రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్.. తెలుగు స్టార్ డైరెక్టర్ల భార్యలు ఏం చేస్తారో తెలుసా..?
ప్రస్తుతం టాలీవుడ్ ఈ రేంజ్ లో ఉండటానికి డైరెక్టర్ రాజమౌళినే కారణం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని వరల్డ్ సినిమాలో గొప్పగా చూపించాడు.. జక్కన్నే కాదు.. సుకుమర్, త్రివిక్రమ్ లాంటి వారు ఇండియన్ సినిమాను ఏలుతున్నారు. మరి వారి భార్యల గురించి మీకు తెలుసా..? వారు కూడా స్టార్లన్న సంగతి తెలుసా..? వారు ఏరంగంలో సెలబ్రిలీలో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు. కాని ఇండస్ట్రీని నిలబెట్టి.. పాన్ ఇండియాతో పాటు.. ప్రంపంచ వ్యాప్తంగా పేరు తీసుకువస్తున్న దర్శఖులు మాత్రం కొందరే. మిగతావారు కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నా.. ముందుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవారు మాత్రం కొదరే. అయితే వారితో పాటు వారి భార్యలు కూడా సెలబ్రిటీలే అన్న సంగతి మీకు తెలుసా.. స్టార్ డైరెక్టర్ల భార్యలు ఎందులో ఫేమస్.. వారేం చేస్తుంటారు. ఎంత మందికి తెలుసు.. ఈరోజు తెలుసుకుందాం..
మన తెలుగు సినిమాను అంతా చీప్ గా చూసే టైమ్ లో.. అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ ను నిలబెట్టి వాళ్ల నోర్లు మూయించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు ఈయన భార్య రమ రాజమౌళి. ఆమె ఆయనలో సగభాగమే కాదు.. ఆయన పనిలో కూడా సగమే. జక్కన్న సినిమాలకు అందమూన కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు రమా రాజమౌళి. కాని ఏ ఇతర సినిమాలకు ఆమె పనిచేయదు. ఒక్క రాజమౌళి సినిమాలకే ఆమె పనిచేస్తుంది.
ప్రస్తుతం జక్కన్న తరువాత ప్లేస్ టాలీవుడ్ లో సుకుమార్ దే. అందరూ లెక్కల మాస్టర్ అని ముద్దుగా పిలుకుకునే సుకుమార్ పుష్పతో పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించాడు. ఇక ఆయన భార్య తబిత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె ప్రైవేట్ రంగంలో మాత్రం పలు వ్యాపారాలలో రాణిస్తూ ఉన్నారు. ఇప్పటికే బిజినెస్ విమెన్ గా ఆమె ఎంతో సాధించింది.
ఇక టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సతీమణి సౌజన్య క్లాసికల్ డాన్సర్. అంతే కాదు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కూడా కొనసాగుతూ వచ్చారు. ఈమె పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దివంగత పాటల రచయిత సీతారామశాస్త్రీ అన్న కూతురు సౌజన్య.
ఇక దర్శఖుడు మణిరత్నం భార్య గురించి తెలిసిందే. తమిళ ఇండస్ట్రీలో సీనియర్ డైరెక్టర్ గా మణిరత్నం అందరికి సుపరిచితం. ఆయన భార్య సుహాసిని కూడ అందరికి తెలుసు. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఆమెరోల్ మరువలేనిది. ఇక సుహాసిని సినిమా బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా తెలిసిందే. ఆమె స్టార్ హీరో కమల్ హాసన్ అన్న చారు హాసన్ కూతురు.
ఇక తెలుగులో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందినటువంటి కృష్ణవంశీ భార్య గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్. ప్రస్తుతం రాజమాత.. రమ్యకృష్ణ. కూడా ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇక యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సతీమణి ప్రియాంక దత్ కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూ పలు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇక ఈమె స్వయంగా నిర్మాత అశ్విని దత్ కుమార్తె అన్న విషయం మనకు తెలిసిందే.
ఇక టాలీవుడ్ లో దర్శఖులు భార్యలు చాలా మంది తమ కుటుంబాలకుపరిమితం అయ్యారు. ఓటమి ఎరుగని దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. జక్కన్న తరువాత ఆయనకే ఆ రీకార్డ్ ఉంది. అనిల్ రావిపూడి భార్య భార్గవి సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం గృహిణిగా స్థిరపడ్డారు ఇక బోయపాటి భార్య విలేఖ కూడా ఇలా గృహిణిగా స్థిరపడ్డారు. ఇలా చాలామంది దర్శకులు భార్యలు గృహుణిలుగా మాత్రమే ఉండటానికి ఇష్టపడుతున్నారు.