- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: భర్తని ఒక ఆట ఆడుకుంటున్న వేద.. అభి ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Ennenno Janmala Bandham: భర్తని ఒక ఆట ఆడుకుంటున్న వేద.. అభి ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మూడుముళ్ల బంధాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న ఒక స్త్రీమూర్తి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో భర్త వేషధారణ చూసి ఆశ్చర్య పోతుంది వేద. ఈయన పంచ కట్టుకున్నారు నాకు సారీ ఇచ్చారు ఒకవేళ కండోమ్ తెచ్చింది ఈయనేనేమో అని అనుమాన పడుతుంది. ఇప్పుడు ఎందుకు పంచ కట్టుకున్నారు అంటూ అమాయకంగా అడుగుతుంది. ఏం చెప్పాలో అర్థం కాక ఉక్క పోస్తుంది కదా అందుకనే అంటూ సిగ్గుపడుతూ చెప్తాడు యష్.
అందుకు ఏసి ఉంది కదా అంటుంది వేద. ఒకవేళ కరెంటు పోతే.. అందుకే ముందు జాగ్రత్త అంటాడు యష్. నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటుంది వేద. అదే ముహూర్తం అనుకున్నాం కదా అంటూ సిగ్గుపడతాడు యష్. అప్పుడు పూర్తిగా అర్థం చేసుకుంటుంది వేద కానీ భర్తని ఆట పట్టించడం కోసం ఏమి తెలియనట్లుగా పెళ్లి ముహూర్తం గురించిన మీరు మాట్లాడేది అది ఎప్పుడో పెట్టేసారు కదా అంటుంది.
తనకి అర్థమయ్యేలాగా చెప్పడం నావల్ల కాదు అంటూ చిరాకు పడిపోయి మంచమెక్కి పడుకుంటాడు యష్. అతని చిరుబురులు చూసి మా ఆయనకి కూడా ధైర్యం వచ్చింది అంటూ నవ్వుకుంటుంది వేద. యష్ నిద్రపోయిన తర్వాత నుదుటిమీద ముద్దు పెట్టి మన బంధాన్ని ఒక మెట్టు పైకి ఎక్కించాలని చూస్తున్నారు ఆ రోజు త్వరలోనే వస్తుంది అని అనుకుంటుంది వేద.
మరోవైపు పెళ్లి ఫిక్స్ అయినందుకు ఆఫీసులో స్వీట్స్ పంచుతుంది చిత్ర. అభి కి కూడా ఇవ్వటానికి వస్తుంది. మన పెళ్లికి నువ్వు స్వీట్స్ ఇవ్వటం ఏంటి అంటాడు అభి. ఏం మాట్లాడుతున్నావ్ నా పెళ్లి వసంతతో మాత్రమే జరుగుతుంది అంటూ కోపంగా మాట్లాడుతుంది చిత్ర. విధిరాత చూసావా నీ పెళ్లికి నా పెళ్ళికి ఒకే ముహూర్తం కుదిరింది కానీ జరగబోయేది ఒకటే పెళ్లి అది నీకు నాకు మాత్రమే అంటాడు అభి.
అంతలోనే మాళవిక రావటం గమనించి మరి అంతా మొండి పట్టుదల ఏంటి అంటూ మాట మార్చేస్తాడు అభి. ఏం జరిగింది అంటుంది మాళవిక. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఆఫీసుకు రావటం ఎందుకు రెస్ట్ తీసుకోమంటే వినటం లేదు చిత్ర అంటాడు అభి. ఎలా ప్లేట్ మార్చేసాడో అనుకుంటుంది చిత్ర. అభి చెప్పినట్లు చేయు. పెళ్ళంటే చాలా పనులు ఉంటాయి కదా వెళ్లి వర్క్ త్వరగా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపో.
రేపటి నుంచి ఆఫీసుకు రాకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాళవిక. చిత్రకూడా వెళ్ళిపోతుంటే ఆమెని చేయి పట్టుకొని ఆపుతాడు అభి. నా గురించి మాళవికకి ఏదో చెప్తాను అన్నావు కదా ఎందుకు చెప్పలేదు అలా చెప్పడం నీ వల్ల కాదు మర్యాదగా సరెండర్ అయిపో వసంతతో పెళ్లి అది ఇది అని పిచ్చి వేషాలు వేయకు అంటూ బెదిరిస్తాడు. భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిత్ర.
మరోవైపు పెళ్లి మండపానికి వస్తారు యష్ వాళ్ళు. యష్ మొహం చికాకు గా ఉండడం చూసి కంఫర్ట్ గానే ఉన్నారా అని అడుగుతుంది వేద. వదిలేసిన పెళ్ళాం పెళ్ళికి వచ్చాను ప్రపంచంలో ఇలాంటి జాతకం ఎవరికి ఉండదు అంటాడు యష్. మీరు మాళవిక గురించి ఎందుకు ఆలోచిస్తారు చిత్ర గురించి ఆలోచించండి అంటుంది వేద. అలాంటప్పుడు కంఫర్ట్ గా ఉన్నారా అది ఇది అని అడగకు అంటూ అలుగుతాడు యష్.
అలిగితే ఎంత అందంగా ఉన్నారో అంటూ భర్తని మురిపెంగా చూసుకుంటుంది వేద. మరోవైపు వసంత్, చిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడికి మాళవిక వాళ్ళు వస్తారు. రండి.. ఇప్పుడే వచ్చారా అని అడుగుతాడు వసంత్. వచ్చి చాలాసేపు అయింది మీ జంటని చూస్తూ తన్మయత్వంతో ఉండిపోయాము అంటాడు అభి. ఆ మాటలకి చిరాకు పడుతుంది చిత్ర. పెళ్లి బట్టలు చాలా అందంగా ఉంది చిత్ర జాగ్రత్త ఎవరైనా ఎత్తుకుపోగలడు అంటాడు అభి.
ఆ మాటలకి కోపంగా చూస్తుంది చిత్ర. పెళ్లయితే బాధ్యతలు ఎక్కువవుతాయి ఏమైనా హెల్ప్ అవసరమైతే నన్ను అడుగు అని వసంత్ కి చెప్తాడు అభి. అవసరం లేదు యష్ వాళ్ళు ఉన్నారు మమ్మల్ని చూసుకోవటానికి అంటాడు వసంత్. తరువాయి భాగంలో వేద కోరిక మీద ఆమెకి గోరింటాకు పెడతాడు యష్.