- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: వేద నా భార్య అంటూ సపోర్ట్ చేసిన యష్.. చెంప పగలగొట్టిన డాక్టర్..?
Ennenno Janmala Bandham: వేద నా భార్య అంటూ సపోర్ట్ చేసిన యష్.. చెంప పగలగొట్టిన డాక్టర్..?
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala bandam) సీరియల్ మంచి ప్రేమ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 22 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే యష్ (Yash), వాళ్ళ తమ్ముడు.. వేద కూల్ డ్రింక్ అను కొని మందు తాగి నందుకు తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకవైపు వేద తాగిన మత్తులో మిస్సెస్ మలబార్ మాలిని (Malini) అని అంటుంది. అంతేకాకుండా మా అత్తయ్య నయనతార మా మామయ్య నాగార్జున అని అంటుంది.
దాంతో చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఎంతో ఆశ్చర్యంగా చూస్తారు. ఒక పక్క యష్ (Yash) టెన్షన్ పడుతూ ఉంటాడు. అదే క్రమంలో బుజ్జి బుజ్జి.. అంటూ వాళ్ళ అత్తలను వేద ముద్దు లాడుతూ ఉంటుంది. దాంతో అందరూ ఈ రోజు వేద (Vedha) కు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటారు.
ఇక ఆ తర్వాత వేద కిందపడిపోయి యష్ (Yash) ను కూడా కింద పడేస్తుంది. ఇక తాగిన మత్తులో వేద భర్తను నానారకాలుగా ఫన్నీగా టార్చర్ పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక ఆవిడ మీద వేద తాగిన మత్తులో డ్రింక్ పోస్తుంది. దాంతో ఆవిడ వేద (Vedha) పై నానారకాలుగా విరుచుకు పడుతుంది.
ఈలోపు అక్కడకు యష్ (Yash) వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నారు. డాక్టర్ వేద మై వైఫ్ అంటాడు. నా ముందే నా భార్య గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడానికి ఎంత ధైర్యం మీకు అని అంటాడు. ఇక వాళ్ళ పై విరుచుకుపడుతూ వేద (Vedha) గురించి గొప్పగా చెప్పుకొస్తాడు యష్. దాంతో ఆవిడ అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత యష్ (Yash) వేదకు తాగిన మత్తు వదలడానికి షవర్ కింద తడుపుతాడు. క్రమంలో వేద యష్ గుండెల పై హాగ్ చేసుకొని నిద్రపోతుంది. దాంతో యష్ కొంత ప్రేమగా ఫీల్ అవుతాడు. ఇక తర్వాత వేద కాసేపు ఖుషి (Khushi) తో ముద్దు లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత వేదకు జరిగిన విషయం తెలుస్తుంది.
ఇక వెంటనే వేద (Vedha) యష్ దగ్గరకు వచ్చి గట్టిగా తన చెంప పగలగొడుతుంది. అంతేకాకుండా నువ్వు మనిషివేనా.. సిగ్గు లేదా నీకు అని అడుగుతుంది. ఈ క్రమంలో యష్ (Yash) ఏమి రియాక్ట్ అవ్వకుండా అలాగే చూస్తూ ఉంటాడు. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.