- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: పాపం.. సులోచన, వరదరాజుల పెళ్లిరోజును పెటాకులు చేసిన యష్, వేద!
Ennenno Janmala Bandham: పాపం.. సులోచన, వరదరాజుల పెళ్లిరోజును పెటాకులు చేసిన యష్, వేద!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ మంచి ప్రేమ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 20 న ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలో యష్ (Yash), వేద మధ్యల చిన్న టాపిక్ రావటంతో దానివల్ల కాస్త గొడవ జరుగుతుంది. దాంతో యష్ వేదను అదుపులో ఉండమంటూ గట్టిగా హెచ్చరిస్తాడు. వేద కూడా తన మాటలతో యష్ ను కడిగి పారేస్తుంది. ఖుషి (Khushi) కోసం జీవితం లోకి వచ్చాను అంటూ మాట్లాడి కాసేపు క్లాస్ పీకి అక్కడినుంచి వెళ్లిపోతుంది.
సులోచన (Sulochana) తన ఇంట్లో కూర్చొని రాశుల గురించి చదువుతూ ఉండగా అప్పుడే ఖుషి లోపలికి వస్తుంది. ఖుషి ఆ పుస్తకం చూసి ఏంటని ప్రశ్నించడంతో.. వెంటనే సులోచన ఆ పుస్తకం గురించి వివరిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది అని అంటుంది. అప్పుడే వేద (Vedha) రావటంతో పక్కనే ఉండి వింటుంది.
గత ఏడాది వేద జీవితంలోకి నువ్వు వస్తావని రాసిపెట్టింది అంటూ ఖుషి (Khushi) తో అంటుంది. ఇక వేద (Vedha) కూడా తనకు గతంలో ఖుషి ఎదురైన సంఘటనను గుర్తు చేసుకొని ఇది నిజమే అంటూ ఖుషి దగ్గరికి వచ్చి చెబుతుంది. గత జన్మలో మనమిద్దరం విడిపోయి ఇప్పుడు ఇలా కలిసాము అని అంటుంది. ఎన్నెన్నో జన్మల బంధం మనదని అంటుంది.
మరోవైపు వరదరాజులు (VaradhaRajulu) తన భార్య సులోచన కోసం మల్లెపూలు తీసుకొని వచ్చి రేపు తమ పెళ్లి రోజు అని 12 గంటలకు విష్ చేయాలని అనుకుంటాడు. అంతలోనే అక్కడికి యష్ రావడంతో యష్ తో పెళ్లిరోజు గురించి చెబుతాడు. అంతేకాకుండా తనే ఫస్ట్ విష్ చేస్తానని చెప్పటంతో యష్ (Yash) ఆడవాళ్ళ గురించి నెగటివ్ గా చెబుతాడు.
అంతేకాకుండా వరదరాజులు పెళ్లి రోజును పెటాకులు చేయడానికి ఇంత నూరి పోస్తాడు. దాంతో వరదరాజులు ఇదంతా నిజమే అనుకొని తగ్గేదేలే అంటాడు. సులోచన (Sulochana) కూడా తమ పెళ్లి రోజు సందర్భంగా ఇంట్లో వరదరాజులు కోసం ఇష్టమైన మైసూర్ పాక్ తయారు చేస్తూ ఉంటుంది. అంతలోనే వేద (Vedha), చిత్ర వచ్చి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలుపుతారు.
ఇక వేద (Vedha) కూడా తన తల్లికి కొన్ని మాటలు చెప్పి తను కూడా మరింత నూరి పోస్తుంది. మొత్తానికి చీకటి పడ్డాక వరదరాజులు, సులోచన (Sulochana) ల మధ్య మొత్తానికి మాటల యుద్ధం జరుగుతుంది. ఉదయాన్నే కూడా వాళ్ల మధ్య యుద్ధం జరుగుతుంది. అంతలోనే వేద వచ్చి వాళ్లను కలుపుతుంది.