- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: వామ్మో.. డార్లింగ్ అంటూ భార్యకు ముద్దు పెట్టిన యష్.. చెంప పగలకొట్టిన వేద!
Ennenno Janmala Bandham: వామ్మో.. డార్లింగ్ అంటూ భార్యకు ముద్దు పెట్టిన యష్.. చెంప పగలకొట్టిన వేద!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 21వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఆఫీస్ లో ఉన్న యష్ (Yash) వాళ్ళ మామయ్య కు ఫోన్ చేసి అత్తయ్యగారు గ్రీటింగ్స్ చెప్పేదాకా మనం చెప్పకూడదు అని అంటాడు. అంతేకాకుండా ఈ ఆడవాళ్ళతో కత్తిరించాలి అంటాడు. ఇక పక్కనే వేద (Vedha) ఇవన్నీ వింటుంది. వెంటనే ఫోన్ తీసుకొని హలో అనగా యష్ నోట మాట పడిపోతుంది.
ఆ క్రమంలో వీరిద్దరు దంపతులు ఫోన్లో ఫన్నీగా క్లాష్ పెట్టుకుంటారు. ఇక వేద (Vedha) ఈ వయసులో మా నాన్నకి వంకరబుద్ధి నేర్పించి చెడగొట్టకండి అని అంటుంది. ఇక యష్ (Yash) ఆ క్రమంలో ఆఫీస్ మీటింగ్ లో ఉండగా వాళ్ళు వేరే లా అనుకోకుండా ఓకే డార్లింగ్ అని వేదను అన్ఈజీ గా అంటాడు. దాంతో వేద మీరు ముందు ఈ డార్లింగ్ ఆపండి అని అంటుంది.
అంతేకాకుండా యష్ (Yash) ఫోన్ లో ముద్దు కూడా పెడతాడు. దాంతో వేద ఛీ.. అంటూ ఫోన్ విసిరేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఇరు ఫ్యామిలీల కలిసి ఆనందంగా పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఈ లోపు ఇంటికి యష్ వచ్చి స్నానం చేసి రెడీ అవుతుండగా.. వేద (Vedha) వెయిట్ చేస్తుంది. అంతేకాకుండా శ్రీవారు ఆర్డర్ చేసిన తర్వాత వెయిట్ చేయకుండా ఉంటే ఎలా అని అంటుంది.
ఇక ఆ తరువాత ఇరు ఫ్యామిలీలు కలిసి ఆనందంగా సెల్ఫీలు దిగుతారు. అంతేకాకుండా పెళ్లిరోజు జంటతో ఒక కేకు ను కూడా కట్ చేపిస్తారు. ఇక యష్ (Yash) వాళ్ళ మామ గారికి థమ్స్ అప్ లో మందు కలిపి గిఫ్ట్ గా కోరిక తీర్చాలని అనుకుంటాడు. ఇక అంతే కాకుండా మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చాను అని వాళ్ళ మామయ్యతో అంటాడు.
దాంతో వరదరాజు (Varadaraju) ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాడు. అల్లుడు గారు ఇచ్చిన గిఫ్ట్ ను వరదరాజు తాగుతూ ఉండగా ఇంతలో వాళ్ళ భార్య వచ్చి తీసుకు వెళ్లి పోతుంది. ఈలోపు అక్కడకు వేద (Vedha) వచ్చి అది థమ్స్ అప్ బాటిల్ అనుకోని ఆ మద్యం సేవిస్తుంది. ఇక మెల్లగా వేద మత్తులోకి వెళుతుంది.
ఇక తరువాయి భాగంలో యష్ (Yash) వేద ను వాష్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి ముఖం మీద నీళ్లు కొట్టి మద్యం మత్తును వదిలిస్తాడు. ఇక ఆ తర్వాత నిజం తెలుసుకున్న వేద (Vedha) యష్ ను గట్టిగా చెంప మీద కొట్టి నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.