- Home
- Entertainment
- Sridivya without Makeup: మేకప్ లేకుండా నేచురల్ అందంతో కట్టిపడేస్తున్న శ్రీదివ్య.. లేటెస్ట్ ఫోటోలు
Sridivya without Makeup: మేకప్ లేకుండా నేచురల్ అందంతో కట్టిపడేస్తున్న శ్రీదివ్య.. లేటెస్ట్ ఫోటోలు
Sridivya without Makeup: శ్రీదివ్య తెలుగు అమ్మాయి అయినా తమిళంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా ఆమె అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. మేకప్ లేకుండా తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలను పంచుకుంది.

కోలీవుడ్‌లో పాపులర్ అయిన తెలుగు నటి శ్రీదివ్య
తెలుగు ఫ్యామిలీకి చెందిన హీరోయిన్ శ్రీదివ్య ఇప్పుడు తమిళంలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అక్కడ మంచి విజయాలు అందుకుని మెప్పిస్తుంది. ఇటీవల `సత్యం సుందరం` మూవీలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
మేకప్ లేకుండా కనిపించి శ్రీదివ్య సర్‌ప్రైజ్
తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో తన ఫోటోలను పంచుకుంది. చాలా నేచురల్‌గా ఉన్న ఈ పిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో శ్రీదివ్య మేకప్ లేకుండా కనిపించడం విశేషం. మేకప్ లేకపోయినా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. పైగా పెరిగింది. దీంతో శ్రీదివ్య ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి.
శివకార్తికేయన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ
శివకార్తికేయన్ నటించిన 'వరుత్తపడాద వాలిబర్ సంగం' సినిమాతో కోలీవుడ్‌లో ఫేమస్ అయ్యింది. ఆమె సొంతూరు హైదరాబాద్ అయినా, తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇటీవలి కాలంలో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు.
బాలనటిగా శ్రీదివ్య తెలుగు ఆడియెన్స్ కి పరిచయం
`హనుమాన్ జంక్షన్` మూవీతో బాలనటిగా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది శ్రీదివ్య. తొలి చిత్రంతోనే బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన `యువరాజు` చిత్రంలోనూ బాలనటిగా మెరిసింది.
బాలనటిగా నంది అవార్డు
ఇలా వరుసగా `వీడే`, `భారతి` చిత్రాల్లో నటించింది. `భారతి` మూవీకిగానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డుని అందుకుంది. ఆ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చింది శ్రీదివ్య.
`మనసారా` మూవీతో హీరోయిన్‌గా పరిచయం
`మనసారా` మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది శ్రీదివ్య. `బస్ స్టాప్` మూవీ మంచి గుర్తింపుని, బ్రేక్‌ని తీసుకొచ్చింది. తెలుగులో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత `మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు` మూవీతో మరో డీసెంట్ హిట్‌ని అందుకుంది.
సినిమాలు తగ్గించిన శ్రీదివ్య
ఆ తర్వాత తెలుగులో `వారధి`, `కేరింత` తో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోకి షిఫ్ట్ అయి అక్కడ వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో మళ్లీ మూవీస్ చేయలేదు. తమిళంలోనూ చాలా సెలక్టీవ్‌గా వెళ్తోంది శ్రీదివ్య.

