MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వాడొక బ్రోకర్, పీపుల్ మీడియా నిర్మాత వివేక్ పై పచ్చి బూతులతో డైరెక్టర్ రచ్చ..ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే మూవీపై

వాడొక బ్రోకర్, పీపుల్ మీడియా నిర్మాత వివేక్ పై పచ్చి బూతులతో డైరెక్టర్ రచ్చ..ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే మూవీపై

తాజాగా యువ దర్శకుడు రాజసింహ తడినాడ పీపుల్ మీడియా సంస్థలో భాగస్వామిగా ఉన్న నిర్మాత వివేక్ కూచిబొట్లపై సంచలన ఆరోపణలతో రెచ్చిపోయారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 11 2024, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చిత్ర పరిశ్రమలో తరచుగా వివాదాలు చూస్తూ ఉంటాం. ఏదైనా వివాదం జరిగితే ముందుగా వినిపించే పేరు నిర్మాతదే. ఎందుకంటే వాణిజ్యపరమైన లావాదేవీలన్నీ నిర్మాతల చేతిలోనే ఉంటాయి. అయితే తాజాగా యువ దర్శకుడు రాజసింహ తడినాడ పీపుల్ మీడియా సంస్థలో భాగస్వామిగా ఉన్న నిర్మాత వివేక్ కూచిబొట్లపై సంచలన ఆరోపణలతో రెచ్చిపోయారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఈ యువ దర్శకుడు చేసిన ఆరోపణలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. రాజసింహ తడినాడ దాదాపు 60 సినిమాలకు రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ తో ఎండార్స్మెంట్స్ కూడా చేసిన రాజసింహ, ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్ గా వర్క్ చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’ పాత్రకి రాజసింహ రాసిన డైలాగులకి చాలా మంచి పేరొచ్చింది. 

37

ఈ క్రేజ్ తో దర్శకుడిగా మారిన రాజసింహ తడినాడ, సందీప్ కిషన్ తో ‘ఒక అమ్మాయి తప్ప’ అనే సినిమా చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో రాజసింహకి సినిమా అవకాశాలు తగ్గాయి. అయితే పర్సనల్ లైఫ్ లో ఉన్న ఇబ్బందుల కారణంగా రాజసింహ గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటినుంచి రాజసింహ బయట పెద్దగా కనిపించడం మానేసాడు.

47

కానీ తాజాగా రాజసింహ వివేక్ కూచిబొట్లపై బూతులతో, ఆరోపణలతో రెచ్చిపోవడం తీవ్ర సంచలనంగా మారింది. అసలు వీరి మధ్య ఏం జరిగింది అనేది తెలియదు. రాజసింహ తన ఫేస్ బుక్ లో వివేక్ కూచిబొట్ల ఫోటో పోస్ట్ చేసి బ్రోకర్ ఎంత వివేకవంతుడైనా వాడు బ్రోకర్.. నిర్మాత కాడు అని కామెంట్స్ చేశాడు. వివేక్ లాంటి పేరున్న నిర్మాతపై రెచ్చిపోవడంతో మరో దర్శకుడు ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చాడు. 

57

ఆ దర్శకుడు ఎవరో కాదు ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విఎన్ ఆదిత్య. విఎన్ ఆదిత్య.. రాజసింహకి కౌంటర్ ఇస్తూ.. బుద్ది లేని విశ్వాసఘాతుకుడివి నువ్వు. నీకు వివేక్ ని అనే స్థాయి లేదు. తాగి చెడగొట్టుకున్న కెరీర్ నీది. కష్టపడి పైకొచ్చిన వాళ్ళమీదపది  పడి ఏడవకు. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే లక్ష రూపాయలు వివేక్ సహాయం చేసారు. నీ కథ వినమని రవి గారికి అప్పజెప్పిన వ్యక్తి వివేక్. సిగ్గులేని వాడివి నువ్వు. లీగల్ గా చర్యలకు సిద్ధంగా ఉండు అని రాజసింహకి ఆదిత్య వార్నింగ్ ఇచ్చారు. 

67

అతడి వార్నింగ్ కి రాజసింహ కౌంటర్ ఇచ్చారు.. ఇంకా బూతులతో రెచ్చిపోయారు. విఎన్ ఆదిత్య గాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఆదిత్య గాడు మనసంతా నువ్వే చిత్రాన్ని హిందీ నుంచి కాపీ కొట్టాడు. ఒరేయ్ వెధవ నీ బతుకు నాకు తెలుసు అంటూ రాజసింహ సింగర్ సునీతని కూడా ఈ కాంట్రవర్సీలోకి లాగాడు. ల** కొడకా అంటూ రాజసింహ బూతులతో రెచ్చిపోవడం సంచలనంగా మారింది. 

77

అసలు వీరి మధ్య జరిగిన గొడవ ఏంటి.. ఎందుకు రాజసింహ ఇలా వివేక్ ని, ఆదిత్యని టార్గెట్ చేస్తున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ వివాదంపై నిర్మాత వివేక్ కూచిబొట్ల  ఎలా స్పందిస్తారో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved