MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: కైలాష్ ని చితక్కొట్టిన యష్.. నాకోసమే పుట్టిన దేవత నా వేద అంటూ?

Ennenno Janmala Bandham: కైలాష్ ని చితక్కొట్టిన యష్.. నాకోసమే పుట్టిన దేవత నా వేద అంటూ?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 1 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Dec 01 2022, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజు ఎపిసోడ్ లో వేద కోసం యష్ బయట నిలబడి ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వేద వచ్చి యష్ ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుండడంతో వేద అని పిలుస్తాడు. అప్పుడు యష్ నేను నిన్ను ఇంటి దగ్గర దిగబెడతాను అనగా వద్దు అని వేద అనడంతో క్లినిక్ లేక ఇంటిదగ్గర చెబితే వదిలిపెడతాను అనడంతో వెంటనే వేద నన్ను ఎప్పుడో వదిలేసారు కదా అని అంటుంది. ఇప్పుడు ఎందుకు కొత్తగా అని వేద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే అక్కడికి కైలాష్ వచ్చి హాయ్ వేద అని అంటాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

 రా వేద నేను డ్రాప్ చేస్తాను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం అని అనడంతో వేద సీరియస్ అవుతూ సిగ్గులేని జన్మ ఛీఛీ అంటూ చీదరించుకొని వెళ్ళిపోతుండగా ఆగు వేదా అని వెనకాలే పడతాడు. నువ్వు నా పక్కన నువ్వు నీ పక్కన నేను ఇద్దరమే కలిసి రొమాంటిక్ గా అలా లాంగ్ డ్రైవ్ వెళ్దామడంతో నీకు ఎన్నిసార్లు చెప్పాలి సిగ్గు లేదా అని సీరియస్ అవుతుంది వేద. అయినా కూడా కైలాష్ సిగ్గు లేకుండా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. జీవితంలో నువ్వు కోల్పోయిన ఆ ఆనందాన్ని నేను తిరిగి ఇస్తాను అని వేద చేయి పట్టుకోపోతుండగా ఇంతలో యష్ అక్కడికి వస్తాడు.
 

36

అప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి రా వేద జోలికి రావద్దు అని అంటూ కైలాష్ ని చితక బాదుతాడు. ఇప్పుడు వేద ఎంత చెప్పినా వినిపించుకోకుండా కైలాస్ ని చావు దెబ్బలు కొడతాడు యష్. జైల్లో చిప్పకూడు తినాల్సిన వాడివి బయట ఉన్నావంటే అది నా భార్య మీద పెట్టిన బిక్షరా. ఈరోజు నా భార్య వేదా లేకపోతే నేను యశోదర్ లేడు. ఖుషి లేదు నా ఫ్యామిలీ లేదు రా అని అంటాడు. అలాంటి నా వేదని బాధపెడుతున్న నన్ను బరిస్తోంది రా అని వేద గురించి గొప్పగా మాట్లాడతాడు. నా వేద అనుక్షణం కాపాడుకుంటూ కంటికి రెప్పలా చూస్తోంది.

46

అప్పుడు వేదని దగ్గరికి తీసుకొని రేయ్ నా దేవతరా నా వేద. నా కోసమే పుట్టిన నా దేవతరా వేద అని అనడంతో వేద ఎమోషనల్ అవుతుంది. ఆ తరువాత వేద,యష్ ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు మాళవిక వచ్చి లాయర్ దగ్గరికి వెళ్దాం పద అని అనగా గెట్ లాస్ట్ అని గట్టిగా అరుస్తాడు. అసలు నీ వల్లే ఇదంతా జరిగింది. నీ వల్ల ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నా జీవిత్తో అయిపోవడానికి కారణం నువ్వే అని అందరి  ముందు మాళవికపై సిరీయస్ అవుతాడు యష్. ఆ తరువాత యష్ వేద ని కారులో పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు ఎందుకు వేద నన్ను ఆపావు అలాంటి వాడు ఉంటే ఎంత పోతే ఎంత అని అంటాడు యష్.
 

56

అప్పుడు యష్ చేతికీ గాయం అవ్వడంతో వేద కారు ఆపి యష్ కీ చేతికి కట్టుకడుతుంది. ఆ తరువాత వేద డ్రైవ్ చేస్తుంది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. మరొకవైపు సులోచన ఇంట్లో ఏడుస్తూ ఉండగా ఆమె భర్త ఓదారుస్తూ ఉంటాడు. నా కర్మ కాలి నేను ఆరోజు ఎందుకు ఆ మాళవిక ఇంటికి వెళ్ళాలి ఇదంతా నా వల్లే జరిగింది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు యాక్సిడెంట్ లో నేను పోయినా బాగుండేది అనగా  అప్పుడు మాలిని అలా మాట్లాడకు అని ఉంటుంది. అప్పుడు మాలిని, సులోచనకు ధైర్యం చెబుతూ ఉంటుంది.

66

 ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వేద యష్ ని చేయి పట్టుకొని పిలుచుకొని వెళ్లడం చూసి వాళ్ళు ముగ్గురు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు నేను చెప్పిన కదా ముద్దపప్పు వాళ్లిద్దరూ చూడు ఎంత బాగా కలిసిపోయారో అని అంటుంది మాలిని. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి అని అంటుంది సులోచన. అప్పుడు ఇంట్లోకి వెళ్లిన వేద యష్ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కడుతుంది. అప్పుడు ఎంత చెప్పినా వినకుండా వేద కట్టబడుతుంది. ఇప్పుడు యష్ వేదని ఆట పట్టిస్తూ మాట్లాడుతూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagababu: నాగబాబు 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్.. పందెం కోడిపుంజు పోయింది, నవ్వులు పూయిస్తున్నారుగా
Recommended image2
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image3
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved