1 టికెట్ పై 200 సినిమాలు.. ఆడియన్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అల్లరి నరేష్
కామెడీ ఆడియన్స్ కు అదిరిపోయే ఆఫర్ ప్రకటించాడు టాలీవుడ్ హీరో అల్లరి నరేష్. 1 టికెట్ కొనండి.. 200 సినిమాలు ఒకేసారి చూసేయండి అంటున్నాడు. ఇంతకీ ఈ లాజిక్ లో మ్యాజిక్ ఏంటి?

కామెడీ హీరోగా స్పెషల్ ఇమేజ్..
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సాధించిన హీరో అల్లరి నరేష్. రాజేంద్ర ప్రసాద్ తరువాత టాలీవుడ్ కు దొరికిన అరుదైన కామెడీ హీరో నరేష్. హీరోగా ఎంట్రీ ఇచ్చి.. కామెడీ హీరోగా మారిపోయాడు నరేష్. వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ హీరో.. చాలా తక్కువ టైమ్ లోనే 50 సినిమాలు కంప్లీట్ చేశాడు. ఇక ఈమధ్య కాలంలో కామెడీ పాత్రలు వదిలి సీరియస్ సబ్జెక్ట్స్ ను తీసుకుని హిట్లు కొడుతున్నాడు అల్లరి నరేష్. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా సినిమాలు చేస్తూ వచ్చిన నరేష్.. తన కామెండీ టైమింగ్ తో అడుపుబ్బా నవ్వించాడు. ఆతరువాత కాలంలో అల్లరి నరేష్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అల్లరి నరేష్ కొత్త సినిమా 12A రైల్వే కాలనీ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న అతను, తన కెరీర్‌లో భారీ హిట్‌గా నిలిచిన సుడిగాడు సీక్వెల్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన కెరీర్ ను పడిపోకుండా నిలబెట్టిన సుడిగాడు సినిమాకు త్వరలో సీక్వెల్ ను తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు. ఇక ఈసినిమాకు సబంధించి మరో ఆసక్తికరమైన విషయాన్ని ఆయన చెప్పారు.
1 టికెట్ పై 200 సినిమాలు
ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ, “సుడిగాడు నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచన చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సుడిగాడు సమయంలో ఒక టికెట్‌పై 100 సినిమాలు చూపించాం. అది అప్పట్లో బాగా వర్కౌట్ అయ్యింది. కానీ ఇప్పుడు అదే చేస్తే ప్రేక్షకులు అంగీకరించరు. సోషల్ మీడియా, రీల్స్ వంటివి పెరిగిన ఈ సమయంలో అందరూ.. అంతకు మించి ఎక్స్ పెక్ట్ చేస్తారు. కాబట్టి ఈసారి చేస్తే ఒక టికెట్‌పై 200 సినిమాలు చూపించినట్టుగా ఉండాలి. అలాంటి ఆలోచనతోనే సుడిగాడు 2 సినిమాను ప్లాన్ చేస్తున్నాము.. ఈ సినిమా కూడా త్వరలోనే ఉంటుంది” అని అల్లరి నరేష్ అన్నారు.
కామెడీ లవర్స్ కు పండగే..
సుడిగాడు సినిమా చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు ఆడియన్స్.. కామెడీ లవర్స్ కు పండగలాంటి వార్త బయటకు రావడంతో.. దిల్ ఖుష్ అవుతున్నారు. కామెడీ మంత్రంతో హిట్‌గా నిలిచిన సుడిగాడుకు సీక్వెల్ వస్తుందనే వార్త అభిమానుల్లో లో జోష్ నింపుతోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని వారు ఎదురు చూస్తున్నారు. అంతే కాదు ఈసారి ఈసినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు. హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరు అనే విషయాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

