- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: బిజినెస్ కోసం వసంత్ కు చిత్రను దూరం చేస్తున్న యష్.. కోపంతో రగిలిపోతున్న వేద!
Ennenno Janmala Bandham: బిజినెస్ కోసం వసంత్ కు చిత్రను దూరం చేస్తున్న యష్.. కోపంతో రగిలిపోతున్న వేద!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే యష్ (Yash) తో బిజినెస్ పార్ట్నర్ నా చెల్లెలిని మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అని అంటాడు. దాంతో యష్ నాకు కొంచెం టైం ఇవ్వండి మా వసంత్ (Vasanth) ను కూడా కనుక్కుంటాను అని అంటాడు. ఇక దామోదరరావు బిజినెస్ లో పైకి రావడానికి నేను సహాయం చేస్తాను అని అంటాడు.
దాంతో యష్ (Yash) ఎలాగైనా నా తమ్ముని ఈ పెళ్లికి ఒప్పిస్తాను అని అంటాడు. ఆ తర్వాత వేద యష్ దగ్గరకు వచ్చి మా చిత్ర, వసంత్ లకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను అని అంటుంది. ఇక యష్ మా వసంత్ (Vasanth) పెళ్లి దామోదర్ రావు గారి చెల్లెలితో అంటాడు. ఇక వేద ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఇక పెళ్లికి ఒప్పుకున్నందుకు వేద (Vedha) యష్ పై కోప్పడుతుంది. మరి ఈ పెళ్లి చేయకుండా వసంత్ కి వచ్చే బెన్ఫిట్ ను వదులుకో మంటావా అని యష్ (Yash) అంటాడు. ఇక వేద ఇద్దరి అమాయకుల ప్రేమను మీ బిజినెస్ కోసం బలి చెయ్యొద్దు అని అంటుంది. ఆ తర్వాత ప్రపోజల్ గురించి యష్ తన తమ్ముడికి చెబుతాడు.
అంతేకాకుండా ఒకసారి దామోదర్ రావు (Dhamodhar Rao) గారి చెల్లి ని కలవమని చెబుతాడు. దానికి వసంత్ అంగీకరించక పోగా.. యష్ (Yash) వసంత్ ను ఏదో ఒక విధంగా ఒప్పిస్తాడు. ఈ క్రమంలో వాళ్ళిద్దరు కన్వర్జేషన్ వినడానికి యష్ వేదకు ఫోన్ చేసి పక్కన పెడతాడు. ఇక విషయం అంతా వేద చిత్రకు చెబుతుంది.
దాంతో చిత్ర (Chithra) ఎంతో బాధ పడుతుంది. ఇక వేద నువ్వు ధైర్యంగా ఉండు చిత్ర నీకు సపోర్ట్ గా నేను ఉన్నాను అని చెబుతుంది. నేను ఈ విషయంలో ఫైట్ చేసి తీరుతాను అని చిత్ర అంటుంది. ఇక వేద (Vedha) మిస్టర్ యశోదర్ మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి అని అనుకుంటుంది.
ఇక తరువాయి భాగం లో యష్ (Yash) తన బిజినెస్ పార్టనర్ కూతురు నిధి ను ఒక పది రోజులు మీ ఇంట్లో ఉంచుకొండి అని వాళ్ళ అత్త మామలను అడుగుతాడు. ఆ విషయం తెలిసిన వేద (Vedha) యష్ పై కోప్పడి నానా మాటలు అంటుంది. దాంతో యష్ వేదను కోపంగా గెట్ అవుట్ అని అంటాడు.