జిమ్ లో క్లీనర్ జాబ్ కోసం.. బెంజ్ కారులో వెళ్లిన యంగ్ హీరో ఎవరో తెలుసా?
ఓ యంగ్ హీరో కెరీర్ బిగినింగ్ లో జిమ్ లో క్లీనర్ గా పనిచేశాడు. బెంజ్ కారులో వెళ్లి.. జిమ్ము మొత్తం క్లీన్ చేసి వచ్చేవాడు. ఇంతకీ ఆ కుర్ర హీరో ఎవరో తెలుసా? అసలు ఆ పనిచేయాల్సి అవసరం ఎందుకు వచ్చింది.

స్టార్ వారసుడిగా ఎంట్రీ..
టాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్ గా మారినవారు ఉన్నారు. స్టార్ వారసులుగా ఇండస్ట్రీకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే వారస్వంతో వచ్చినా కూడా కష్టం విలువ తెలిసి హీరోలు ఇండస్ట్రీలో లేకపోలేదు. గోల్డెన్ స్పీన్ తో పుట్టినా.. బ్యాక్ గ్రౌండ్ పక్కన పెట్టి.. కెరీర్ బిగినింగ్ లో కష్టపడి పనిచేయడం నేర్చుకున్న హీరోలు టాలీవుడ్ లో ఎంతో మంది ఉన్నారు. వారిలో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాశ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలెంట్ చూపించిన ఆకాశ్ పూరీ
పూరీ జగన్నాథ్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు పూరీ ఆకాశ్. చైల్డ్ ఆర్టిస్ట్ గానే తనేంటో నీరూపించుకున్న ఆకాశ్.. హీరోగా మాత్రం సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఎంతో మంది హీరోలను తన సినిమాలతో స్టార్స్ గా తీర్చి దిద్దిన పూరీ.. తన కొడుకుని మాత్రం స్టార్ ను చేయలేకపోయాడు అని టాలీవుడ్ లో ఎన్నో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆకాశ్ ఎంత ప్రయత్నం చేసినా.. సక్సెస్ మాత్రం అతనికి దక్కడంలేదు. ఇక ఈ విషయంలో పూరీ కూడా తన వారసుడు కష్టపడి పైకి రావాలి, సొంత టాలెంట్ తో ఎదగాలి కానీ.. తన రికమండేషన్ తో కాదు అనే ఆలోచనలో ఉన్నారట. అందుకే చిన్నతనం నుంచే ఆకాశ్ కు మంచి చెడు తెలిసేలా పెంచాడు పూరీ.
కష్టపడి స్టార్ గా ఎదిగిన పూరీ జగన్నాథ్
పూరీ జగన్నాథ్.. ఇండస్ట్రీలోకి ఎంతో కష్టపడి వచ్చాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. స్టార్ డైరెక్టర్ గా మారాడు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి. ఆకాశ్ పూరీకి కూడా అది తెలిసేలా పెంచాడు. డబ్బు, స్టార్ డమ్ తో గర్వం ఉండకూడదు అనేది పూరీ ఫిలాసఫీ.. ఈక్రమంలోనే ఆకాశ్ పూరీ చేత కొన్ని పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చేయించాడట స్టార్ డైరెక్టర్. ఈ విషయాన్ని ఆకాశ్ పూరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను జిమ్ లో క్లీనర్ గా వర్క్ చేసిన విషయాన్ని చెపుతూ.. కొన్ని ఫన్నీ మూమెంట్స్ ను షేర్ చేసుకున్నాడు.
బెంజ్ కారులో జిమ్ కు
ఆకాశ్ పూరీ మాట్లాడుతూ.. '' ఒక సారి టెన్త్ అయిపోయిన ఖాళీగా ఉన్నాను. నేను ఖాళీగా ఉంటే ఎట్లా.. పని తెలియాలి కదా.. అదే ఉద్దేశ్యంతో నాన్న ఫోన్ చేశాడు. అరే పార్ట్ టైమ్ జామ్ ఉంది ఒకటి చేయాలి అన్నారు. నేను సరే నాన్నా చేస్తాను అన్నాను. అసలు నేను చేస్తానా లేదా అనేది ఆయన డౌట్. సరే చేస్తానన్నాను. సరే రేపటినుంచి కార్ వస్తుంది రెడీగా ఉండు అన్నారు. అనుకున్నట్టు కారు వచ్చింది. జిమ్ లో క్లీనర్ జాబ్ చూశారు. సరే అని జాయిన్ అయ్యాను. రోజు బెంజ్ కారులో జిమ్ క్లీనర్ జాబ్ కు వెళ్లేవాడిని. ఆ జిమ్ కోచ్ కు తెలుగు కొంచెం కొంచెం వచ్చు.. నేనెవరో అతనికి తెలియదు. కానీ అదోలా చూసేవాడు.
జిమ్ కోచ్ కు డౌట్ వచ్చి ఏం చేశాడంటే?
నేను వచ్చింది క్లీనింగ్ జాబ్ కు.. అది పర్ఫెక్ట్ గా చేసి చూపించా.. జాయిన్ అవ్వమన్నాడు. కానీ నా అవతారం, కాస్ట్లీ బట్టలు చూసి అతనికి ఏదో డౌట్ వచ్చింది. అంతలో ఒక ఫోన్ వస్తే.. మాట్లాడుతున్నాను.. నా చేతిలో ఐఫోన్ చూసి షాక్ అయ్యాడు. ఆతరువాత అసలు విషయం తెలుసుకుని.. సర్ వద్దు.. మీరు ఈ పనిచేయడం ఏంటి.? అస్సలు వద్దు ఇంటికి వెళ్ళిపోండి అంటూ బ్రతిమలాడాడు. అప్పుడు నాన్నకు ఫోన్ చేసి చెప్పా.. నేను చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ వాళ్లు తీసుకోవడంలేదు అని. అవునా.. సరేలే.. ఇంకోటి చూద్దాం అని నాన్న ఫోన్ పెట్టేశాడు'' అని ఆకాశ్ పూరీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నాలుగే సినిమాలు చేసిన ఆకాశ్ పూరీ
అలా బెంజ్ కారులో వెళ్లి.. జిమ్ క్లీనర్ గా కొన్నిరోజులు పనిచేసిన హీరోగా ఆకాశ్ పూరికి సరికొత్త అనుభవం ఉంది. ఇక హీరోగా ఆకాశ్ పూరీ నాలుగు సినిమాలు మాత్రమే చేశాడు. 2015 లో ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్.. మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ సినిమాల్లో నటించాడు. హీరోగా తన నటనతో ఆకట్టుకున్నా.. కమర్షియల్ గా ఈ సినిమాలు మాత్రం డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో హీరోగా కెరీర్ లో ఎదగలేకపోయాడు ఆకాశ్. 2022 లో వచ్చిన చోర్ బజార్ సినిమా తరువాత ఆకాశ్ పూరీ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

