MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 20 ఏళ్ల కెరీర్‌లో మూడు పెళ్లిళ్లు, మూడుసార్లు విడాకులు.. మళ్లీ ఇప్పుడు సింగిల్.. ఎవరంటే.?

20 ఏళ్ల కెరీర్‌లో మూడు పెళ్లిళ్లు, మూడుసార్లు విడాకులు.. మళ్లీ ఇప్పుడు సింగిల్.. ఎవరంటే.?

Meera Vasudevan: మలయాళ నటి మీరా వాసుదేవన్ ఇటీవల తన మూడో భర్త నుంచి విడిపోయినట్టు ప్రకటించింది. 20 ఏళ్ల కెరీర్‌లో మూడు వివాహాలు చేసుకుని, తాజాగా మూడో భర్త విపిన్‌తో విడిపోయినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

2 Min read
Author : Pavithra D| ANI
Published : Nov 21 2025, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆ సినిమాతో సుపరిచితం..
Image Credit : Meera Vasudevan\Instagram

ఆ సినిమాతో సుపరిచితం..

మలయాళ సినీ నటి మీరా వాసుదేవన్ తన వ్యక్తిగత జీవితంలోని పరిణామాలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టీవీ సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన మీరా.. మలయాళ, తమిళ చిత్రాలలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాధవన్ హీరోగా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన 13B సినిమాలో నటించడం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సినీ ప్రస్థానం కన్నా పర్సనల్ లైఫ్‌నే..
Image Credit : Meera Vasudevan\Instagram

సినీ ప్రస్థానం కన్నా పర్సనల్ లైఫ్‌నే..

అయితే, తన సినీ ప్రస్థానం కన్నా ఆమె వివాహాల ద్వారానే మీరా వాసుదేవన్ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మీరా గత 20 ఏళ్లలో మూడు వివాహాలు చేసుకొని, మూడు సార్లు విడాకులు తీసుకోవడం సినీ పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. తాజాగా ఆమె సింగిల్ అని ప్రకటించడంతో మూడో భర్తతో కూడా విడిపోయినట్లు స్పష్టమైంది.

Related Articles

Related image1
Actress: 8 నెలల వయసులోనే ఎంట్రీ.. పేరు మార్చుకుని ఇండస్ట్రీని ఏలుతోంది.. ఈ హీరోయిన్‌ ఎవరంటే?
Related image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
35
మొదటి వివాహం అప్పుడు..
Image Credit : Meera Vasudevan\Instagram

మొదటి వివాహం అప్పుడు..

ఆమె మొదటి వివాహం 2005లో విశాల్ అగర్వాల్‌తో జరిగింది. ఈ దంపతులు ఐదేళ్ల తర్వాత 2010లో విభేదాల కారణంగా విడిపోయారు. రెండేళ్లు సింగిల్‌గా ఉన్న తర్వాత, మీరా 2012లో నటుడు జాన్ కొక్కెన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. కేజీఎఫ్ సినిమాలో విలన్‌గా గుర్తింపు పొందిన జాన్, తెలుగు సినిమాలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మీరా, జాన్ దాంపత్యం నాలుగు సంవత్సరాలు సాగింది, అనంతరం 2016లో వారు విడిపోయారు.

45
రెండు విడాకుల తర్వాత.. మూడోది కూడా..
Image Credit : Meera Vasudevan\Instagram

రెండు విడాకుల తర్వాత.. మూడోది కూడా..

ఈ రెండు విడాకుల తర్వాత, మీరా గతేడాది సినిమాటోగ్రాఫర్ విపిన్‌ను వివాహం చేసుకుంది. ఈ వివాహం కనీసం కొద్దికాలమైనా కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ, వారి బంధం ఒక సంవత్సరం కూడా పూర్తి కాకుండానే విడిపోయింది. తాజాగా మీరా తన సోషల్ మీడియా ఖాతాలో తాను సింగిల్‌గా ఉన్నట్లు ప్రకటించింది.

55
ఆగస్టు నుంచి నేను సింగిల్‌..
Image Credit : Meera Vasudevan\Instagram

ఆగస్టు నుంచి నేను సింగిల్‌..

ఆమె పోస్ట్‌లో, "హాయ్, నేను మీరా వాసుదేవన్. ఆగస్టు నుంచి నేను సింగిల్‌గా ఉంటున్నాను. నేను నా జీవితంలో అత్యంత అద్భుతమైన, ప్రశాంతమైన దశలో ఉన్నాను" అని పేర్కొంది. ఈ ప్రకటనతో విపిన్‌తో కూడా ఆమె విడిపోయిందని స్పష్టమైంది. 43 ఏళ్ల వయస్సులో మీరా వాసుదేవన్ తన 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో మూడు పెళ్లిళ్లు చేసుకొని, ముగ్గురు భర్తలకు విడాకులు ఇచ్చి మళ్లీ సింగిల్‌గా మారడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Related Stories
Recommended image1
Actress: 8 నెలల వయసులోనే ఎంట్రీ.. పేరు మార్చుకుని ఇండస్ట్రీని ఏలుతోంది.. ఈ హీరోయిన్‌ ఎవరంటే?
Recommended image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved