- Home
- Entertainment
- `గేమ్ ఛేంజర్` ఫలితంపై అంజలి ఫస్ట్ రియాక్షన్, ఫ్లాప్‌కి కారణాలు చెప్పాలంటే వేదిక సరిపోదు
`గేమ్ ఛేంజర్` ఫలితంపై అంజలి ఫస్ట్ రియాక్షన్, ఫ్లాప్‌కి కారణాలు చెప్పాలంటే వేదిక సరిపోదు
`గేమ్ ఛేంజర్`లో పెద్ద రామ్ చరణ్‌కి జోడీగా నటించింది అంజలి. ఈ మూవీ ఫలితంపై జాగా ఆమె స్పందించింది. పరాజయానికి కారణాలు చెప్పడానికి వేదిక సరిపోదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

రామ్ చరణ్ హీరోగా నటించిన `గేమ్ ఛేంజర్` మూవీలో అంజలి హీరోయిన్‌గా మెరిసింది. ఆమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అప్పన్న పాత్రకు జంటగా నటించింది. డీ గ్లామర్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. సినిమా కథని కీలక మలుపు తిప్పడంలో ఆమె పాత్ర ప్రధానంగా ఉంటుంది.
శంకర్ దర్శకత్వం వహించిన `గేమ్ ఛేంజర్` చిత్రంలో యంగ్ చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ నటించింది. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ఫలితంపై హీరోయిన్ అంజలి స్పందించింది. సినిమా ఆడకపోవడానికి కారణమేంటనేది చెబుతూ, ఒక యాక్టర్‌గా నా క్యారెక్టర్‌కి సంబంధించిన బాధ్యతనే తీసుకోగలను. నన్ను నమ్మి పాత్రని డిజైన్ చేసినప్పుడు మనం దాన్ని ఎలా బెస్ట్ గా డెలివర్ చేశామనేదాన్ని బట్టి మనకు ఇచ్చిన వర్క్ అక్కడితో ఆగిపోతుంది.
సినిమాని ఆడించాలనేది మా తపన. అందుకోసం ప్రమోషన్ చేస్తాం, ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లేందుకు మా వంతు సపోర్ట్ చేస్తాం. ప్రమోషన్స్ చేస్తాం. అది దాటి ఇప్పుడు `గేమ్ ఛేంజర్` రిజల్ట్ గురించి మాట్లాడాలంటే ఈ వేదిక సరిపోదు. ఎందుకనేది అందరికి తెలుసు. `గేమ్ ఛేంజర్` విషయంలో నా వరకు నేను 200 శాతం నమ్మి బాగా చేశాను. చూసిన చాలా మంది సినిమా బాగుందన్నారు.
Anjali
సినిమా ఆడటం వేరు, మంచి సినిమా కావడం వేరు. ఈ క్రమంలో `గేమ్ ఛేంజర్` మంచి సినిమా అని చాలా మంది చెప్పారు. ఆ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు. నటిగా ఆ కాంప్లిమెంట్ చాలు నాకు` అని తెలిపారు అంజలి. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో అప్పన్న భార్య పార్వతి పాత్రలో నటించింది అంజలి. ఆమె మంచి నటనతో మెప్పించారు.
ఇక అంజలి తమిళంలో `మద గజ రాజ` చిత్రంలో నటించింది. విశాల్‌కి జోడీగా చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ మరో హీరోయిన్‌గా చేసింది.ఈ మూవీ సంక్రాంతికి విడుదలై తమిళంలో పెద్ద హి్ అయ్యింద. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ నెల 31న దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా సోమవారం మీడియాతో ముచ్చటించింది అంజలి. ఈ క్రమంలోనే `గేమ్ ఛేంజర్` రిజల్ట్ పై ఆమె స్పందించి పై విధంగా వ్యాఖ్యానించింది.
read more: అనిల్ రావిపూడికి విజయ్ షాక్, `భగవంత్ కేసరి` రీమేక్ వెనుక జరిగింది ఇదేనా?