- Home
- Entertainment
- Ennenno Janmala Bandam: యష్, వేద రొమాంటిక్ సీన్స్.. మరో ప్లాన్ వేసిన అభిమన్యు, మాళవిక!
Ennenno Janmala Bandam: యష్, వేద రొమాంటిక్ సీన్స్.. మరో ప్లాన్ వేసిన అభిమన్యు, మాళవిక!
Ennenno Janmala Bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం(Ennenno Janmala Bandam) సీరియల్ మంచి ప్రేమకథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈరోజు ఏప్రిల్ 26 వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు చేసుకుందాం..

ఎపిసోడ్ ప్రారంభంలో వేద (vedha)తలనొప్పి వస్తుంది టాబ్లెట్ కావాలి అని అడగగా, అప్పుడు యష్(yash) దీనికి టాబ్లెట్ పనిచేయవు అని నాకు గతంలో డాక్టర్ వేద చెప్పింది అంటూ కాస్త కామెడీగా మాట్లాడుతాడు. నువ్వు తాగిన ప్రతిసారి నాపై కోపంగా మాట్లాడుతావు కదా ఇప్పుడు వెళ్లి అద్దంలో చూసుకుంటూ నిన్ను నువ్వే తిట్టుకో అని అంటాడు.
ఇంట్లో అందరు అప్పుడు యష్, వేద ఎక్కడ అని మాలిని అడగగా ఇంకా రూమ్ లోనే ఉంది అని అంటాడు యష్. అప్పుడు మాలిని అంతా నీ వల్లే అని అంటుంది. ఇంతలో వేద (vedha)అక్కడికి రావడంతో యష్ వేద ను చూసి నవ్వుతాడు. అప్పుడు మాలిని టిఫిన్ చేయు వేద అని అనగా నేను మళ్లీ తింటాను అత్తయ్య అని అంటుంది. ఇంతలోనే ఖుషి(kushi) డాడీ హ్యాంగోవర్ అంటే అర్థం ఏమిటి అని అడుగుతుంది.
ఆ మాటకు వేద టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు మాలిని (malini)కూలింగ్ ఎక్కువగా ఉన్న కూల్ డ్రింక్ తాగితే తలనొప్పి వస్తుంది దాన్ని హ్యాంగోవర్ అంటారు అని చెబుతుంది. ఆ తర్వాత మాలిని ఖుషి స్కూల్ లో పేరెంట్స్ డే ఫంక్షన్ కీ నువ్వు,వేద(vedha) కలిసి వెళ్ళాలి అని చెబుతుంది మాలిని. అప్పుడు యష్ సరే అనడంతో ఖుషి ఎగిరి గంతులేస్తూ ఉంటుంది.
ఆ తరువాత వేద తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్లగానే సులోచన(solochana),వేద కూర్చుని పార్టీ లో జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పార్టీకి వచ్చిన వారు నిన్ను నోటికి వచ్చిన విధంగా తిట్టాలని చూసినప్పుడు అల్లుడుగారు నీ గురించి ఎంత గొప్పగా పొగిడారో తెలుసా అంటూ యష్(yash) గురించి గొప్పగా చెబుతుంది సులోచన.
ఆ తరువాత వేద(vedha) జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధపడుతూ,యష్ దగ్గరికి వెళ్లి శ్రీవారు అని పిలవడంతో యష్ (yash)ఆశ్చర్యపోతాడు. అందరిలో నా పరువు కాపాడినందుకు థ్యాంక్స్, నిన్ను నేను కొట్టినందుకు సారీ అని చెబుతుంది వేద. అలా వారిద్దరు కాసేపు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఆ తరువాత ఇద్దరు కలిసి బయటికి వెళ్తూ ఉంటారు.
దారిలో ఒకరి వైపు మరొకరు రొమాంటిక్ చూసుకుంటూ వెళ్తుంటారు. అప్పడు యష్ (yash)చేతిలోని కారు కీస్ వేద కాళ్ల దగ్గర పడతాయి. వాటిని తీసుకోవడానికీ యష్ ఆలోచిస్తూ ఉండగా అదే మంచి సమయం అనుకుని మురిసి పోతూ ఉంటుంది వేద(vedha). అలా వారిద్దరూ ఆ కీస్ తీసుకోవడానికి ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా యష్ స్నానం చేస్తూ ఉండగా బాత్ రూమ్ లోకి వెళ్లిన వేద జారీ యష్ ను పట్టుకుంటుంది వేద.