యష్‌తో కియారా అద్వానీ డాన్స్ నెంబర్, `టాక్సిక్` కోసం గోవాలో రచ్చ
ఇటీవల రామ్ చరణ్ తో `గేమ్ ఛేంజర్`లో ఆడిపాడిన కియారా అద్వానీ ఇప్పుడు కన్నడ స్టార్ యష్ తో రొమాన్స్ చేస్తుంది. ఆయనతో డాన్స్ నెంబర్‌లో ఆడిపాడుతుంది.

ప్రస్తుతం యష్ హీరోగా రూపొందుతున్న ‘టాక్సిక్’ సినిమాలోని ఒక ప్రత్యేక పాట చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య డాన్స్ కంపోజ్ చేస్తున్నారు.
గోవాలోని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను పాట చిత్రీకరణ కోసం ఎంచుకున్నారు. గత కొన్ని రోజులుగా యష్, కియారా లపై ఈ రొమాంటిక్ డాన్స్ షూట్ జరుగుతుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ధృవీకరించారు. నయనతార యష్ సోదరి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అక్షయ్ ఒబెరాయ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ పాటకే పరిమితం కాదు, హీరోయిన్‌గా కూడా చేస్తుందట. మరో బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీ కూడా నటిస్తుందని తెలుస్తుంది.
గోవా మాదక ద్రవ్యాల బ్యాక్ డ్రాప్‌లో ‘టాక్సిక్’ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
కీలక సన్నివేశం లీక్: యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశం సోషల్ మీడియాలో లీక్ అయింది. అద్భుతమైన సెట్, భారీ పార్టీ సెటప్, 90ల నేపథ్యంలో యష్ ఒక ముఖ్య వ్యక్తిని కలిసే సన్నివేశం ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఈ సన్నివేశాన్ని సెట్‌లో ఉన్నవారే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సాధారణంగా ఇలాంటి పెద్ద బ్యానర్ సినిమాలలో సినిమా సన్నివేశాలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశం లీక్ కావడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.
read more: `గేమ్ ఛేంజర్` ఫలితంపై అంజలి ఫస్ట్ రియాక్షన్, ఫ్లాప్‌కి కారణాలు చెప్పాలంటే వేదిక సరిపోదు
also read: అనిల్ రావిపూడికి విజయ్ షాక్, `భగవంత్ కేసరి` రీమేక్ వెనుక జరిగింది ఇదేనా?