడా? రామ్‌కు ప్రియ ఎందుకు బ్రేకప్ చెప్పింది? సూరిని కలవమని రామ్‌కు ఎందుకు రామాచారి సలహా ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రశ్నల సమాహారమే రామ్ అసుర్ మూవీ..
రామ్, సూరి జీవితాలకు సంబంధించి పక్కాగా రాసుకొన్న సన్నివేశాలు సినిమాకు బలంగా కనిపిస్తాయి.
సెకండాఫ్‌లో రామ్ జీవితంలోకి సూరి ప్రవేశించే ఎపిసోడ్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే రెండు మేజర్ ట్విస్టులు సినిమాను మరో మెట్టు ఎక్కిస్తుంది. చక్కటి ఎమోషనల్, యాక్షన్ మేలవించిన సీన్‌తో క్లైమాక్స్ ముగియడం రామ్ అసుర్ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిందని చెప్పవచ్చు.
సూరిగా అభినవ్ సర్దార్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాకు కీలకంగా మారిన రోల్‌ను సునాయసంగా పోషించి మెప్పించాడు. లవర్ బాయ్‌గా, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తన ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొన్నాడు. ఇక లవర్ బాయ్ పాత్రలో రామ్ కార్తీక్ రొమాంటిక్‌గా తెర మీద కనిపించాడు. శృంగార సన్నివేశాల్లో షెర్రీ అగర్వాల్‌తో కలిసి అదరగొట్టాడు.
వజ్రాలు తయారు చేసే సైంటిస్ట్‌గా రామ్ కార్తీక్ ఫెర్ఫార్మెన్స్ యూత్ ఆకట్టుకొంటుంది. ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో శాన్వీ సాల్మన్ అద్భుతమైన యాక్టింగ్‌ను కనబరిచాడు. సూరి, రామ్ పాత్రల మధ్య శాన్వీ రోల్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. శాన్వీ రోల్ మాత్రం తెరపైనే చూస్తే ప్రేక్షకులు థ్రిల్లింగ్‌గా ఫీలవ్వడం ఖాయం. దర్శకుడు కథను డీల్ చేసిన విధానం... టేకింగ్ మెప్పిస్తుంది. చాలా సన్నివేశాలలో ఆయన ప్రతిభ కనబడుతుంది.
ఇక సాంకేతిక అంశాలను పరిశీలిస్తే.. రామ్ అసుర్ పర్వాలేదు అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ మూవీ కావడంతో నిర్మాణ విలువలు మరీ ఉన్నతంగా లేవు. అయితే బడ్జెట్ పరిమితుల మధ్య 80ల నాటి వాతావరణం సృష్టించి... కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా చిన్న సినిమాగా విడుదలైన రామ్ అసుర్ మూవీలో విషయం ఉంది. చిన్న సినిమా అనే చిన్న చూపు వదిలేసి... థియేటర్ కి వెళితే, వినోదం పంచే చిత్రంగా రామ్ అసుర్ ని చెప్పవచ్చు. అయితే ఇలాంటి తక్కువ బడ్జెట్ చిత్రాలలో విషయం ఉందని తెలిసే లోపే థియేటర్ నుండి వెళ్లిపోతాయి.
రేటింగ్ : 2.75/ 5
నటీనటులు: అభినవ్ సర్ధార్, రామ్ కార్తీక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని తమిళ్‌రాసన్, శాన్వీ సాల్మాన్, షెర్రీ అగర్వాల్ తదితరులు
సినిమాటోగ్రఫి: జే ప్రభాకరరెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఫైట్స్: శంకర్
నిర్మాతలు: అభినవ్ సర్ధార్,వెంకటేష్ త్రిపర్ణ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకటేష్ త్రిపర్ణ
రిలీజ్ డేట్: 2021-11-19