- Home
- Entertainment
- ఇండియా వ్యాప్తంగా జూ.ఎన్టీఆర్ సంచలనం, మోడీ తర్వాతి స్థానంలో యంగ్ టైగర్.. టాప్ 10లో పవన్, మహేష్ ఉన్నారా ?
ఇండియా వ్యాప్తంగా జూ.ఎన్టీఆర్ సంచలనం, మోడీ తర్వాతి స్థానంలో యంగ్ టైగర్.. టాప్ 10లో పవన్, మహేష్ ఉన్నారా ?
మోడీ తర్వాతి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచి సంచలనం సృష్టించారు. అసలు తారక్ సాధించిన ఘనత ఏంటి, టాప్ 10 లో ఉన్న సెలెబ్రిటీలు ఎవరు లాంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సోషల్ మీడియా వేదికగా సెలెబ్రిటీల గురించి తరచుగా ఏదోఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. సినీ రాజకీయ క్రీడా రంగానికి చెందిన ప్రముఖుల గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. ఈ రంగాలకు ఉండే క్రేజ్, ప్రాధాన్యాత అలాంటిది. ప్రతి నెల ఎక్స్ (ట్విట్టర్) లో ఎవరో ఒక సెలెబ్రిటీ హైలైట్ అవుతుంటారు. ఎక్స్ సంస్థ కూడా ప్రతి నెల ఎక్కువగా నెటిజన్లు మాట్లాడుకున్న సెలెబ్రిటీల వివరాలు బయటపెడుతూ ఉంటుంది.
ఆగస్టు నెలలో ఇండియాలో ఎక్కువగా చర్చ జరిగిన సెలెబ్రిటీల వివరాలు రివీల్ చేసింది. ఈ జాబితాలో ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోడీ అగ్ర స్థానంలో నిలిచారు. మోడీ ప్రధాని కాబట్టి తరచుగా ఆయన గురించి ప్రజలు మాట్లాడుకుంటూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఆ చర్చ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక ఊహించని విధంగా మోడీ తర్వాత రెండవ స్థానములో నిలిచింది యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఆగష్టు 14న ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం విడుదలయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి ట్విట్టర్ లో ఎక్కువగా చర్చ జరిగి ఆయన రెండవ స్థానంలో నిలిచారు. మూడవ స్థానంలో తమిళ స్టార్, టీవీకే అధినేత ఇళయదళపతి విజయ్ నిలిచారు. తమిళనాడులో విజయ్ రాజకీయ కార్యక్రమాలతో హీటేక్కిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ గురించి ఎక్కువగా చర్చ జరిగింది.
నాల్గవ స్థానములో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఐదవ స్థానంలో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ , రాహుల్ గాంధీ 6వ స్థానంలో, విరాట్ కోహ్లీ 7వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు 8 వస్థానంలో, మహేంద్ర సింగ్ ధోని 9వ స్థానంలో, సూపర్ స్టార్ రజినీకాంత్ 10వ స్థానంలో ఉన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2వ స్థానం దక్కించుకోవడంపై ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. తారక్ క్రేజ్ కి ఇదొక నిదర్శనం అని అంటున్నారు. వార్ 2 దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలయింది. కానీ ప్రేక్షకులని ఈ చిత్రం మెప్పించలేకపోయింది.