Ennenno Janmala Bandham: వేద మీద తప్పేసిన విన్ని.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న యష్!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తనని అపార్థం చేసుకుని దూరం పెడుతున్న భర్తని అర్థం చేసుకొని మామూలు మనిషిని చేసిన ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో వేద దగ్గరికి వచ్చిన విన్ని నిన్న నీ భర్తని కలిసాను మాట్లాడిన ఐదు నిమిషాల్లోనే నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను పెద్ద గీత నువ్వు చిన్న గీత అతని ప్రేమ ముందు నీ ప్రేమ చాలా చిన్నది అనిపిస్తుంది అంటాడు విన్ని. నిజమా అంటుంది వేద. అవును చిన్నపిల్లాడి చేతిలో తనది అనుకున్న బొమ్మని లాక్కున్నప్పుడు ఆ పిల్లాడు చేసే గోల లాంటిది నీ భర్త ప్రేమ. అది నువ్వు అర్థం చేసుకునేదేమో అనిపిస్తుంది. ప్రతి భర్తకి భార్య విషయంలో కొన్ని స్వార్ధాలు ఉంటాయి అవి భార్య అర్థం చేసుకోకపోతే నష్టపోయేది.
భార్య కష్టపడేది భర్త ప్రతిసారి భర్తే చొరవు తీసుకో అక్కర్లేదు భార్య కూడా చొరవ తీసుకొని చెప్పాలనుకున్నది చెప్పేయాలి చేయాలనుకున్నది చేసేయాలి. మీ ఇద్దరికి చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ అంతా లోపలే బట్టలు మనసుకి వేసుకోకూడదని చెప్తాడు. ఎంత బాగా చెప్పావు విన్ని మనసుని టచ్ చేసావు అంటుంది వేద. మరోవైపు వేద ని బాధ పెట్టినందుకు గిల్టీగా ఫీల్ అవుతాడు యష్. తనని బాధ పెట్టినందుకు నేను శిక్ష అనుభవించాలి అనుకుంటాడు. లేదా నిప్పు తనకి దూరంగా ఉండటమే నీకు నువ్వు వేసుకుని శిక్ష అని తన మనసు చెప్పటంతో లేదా ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను ఖుషి కోసం నాకోసం చాలా త్యాగం చేసింది.
నేను దూరమయ్యాక అయినా తను సంతోషంగా ఉండాలి అందుకోసం నేను దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటాడు యష్. అదే సమయంలో బట్టలు సర్దుతూ పరాయి వ్యక్తిగా వచ్చి పూర్తిగా నా జీవితంలో మారిపోయారు. నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను అని మీతో చెప్పాలనుకుంటున్నాను అంటూ యష్ సూట్ ని హాగ్ చేసుకుంటూ మాట్లాడుతుంది. ఐ లవ్ యు సో మచ్ అంటూ గట్టిగా చెప్తుంది. నా ఫీలింగ్స్ కి క్లారిటీ వచ్చింది ఇదే విషయాన్ని మా శ్రీవారితో షేర్ చేసుకుంటాను అంటూ అతనికి ఫోన్ చేస్తుంది వేద. ఈరోజు మనకి జీవితాంతం గుర్తుండిపోయే రోజు ఇంటికి త్వరగా రండి అని చెప్తుంది.
అలాగే అని చెప్తాడు కానీ పశ్చాతాపంతో కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. నా గుండెలో నిండా ప్రేమ ఉంది కానీ అది మీ జీవితానికి అడ్డు కాకూడదు అనుకుంటాడు. నా గురించి నేను తీసుకున్న నిర్ణయం కాదు నీ గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఆ విషయం తర్వాత నీకే అర్థమవుతుంది అనుకుంటాడు యష్. మరోవైపు తను అందంగా రెడీ అయ్యి రూమ్ ని అందంగా డెకరేట్ చేస్తుంది వేద. ఈ రూమ్ ఇలా చూసి ఆయన ఎంత ఆనందపడతారో, త్వరగా ఇంటికి వచ్చేయండి అనుకుంటుంది.
అంతలోనే ఖుషి వచ్చి నువ్వు చాలా అందంగా రెడీ అయ్యావు రూముని కూడా బాగా డెకరేట్ చేసావు ఎందుకు అని అడుగుతుంది. డాడీ హెల్త్ రికవరీ అయింది కదా మనమందరం హ్యాపీగా ఉన్నాం కదా అందుకే ఆయన కోసమే ఇదంతా అంటుంది వేద. అవును మమ్మీ సూపర్ ఐడియా ఇదంతా చూసి డాడీ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటుంది ఖుషీ. తాతయ్య నాకు మంచి మంచి కథలు చెప్తానన్నారు నేను తాతయ్య దగ్గర పడుకుంటాను. అది చెబుదామనే వచ్చాను అంటూ వేదకి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది ఖుషి. మరోవైపు వేద, యష్ ల ఫోటో చూస్తూ మనం ఇద్దరమి ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఇది ఫిక్స్ కదండి అనుకుంటుంది వేద.
దేవుడు కూడా ఈ ఫోటోలో లాగానే మనిద్దరినీ ఎప్పటికీ విడదీయలేడు అనుకుంటుంది. ఇంటికి లేటుగా వచ్చిన యష్ కారు దిగకుండానే వేద ఇంకా పడుకున్నట్లుగా లేదు పాపం నాకోసమే ఇంకా వెయిట్ చేస్తున్నట్లుగా ఉంది. నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నట్లుగా ఉన్నాను కానీ నాకు వేరే ఆప్షన్ లేదు సారీ వేద అనుకుంటాడు. పెళ్లిలో బ్రహ్మముడి వేస్తారు పెళ్లి అయిన వెంటనే ఎందుకు విప్పేస్తారు దానిని అలాగే వుంచేయొచ్చు కదా అనుకుంటుంది వేద. తరువాయి భాగంలో రూమ్ లోకి వచ్చిన యష్ అందంగా ముస్తాబై ఉన్న వేదని, డెకరేట్ చేసి ఉన్న రూమ్ ని చూస్తాడు.