MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ` కేజీఎఫ్ 3` గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రాకీ భాయ్‌ రీఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందంటే?

` కేజీఎఫ్ 3` గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రాకీ భాయ్‌ రీఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందంటే?

KGF 3 Update: `కేజీఎఫ్ 2` విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ `కేజీఎఫ్ 3` గురించి హింట్ ఇచ్చింది. ఈ వీడియో సినిమా ప్రియుల్లో క్యూరియాసిటీ పెంచింది, రాకీ భాయ్ మళ్లీ వస్తాడా అనే ప్రశ్న మొదలైంది. ఈ మూవీ ఎప్పుడు రాబోతుందనే ఆసక్తి ఏర్పడింది. అయితే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఎన్టీఆర్‌తో `డ్రాగన్‌` మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత పలు కమిట్‌మెంట్స్ ఉన్నాయి. మరి ప్రశాంత్‌ నీల్‌ ఏ మూవీ ఫస్ట్ చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 15 2025, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
KGF 3 Update

KGF 3 Update

KGF 3 Update:`కేజీఎఫ్` సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు `టాక్సిక్` సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.  ఇంతలో మరో అప్‌డేట్ వచ్చింది. 'కేజీఎఫ్ 2' మూడు ఏళ్లు పూర్తి చేసుకుంది. `కేజీఎఫ్‌ 3`కి సంబంధించిన అప్‌ డేట్‌ ఇచ్చింది టీమ్‌. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
kgf 3

kgf 3

బ్లాక్‌బస్టర్ చిత్రం 'కేజీఎఫ్ అధ్యాయం 2' ఏప్రిల్ 14, 2022న విడుదలైంది. ఇప్పుడు మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్షణాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రెడీ అయింది. గతాన్ని గుర్తు చేస్తూ కొత్త అప్‌ డేట్‌ ఇచ్చింది. `కేజీఎఫ్‌` లవర్స్ కి గూస్‌ బంమ్స్ తెప్పించే వీడియో విడుదల చేసింది. 

37
kgf 3

kgf 3

ఈ వీడియోలో కేజీఎఫ్ చివరి అధ్యాయం గురించి హింట్‌ ఇచ్చారు.. 'అతను వచ్చాడు... అతను చూశాడు... అతను జయించాడు!' అని రాశారు. 2.15 నిమిషాల ఈ వీడియోలో హీరో మాసివ్ ఎంట్రీ ఉంది. ఇందులో `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 3` అని ఉండటంతో ఇక మూడో పార్ట్ కి రంగం సిద్ధమైందని అనిపిస్తుంది. త్వరలోనే రాబోతుందనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తుంది. 

47
kgf 2

kgf 2

ప్రస్తుతం `కేజీఎప్‌ 3`కి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. యష్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. రాకీ భాయ్‌ రాకకోసం వెయిట్‌ చేస్తున్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ సారి విధ్వంసం వేరే లెవల్లో ఉండబోతుందని అంటున్నారు. అయితే `కేజీఎఫ్‌ 2`లోనే హీరో చనిపోయాడు. మరి మూడో పార్ట్ లో ఏం చూపించబోతున్నారనేది పెద్ద మిస్టరీగా మారింది. ప్రీక్వెల్‌ అంశాలను చూపించే అవకాశం ఉందని తెలుస్తుంది. 

57
kgf 3

kgf 3

`కేజీఎఫ్ అధ్యాయం 3` గురించి చాలా రోజులుగా ప్రశ్నలు ఉన్నాయి. `కేజీఎఫ్-3` వస్తుందా? అని చాలాసార్లు చిత్ర బృందాన్ని అడిగారు. సినిమా మూడో భాగం కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సంవత్సరం చివరి నాటికి మూడవ అధ్యాయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. ఇప్పటివరకు కేజీఎఫ్, కేజీఎఫ్ 2 అభిమానుల నుండి ఎక్కువ ఆదరణ పొందింది.

67
kgf 2

kgf 2

ఇదిలా ఉంటే హోంబలే ఫిల్మ్స్ ఊరిస్తుంది కానీ, ఇప్పట్లో ఈ మూవీ ఉంటుందా? అనేది పెద్ద సందేహంగా మారింది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌.. ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత `సలార్‌ 2` చేయాల్సి ఉంది.

వీటితోపాటు అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌లతోనూ సినిమాలున్నాయనే రూమర్స్ ఉన్నాయి.ఈ క్రమంలో `కేజీఎఫ్‌ 3` ఎప్పుడు ఉంటుందనేది పెద్ద ప్రశ్న. ఎన్టీఆర్‌ `డ్రాగన్‌` తర్వాత `కేజీఎఫ్‌ 3` చేస్తారా? `సలార్‌ 2` చేస్తారా? అనేది సస్పెన్స్. ప్రశాంత్‌ నీల్‌పైనే ఇదంతా ఆధారపడి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. 

77
kgf 2

kgf 2

కేజీఎఫ్ 2018 చివరిలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు రూ150 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత 'కేజీఎఫ్-2' 4 సంవత్సరాల తర్వాత విడుదలై `కేజీఎఫ్‌ 2` బాక్సాఫీసుని షేక్‌ చేసింది. ఇది రూ.1200కోట్లు వసూలు చేసింది. కన్నడ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఇప్పుడు `కేజీఎఫ్‌ 3` ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి. 

read  more: కాంట్రవర్సియల్‌ స్టేట్స్ మెంట్స్ తో వివాదాల్లో నిలిచిన బాలీవుడ్‌ స్టార్స్ వీరే.. సల్మాన్‌, అమీర్‌, దీపికా

also read: రహస్యంగా పవన్‌ కళ్యాణ్‌ని కలిసిన అల్లు అర్జున్‌.. మార్క్ శంకర్‌ మామా అల్లుళ్లని కలిపారా? నిజం ఏంటంటే?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Recommended image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Recommended image3
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved