MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: మాళవికకు దగ్గరుండి సేవలు చేస్తున్న వేద.. యష్ ను నిలదీస్తున్న నీలాంబరి?

Ennenno Janmala Bandham: మాళవికకు దగ్గరుండి సేవలు చేస్తున్న వేద.. యష్ ను నిలదీస్తున్న నీలాంబరి?

Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. బాధ్యత లేకుండా ప్రవర్తించే తన జీవితాన్ని నడిరోడ్డుపాలు చేసుకున్న ఒక ఆడదాని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : May 31 2023, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో ఆదిత్య యష్ కి ఫోన్ చేస్తాడు. యష్ మొదట పట్టించుకోడు. కానీ పదే పదే కాల్స్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. డాడీ అంటూ ఆదిత్య ఏడుపు విని షాక్ అవుతాడు. ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడుగుతాడు  యష్. అడ్రస్ చెప్పి.. తొందరగా వచ్చేయ్ నాకు చాలా భయంగా ఉంది అంటూ మరే వివరాలు చెప్పకుండా ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య. కంగారుగా కొడుకు దగ్గరికి పరిగెడతారు వేద దంపతులు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అక్కడ చెత్తకుప్ప దగ్గర పడి ఉన్న తల్లి కోసం ఏడుస్తున్న కొడుకుని చూసి షాకవుతారు వేద దంపతులు. చెత్త కుప్పలు పడి ఉన్న మాళవిక ని చూసి అసహ్యించుకుంటాడు యష్. ఆదిత్య ని తీసుకోని వెళ్ళిపోదాం అంటాడు. కానీ వేద ఒప్పుకోదు. మాళవికను కూడా తీసుకొని వెళ్దాము తనను ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళటం మంచిది కాదు అంటుంది. చూసావా నా కొడుకుని ఎలాంటి పరిస్థితి కి తీసుకొచ్చిందో.
 

38

తాగి ఎలా పడిపోయిందో చూసావా.. అసలు బాధ్యత ఉందా, ఆడదేనా తను అంటూ అసహ్యించుకుంటాడు యష్. అమ్మ రాకపోతే నేను రాను అంటూ తండ్రి చేయి విడిపించుకుని తల్లి దగ్గరికి వెళ్లి ఏడుస్తాడు ఆదిత్య. ఎంతైనా తను ఒక ఆడపిల్ల.. తనని ఇలా వదిలేసి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు. ఆదిత్య మనతో రావాలంటే మనం మాళవిక ని తీసుకెళ్లి తీరాల్సిందే అంటూ భర్తని ఒప్పించి ఆదిత్యతోపాటు మాళవికని కూడా తీసుకువస్తుంది వేద.
 

48

అదే సమయంలో ఇంటి దగ్గర యష్ దంపతులని తలుచుకొని ఆనంద పడుతూ ఉంటారు మాలిని దంపతులు. అంతలోనే డోర్ బెల్ మోగటంతో వెళ్లి తలుపు తీస్తుంది మాలిని. ఎదురుగా ఉన్న యష్ ని చూసి షాకవుతుంది. పక్కనే ఏడుస్తున్న ఆదిత్య ని చూసి కంగారు పడుతుంది. ఆదిత్య నానమ్మ అంటూ మాలినిని హత్తుకొని ఏడుస్తాడు. అసలు ఏం జరిగింది? వేద, నువ్వు కలిసి వెళ్లారు కదా మధ్యలో ఆదిత్య ఎక్కడి నుంచి వచ్చాడు అసలు వేద ఏది అంటూ కంగారుగా అడుగుతుంది మాలిని.
 

58

అంతలోనే మాళవికని తీసుకుని వస్తున్న వేద ని చూసి షాకవుతారు మాలిని దంపతులు. దీన్ని ఎందుకు తీసుకొచ్చావు అంటూ కోప్పడతారు. నీ కోడల్ని అడుగు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యష్. కానీ వేద వాళ్లకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మాళవిక ని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది. అంతా సజావుగా సాగుతుంది అనుకుంటే మధ్యలో మళ్లీ ఈ మాళవిక ఊడి పడిందేంటి అని బాధపడతారు రత్నం దంపతులు.

68

మరోవైపు మాళవికకి డ్రెస్ మార్చి మజ్జిగ తాగించి పడుకోబెడుతుంది వేద. మత్తులో ఉన్న మాళవిక నన్ను మోసం చేశాడు. నాకు ఎవరూ లేరు అంటూ ఏడుస్తుంది. పొద్దున్నే మాట్లాడుకుందాం పడుకో అని చెప్పి బయటకి వస్తుంది వేద. అప్పటికే అక్కడ ఉన్న యష్ తన వల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో తెలుసా? అయినా తనకి ఒక తల్లి లాగా సేవలు చేస్తున్నావు. నిన్ను ఏమనుకోవాలో అర్థం కావడం లేదు అంటాడు.

78

వాళ్లు గతంలో చేసిన తప్పులు తలుచుకొని ఇప్పుడు అలా వదిలేయమంటారా? అంటుంది వేద. నువ్వు పాముకి పాలు పోస్తున్నావనే విషయం మర్చిపోతున్నావు. అది ఎప్పటికైనా విషం కక్కుతుంది అంటాడు యష్. నేను ఏది మర్చిపోలేదు.. అలాగే తను ఆదిత్య తల్లి అని కూడా మర్చిపోలేదు. ఏం చేసినా అంతా ఆదిత్య కోసమే అంటుంది వేద.

88

ఆ తరువాత ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న కొడుకు దగ్గరికి వస్తుంది మాలిని. ఏంటి నాన్న ఇదంతా అని అడుగుతుంది. తరువాయి భాగంలో నా కొడుకు మీదే చెయ్యేస్తావా అంటూ అభి ని చితక్కోడతాడు యష్. తనని కొట్టటానికి నువ్వెవరు అంటూ యష్ ని నిలదీస్తుంది నీలాంబరి. తను ఎంత మందిని మోసం చేశాడో తెలుసా అంటూ జరిగిందంతా చెప్తుంది వేద.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image2
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Recommended image3
మ‌నం జాలీగా విన్న ‘అమృతం’ పాట‌లో ఇంత అర్థ‌ముందా.? ఆలోచ‌న‌ను మార్చే జీవిత స‌త్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved