- Home
- Entertainment
- Toxic Cast Remuneration: రెమ్యూనరేషన్‌లో యష్ కి నయనతార గట్టి పోటీ.. టాక్సిక్ స్టార్ల జీతాల వివరాలు
Toxic Cast Remuneration: రెమ్యూనరేషన్‌లో యష్ కి నయనతార గట్టి పోటీ.. టాక్సిక్ స్టార్ల జీతాల వివరాలు
Toxic Cast Remuneration: యష్ కొత్త సినిమా `టాక్సిక్` మూవీ టీజర్ ఇటీవల విడుదలై సంచలనంగా మారింది. అయితే ఇందులో నటిస్తోన్న కాస్ట్ రెమ్యూనరేషన్స్ ఎంతనేది తెలుసుకుందాం.

టాక్సిక్‌తో వస్తోన్న రాకింగ్ స్టార్ యష్
తెలుగు సినిమాకు `బాహుబలి` ఎలా టర్నింగ్ పాయింట్ అయ్యిందో, కన్నడ సినిమాకు `కేజీఎఫ్` అలా టర్నింగ్ పాయింట్ అయ్యింది. అప్పటివరకు కన్నడ సినిమాపై ఉన్న అభిప్రాయాన్ని ఆ సినిమా మార్చేసింది. కన్నడ సినిమా మార్కెట్‌ను పెంచడంలో కేజీఎఫ్ సినిమా కీలక పాత్ర పోషించింది. దాని రెండో భాగం భారతీయ సినిమాలో అతిపెద్ద హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల టాప్ 10 జాబితాలో కేజీఎఫ్ 2 ఇప్పటికీ ఉంది. `కేజీఎఫ్` ద్వారా పాన్-ఇండియన్ స్టార్‌డమ్ పొందిన యష్ తదుపరి `టాక్సిక్` చిత్రంతో వస్తున్నారు.
టాక్సిక్ టీజర్ ట్రెండింగ్
'టాక్సిక్' చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించడం విశేషం. రెండు రోజుల క్రితం యష్ పుట్టినరోజున విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి ఆదరణ పొందింది. సంచలనంగా మారింది. వరుసగా ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు, యష్‌తో సహా చిత్రంలోని నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో యష్ హీరోగానే కాకుండా, సహ రచయితగా కూడా పనిచేస్తున్నాడు.
టాక్సిక్‌కి యష్ పారితోషికం
కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో యష్ రెమ్యూనరేషన్ రూ.50 కోట్లు. మహిళా పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిలో నయనతార, కియారా అద్వానీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.
టాక్సిక్ హీరోయిన్ల పారితోషికాలు
నయనతారకు రూ.12 నుంచి రూ.18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ లభిస్తుండగా, కియారా అద్వానీకి రూ.15 కోట్లు అందుతోంది. రుక్మిణి వసంత్‌కు రూ.3 నుంచి 5 కోట్ల వరకు, హుమా ఖురేషి, తారా సుతారియాలకు రూ.2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. భాషతో సంబంధం లేకుండా భారతీయ ప్రేక్షకులలో భారీ అంచనాలను రేకెత్తించిన ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఎలాంటి అద్భుతం సృష్టిస్తుందో వేచి చూడాలి.

