- Home
- Entertainment
- Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్ కొట్టిన కళ్యాణ్, ఎమోషనల్ కామెంట్.. తనూజకే క్రెడిట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్ కొట్టిన కళ్యాణ్, ఎమోషనల్ కామెంట్.. తనూజకే క్రెడిట్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ టైటిల్ విన్నర్‌గా కళ్యాణ్ నిలిచారు. ఆయన ట్రోఫీ అందుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అయితే తనూజకి క్రెడిట్ ఇవ్వడం విశేషం.

బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోయింది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగానే, ఓటింగ్‌లో దూసుకుపోతున్నట్టుగానే జరిగింది. కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల ఈ సీజన్ విన్నర్‌గా నిలిచారు. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో చివరికి తనూజ, కళ్యాణ్ మిగిలారు. వీరిద్దరికి నాగార్జున రూ.20లక్షల ఆఫర్ ఇచ్చారు. దీన్ని ఇద్దరూ తిరస్కరించారు. ఇక ఇద్దరినీ స్టేజ్‌పైకి తీసుకెళ్లిన నాగార్జున విన్నర్‌ని ప్రకటించారు. కళ్యాణ్ ని విన్నర్‌గా తేల్చారు.
రన్నరప్‌గా తనూజ
దీంతో తనూజ రన్నరప్‌గా మిగిలింది. ఈ సందర్భంగా తనూజ మాట్లాడుతూ, ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పింది. తనకు ఇంత వరకు సపోర్ట్ చేసిన వారికి ఆమె థ్యాంక్స్ చెప్పింది. అదే సమయంలో తెలుగు ఆడియెన్స్ వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానని, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. అయితే విన్నర్ కళ్యాణ్ అని నాగార్జున చెప్పగానే తనూజ మొఖం వాడిపోయింది. ఒక్కసారిగా నిరాశలో మునిగిపోవడం గమనార్హం.
కళ్యాణ్ పడాల ఎమోషనల్ కామెంట్స్
ఇక బిగ్ బాస్ తెలుగు 9 ట్రోఫీ గెలిచిన సందర్భంగా కళ్యాణ్ పడాల స్పందించారు. ఎమోషనల్ అయ్యారు. వెంటనే నేలను తాకి ముద్దు పెట్టారు. అందరికి నమస్కారాలు తెలియజేశాడు. హోస్ట్ నాగార్జున కాళ్లు పట్టుకున్నాడు. అనంతరం కళ్యాణ్ మాట్లాడుతూ, అగ్నిపరీక్ష షార్ట్ లిస్ట్ చేసినప్పుడే ఒక మాట చెప్పాను. నాగార్జున నటించిన `సోగ్గాడే చిన్న నాయన` సినిమా సమయంలో వస్తున్నాం, కొడుతున్నాం అని చెప్పారు. అప్పుడు హిట్ కొట్టారు. నేను కూడా అగ్నిపరీక్ష షార్ట్ లిస్ట్ చేసినప్పుడు అదే డైలాగ్‌ని కొట్టాను. `వస్తున్నా, కొడుతున్నా` అని, ఇప్పుడు కప్ కొట్టి చూపించాను. అమ్మా నాన్న నాకు ఉన్నంతలో బెటర్ లైఫ్ ఇచ్చారు. వారి వల్లే తాను ఈ స్థానంలో ఉన్నాను, ఇంకా బెటర్‌గా ఉండాల్సింది, కానీ ఇక్కడి వరకు అయినా వచ్చాను. వాళ్ల పెంపకం వల్లే ఈ స్థాయిలో ఉండగలిగాను. వాళ్లు లేనిదే నేను లేను` అని ఎమోషనల్ అయ్యారు కళ్యాణ్.
తనూజకి క్రెడిట్
ఈ సందర్భంగా ఆయన ఇంకా మాట్లాడుతూ, నన్ను ఇంతగా ప్రేమించి ఇంత దూరం తీసుకొచ్చిన వారికి, నేను ట్రోఫీ గెలిచేందుకు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే అగ్నిపరీక్ష నుంచి నాకు ఇష్టమైన వాళ్లు, సపోర్ట్ చేసిన ప్రియా, శ్రీజ, వన్ అండ్ ఓన్లీ తనూజకి థ్యాంక్స్. నువ్వు చేయగలవు అంటూ ధైర్యాన్నిచ్చింది తనూజ, ఈ విషయాన్ని నేను ధైర్యంగా చెప్పగలను` అని తెలిపారు కళ్యాణ్. మొత్తంగా తనలో మార్పుకి, తాను ఇంత దూరం రావడానికి కారణం అని, ఈ సక్సెస్ క్రెడిట్‌ని తనూజకి ఇవ్వడం విశేషం.
కళ్యాణ్ పేరెంట్స్ ఆనందం
ఈ సందర్భంగా కళ్యాణ్ తల్లిదండ్రులు కూడా స్టేజ్‌పైకి వచ్చారు. తమ ఆనందం పంచుకున్నారు. కళ్యాణ్‌కి సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్పారు. తెలిసిన వాళ్లు కొందరు, తెలియని వాళ్లు ఎందరో సపోర్ట్ చేశారని, వారికి పేరు పేరున ధన్యవాదాలు, కళ్యాణ్ విన్నర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయితే విన్నర్ అయిన కళ్యాణ్‌కి ప్రైజ్ మనీ, కారు గిఫ్ట్ తోపాటు మరో బంపర్ ఆఫర్ తగిలింది. రోఫ్ కంపెనీ వాళ్లు ఐదు లక్షలు ప్రైజ్ మనీ ఇవ్వడం విశేషం.

