డస్కీ బ్యూటీతో ఘనంగా యువ హీరో పెళ్లి.. బ్యూటిఫుల్ వెడ్డింగ్ పిక్స్ వైరల్
తాజాగా కోలీవుడ్ లో ఓ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. వైవిధ్యభరితమైన చిత్రాలతో యువ హీరో అశోక్ సెల్వన్ గుర్తింపు పొందాడు.
చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు సహజమే. టాలీవుడ్ లో త్వరలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ లో ఓ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. వైవిధ్యభరితమైన చిత్రాలతో యువ హీరో అశోక్ సెల్వన్ గుర్తింపు పొందాడు.
రీసెంట్ గా అశోక్ సెల్వన్ 'పోర్ తళిల్' అనే థ్రిల్లర్ మూవీ తో హిట్ కొట్టాడు. అంతకు ముందు 'ఓ మై కడవులే' చిత్రం కూడా విజయం సాధించింది. త్వరలో ప్రస్తుతం ఈ యంగ్ హీరో వయసు 33 ఏళ్ళు. అశోక్ సెల్వన్ త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి.
బుధవారం రోజు ఉదయం హీరో అశోక్ సెల్వన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. అశోక్ సెల్వన్ వివాహం చేసుకున్న వధువు కూడా సెలెబ్రిటీనే.
ఆమె ఎవరో కాదు తమిళ సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ కుమార్తె కీర్తి పాండియన్. మరో విశేషం ఏంటంటే వీరిద్దరూ ప్రస్తుతం జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తి కాకముందే ఇద్దరూ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది.
కీర్తి పాండియన్ తుంబా, అంబిర్కినియల్ చిత్రాలతో హీరోయిన్ గా గుర్తింపు పొందింది.కీర్తి పాండియన్ సోషల్ మీడియాలో తరచుగా హాట్ హాట్ ఫోజులతో యువతని ఆకర్షిస్తూ ఉంటుంది.
keerthi pandian
బికినీల్లో సైతం కీర్తి పాండియన్ మంటలు రేపే ఫోజులు ఇస్తోంది. చీరకట్టు అయినా, ట్రెండీ డ్రెస్సుల్లో అయినా కీర్తి పాండియన్ తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. హీరోయిన్ గా కూడా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోంది. ఇలాంటి తరుణంలో కీర్తి.. అశోక్ సెల్వన్ తో ప్రేమలో పడడం వివాహం చేసుకోవడం చక చకా జరిగిపోయాయి.