MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Krithi Shetty: సమంత, అనుపమకు కృతి షాక్... వాళ్ళ రికార్డు గల్లంతు చేసిన యంగ్ బ్యూటీ

Krithi Shetty: సమంత, అనుపమకు కృతి షాక్... వాళ్ళ రికార్డు గల్లంతు చేసిన యంగ్ బ్యూటీ

ఒక్క హిట్ చాలు హీరోయిన్ గా పరిశ్రమను ఏలడానికి. ఒక్క సక్సెస్ ఫుల్ మూవీతో ఓవర్ నైట్ స్టార్స్ అయిన తారలు ఎందరో ఉన్నారు. వరుస విజయాలు నమోదు చేసే స్టార్స్ కి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక లక్కీ హీరోయిన్ అనే ఇమేజ్ తెచ్చుకుంటే అవకాశాల వరద పారుతుంది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 17 2022, 01:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న సమంత, రష్మిక (Rashmika), పూజా హెగ్డే కెరీర్ పీక్స్ కి చేరింది. వీరు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా వెండితెరను ఏలుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో యంగ్ బ్యూటీ కృతి శెట్టి చేరింది. మొదటి చిత్రంతోనే ప్రభంజనం సృష్టించిన కృతి శెట్టి హ్యాట్రిక్ విజయాలతో సమంత, అనుపమ రికార్డ్స్ గల్లంతు చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


ఆరంభంలోనే హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకోవడం అంత సులభం కాదు. అతికొద్ది మంది హీరోయిన్స్ కి మాత్రమే అది సాధ్యమైంది. ఈ జనరేషన్ హీరోయిన్స్ లో సమంత (Samantha), అనుపమ ఆ రికార్డు సొంతం చేసుకున్నారు. ఆ ఇద్దరి రికార్డు కృతి శెట్టి సమం చేశారు. ఏమాయ చేశావే మూవీతో వెండితెరకు పరిచయమైన సమంత సూపర్ హిట్ అందుకున్నారు. 

37


ఆ తర్వాత సమంత నటించిన బృందావనం, దూకుడు చిత్రాలు విజయం అందుకోగా... హ్యాట్రిక్ పూర్తి చేసింది. ఆరంభంలోనే ఎన్టీఆర్ (NTR), మహేష్ (Mahesh Babu)వంటి స్టార్స్ పక్కన అవకాశాలు పట్టేసి అదృష్టానికి నిలువెత్తు నిదర్శనమని నిరూపించుకుంది. ఏమాయ చేశావే, బృందావనం, దూకుడు చిత్రాలు విజయం సాధించగా.. సమంత తెలుగులో వరుసగా మూడు హిట్ చిత్రాల్లో నటించిన రికార్డు సొంతం చేసుకుంది. 
 

47

సమంత తర్వాత తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేసింది మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన 'అ ఆ' మూవీతో అనుపమ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.  'అ ఆ' మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 
 

57
Anupama Parameswaran

Anupama Parameswaran


అనంతరం నాగ చైతన్య (Naga chaitanya)నటించిన మలయాళం రీమేక్ ప్రేమమ్ లో ఓ హీరోయిన్ గా నటించారు. ప్రేమమ్ సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక అనుపమ మెయిన్ లీడ్ హీరోయిన్ గా తెరకెక్కించిన శతమానం భవతి సూపర్ హిట్ అందుకోవడంతో పాటు 2017 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దీంతో అనుపమ సైతం హ్యాట్రిక్ విజయాల రికార్డు సొంతం చేసుకుంది. 

67


వీరిద్దరి తర్వాత లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి ఈ ఫీట్ అందుకుంది. కృతి శెట్టి మొదటి చిత్రం ఉప్పెన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. 2021 హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన ఉప్పెన, అత్యధిక లాభాలు పంచిన చిత్రంగా మొదటి స్థానం కైవశం చేసుకుంది. 

77

నానికి జంటగా శ్యామ్ సింగరాయ్ మూవీలో కృతి శెట్టి (Krithi Shetty)నటించారు. ఆమె రెండవ చిత్రంగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ సైతం హిట్ చిత్రాల ఖాతాలో చేరింది. ఇక లేటెస్ట్ సంక్రాంతి రిలీజ్ బంగార్రాజు రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకుంటుంది. పండుగ దినాలను బాగా క్యాష్ చేసుకున్న బంగార్రాజు మూడు రోజుల్లో దాదాపు రూ. 43కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. బంగార్రాజు క్లీన్ హిట్ గా కనిపిస్తుండగా కృతి శెట్టి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఆ విధంగా వరుసగా మూడు విజయాలు అందుకొని సమంత, అనుపమ రికార్డ్స్ సమం చేసిన ఆమె.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved