- Home
- Entertainment
- Ennenno Janmala Bandam: ఘనంగా జరిగిన వేద యశోధర్ ల పెళ్లి.. పార్టీలో మాళవిక, అభిమన్యు?
Ennenno Janmala Bandam: ఘనంగా జరిగిన వేద యశోధర్ ల పెళ్లి.. పార్టీలో మాళవిక, అభిమన్యు?
Ennenno janmala bandam : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం. ఈరోజు ఎపిసోడ్ లో ఖుషి దగ్గరుండి యష్, వేద ఇద్దరికి పెళ్లి చేస్తుంది. ఇక ఈ సీరియల్ లో గురువారం మార్చ్ 3వ తేది ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఖుషి వెళ్ళిపోతూ ఉండగా వేద వచ్చి ప్రేమగా ఖుషి అని పిలిచి ఆపుతుంది. ఇక వేద పరిగెత్తుకుంటూ వచ్చి ఖుషిని హత్తుకుని, ఎత్తుకొని తిప్పుతూ ఉంటుంది. చాలా ప్రేమగా ఖుషి ని దగ్గరకు తీసుకొని నేను నీ ఫ్రెండ్ ని కాదు మీ అమ్మ ను అంటు నీకోసం దేన్నైనా భరిస్తాను, ఎవరినైనా క్షమిస్తాను కానీ నువ్వు బాధ పడితే మాత్రం నేను భరించలేను.నేను మీ నాన్న ని నీకోసం పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది ఇక నేను నీ ఫ్రెండ్ ని కాదు మీ అమ్మను అంటూ అమ్మ అని పిలిపించుకుంటుంది.
ఇక అందరూ పెళ్లి ఆగిపోయినందుకు వెళుతూ ఉంటారు. కానీ ఖుషి వచ్చి అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆగండి నాన్నమ్మ అమ్మమ్మ అంటూ ఉంటుంది. ఇక జరిగింది తెలియనివాళ్లు ఏంటి ఖుషి ఏం మాట్లాడుతున్నావ్ అంటుంటారు. ఖుషి సంతోషంతో మా అమ్మకి నాన్నకి పెళ్లి అంటూ అందరికీ చెప్తుంది అందరినీ తిరిగి కళ్యాణ మండపం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక ఖుషి మా మమ్మీ వస్తుంది అని చెప్పడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు.
వేద అక్కడికి వస్తూ ఉంటుంది ఇది చూసిన యశోధర్ కూడా ఆశ్చర్యపోయే చూస్తూ ఉంటాడు. వేద వచ్చి నిలబడగానే సులోచన నిజంగానే ఈ పెళ్లి కొట్టుకుంటున్నావా అని అడుగుతుంది దాంతో వేద అవును ఖుషి కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను ఖుషి కోసమే దేన్నైనా భరిస్తాను ఖుషి కోసమే అందరిని క్షమిస్తాను ఖుషి సంతోషమే నాకు ముఖ్యం అంటుంది దాంతో రెండు కుటుంబాల వారు చాలా సంతోష పడుతూ ఉంటారు.
మాలిని, సులోచన ఖుషి ని ఎత్తుకొని పెళ్లి హడావిడి చేస్తూ ఉంటారు. వేద యశోధర్ లు ఒకరినొకరు చూసుకుంటారు. ఇక పెళ్లికి సంబంధించిన తంతును మొదలుపెడతారు. మాలిని యశోదర్ బుగ్గమీద చుక్క లేకపోవడంతో చుక్కను పెడుతూ ఉంటుంది మాలిని కానీ ఖుషి నానమ్మ నేను పెడతాను అని యశోదర్ కు బుగ్గన చుక్క పెడుతుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ఖుషి మాత్రం మా మమ్మీ ని తొందరగా పిలిపించండి అని గోల చేస్తూ ఉంటుంది.
అందంగా ముస్తాబైన వేదను బుట్టలో తీసుకు వస్తారు. ఇక వేద యశోధర్ లు ఒకరికొకరు కంకణాలు కట్టుకొని జీలకర్ర బెల్లం కూడా ఒకరి నెత్తి మీద మరొకరు పెట్టుకుంటారు. ఖుషి చాలా సంతోషంగా ఇదంతా చూస్తూ ఉంటుంది ఇక పెళ్ళి జరుగుతున్నంతసేపు వేద యశోధర్ మధ్య ఖుషి నిలబడి పెళ్లి పెద్దగా ఉంటుంది ఇక యశోధర్ వేద మెడలో తాళి కడతాడు. వేద తాళిని చూసుకుంటూ బాధతో సంతోషిస్తూ ఉంటుంది. ఇక పెళ్లి తో ఒకటైన ఈ జంటను అందరూ దీవిస్తూ ఉంటారు. పూల దండలు మార్చుకుని, యశోధర్ వేద కాలి వేళ్ళకు మెట్టెలు తోడుగుతాడు.
ఖుషి వేద,యశోదర్ కు బ్రహ్మ ముడి వేసి యశోదర్ చెయ్యి పట్టుకుని వేదతో ఏడడుగులు వేయిస్తుంది. ఇక వేద యశోధర్ ఖుషి ని వారిద్దరి మధ్య ఎత్తుకొని చాలా సంతోష పడుతూ ఉంటారు. ఇక వేద అప్పగింతలు మొదలవుతాయి. వేద తో పాటు వేద ఫ్యామిలీ కూడా బాధపడుతూ ఉంటుంది. సులోచన కన్నీటిని దాచుకుంటూ గంభీరంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కానీ పేద వెళ్ళిపోతుందని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వేద వాళ్ళమ్మను నాన్న ను,చిత్రను, అక్కను హత్తుకొని బాధపడుతూ ఉంటుంది.
ఇక పంతులుగారు అప్పగింతల కార్యక్రమాన్ని ప్రారంభించండి అనడంతో సులోచన యశోదర్ కు వేదన అప్పగిస్తూ నా కూతురిని చాలా గారాబంగా పెంచుకున్న ము నా కూతురిని బాగా చూసుకోండి అని వేద వాళ్ళ నాన్న అమ్మ చెప్తారు. యశోదర్ కూడా మీ అమ్మాయికి ఎలాంటి కష్టం రానివ్వను అని చెప్తాడు. సులోచన బాధపడుతూ ఉండటంతో ఇక మాలిని బాధపడకు మీ అమ్మాయిని మా కూతురు లా చేసుకుంటాము అంటుంది రత్నం కూడా మీ అమ్మాయికి ఎలాంటి కష్టం రానివ్వము అని మాటిస్తాడు.
ఇక వేదను తీసుకు వెళుతుంటే సులోచన మాత్రం వెళ్ళిపోతున్నావా వేద అంటూ బాధపడుతుంది దాంతో మాలిని నీకు లక్కీ ఛాన్స్ ఉంది వాకిలి తెరవగానే నీ కూతురు కనిపించేంత దగ్గరలో ఉంది ఇంకా ఎందుకు బాధ పడుతున్నావు అంటూ ధైర్యం చెబుతూ ఉంటుంది. ఖుషి ఇక పదండి అనడంతో వేద యశోధర్ లు కార్లో బయలుదేరి కూర్చుంటారు. ఖుషి చాలా సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటుంది మిగతా వారు కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఖుషి సంతోషంగా ఉండటం తో వేద కూడా ఖుషి ని చూస్తూ చాలా సంతోష పడుతూ ఉంటుంది.
ఇక వేద యశోధర్ లు ఇంటీకి వస్తారు. కానీ కాంచన ఆపి ఒకరి పేర్లు ఒకరు చెప్పాలి అంటుంది. సుహా,చిత్రాలు ఫస్ట్ అబ్బాయి చెప్పాలి అంటే . కాంచన, వసంత్ లు లేదు అమ్మాయి చెప్పాలి అని పోట్లాడుతూ ఉంటారు. వేద యశోదర్ కూడా ముందు నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అంటూ గొడవ పడుతూ ఉంటారు. ఇక వేద, యశోదర్ లు ఖుషి ని ఎత్తుకొని గృహప్రవేశం చేస్తారు. వేద యశోదర్ ఇంట్లో దీపాన్ని వెలిగించి ఖుషి వైపు చూసి సంతోష పడుతూ ఉంటుంది.మరి రానున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాల్సిందే.