- Home
- Entertainment
- Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలేలో ఉత్కంఠని రేపే సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతని నాగార్జున మాస్ మహారాజ్ రవితేజకి ఇచ్చారు. రవితేజ సిల్వర్ సూట్కేస్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలేలో ఉత్కంఠని రేపే సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాక టాప్ 3గా డిమాన్ పవన్, తనూజ, కళ్యాణ్ మిగిలారు. వారిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతని నాగార్జున మాస్ మహారాజ్ రవితేజకి ఇచ్చారు. రవితేజ సిల్వర్ సూట్కేస్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
మాస్ మహారాజ్ రవితేజ ఎంట్రీ
రవితేజ హౌస్ లోకి వెళ్లగానే టాప్ 3 సభ్యులకు ఆఫర్ ఇచ్చారు. ఈ సూట్కేస్ లో బిగ్ బాస్ ఇచ్చిన 5 లక్షల మనీ ఉంది. ఇది తీసుకుని ఒకరు డ్రాప్ అయిపోవచ్చు అని ఆఫర్ ఇచ్చారు. దానికి ముగ్గురూ నో చెప్పారు. ఆ తర్వాత రవితేజ బేరం మొదలు పెట్టారు. అమౌంట్ ని ఏడున్నర లక్షలకు పెంచారు. ఆ డబ్బుకి డిమాన్ పవన్ టెంప్ట్ అవుతూ కనిపించాడు. కానీ కేవలం ఏడున్నర లక్షలకే డ్రాప్ కావడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత 10 లక్షలకు పెంచినా ఒప్పుకోలేదు.
డిమాన్ పవన్ తెలివైన నిర్ణయం
డిమాన్ పవన్ తన కుటుంబ సభ్యుల అభిప్రాయం తెలుసుకున్నాడు. వాళ్ళు నీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పారు. చివరికి ఫైనల్ ఆఫర్ 15 లక్షలు అని రవితేజ చెప్పారు. దీనితో డిమాన్ పవన్ కాసేపు అలోచించి.. విన్నర్ అయ్యే అవకాశం నాకు లేదు అని తెలుసు. ఎక్కడో వెనుకబడ్డాను. ఇక్కడి వరకు నన్ను తీసుకువచ్చిన ఆడియన్స్ కి థ్యాంక్స్. కానీ డబ్బు అవసరం చాలా ఉంది. అందుకే ఈ 15 లక్షల ఆఫర్ తీసుకుంటున్నా అని అంగీకారం తెలిపాడు. పవన్ ఎంత అదృష్టవంతుడో ఆ తర్వాతే తెలిసింది. ఒక వేళ పవన్ ఈ ఆఫర్ తీసుకోకపోయినా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అయ్యేది అతడే అని నాగార్జున తెలిపారు. అలా జరిగి ఉంటే పవన్ ఖాళీ చేతులతో వెళ్లాల్సి వచ్చేది. కానీ 15 లక్షల ఆఫర్ అందుకోవడం తెలివైన నిర్ణయం అని చెప్పొచ్చు.

