“కేజీఎఫ్ 2” కొత్త విషయాల కోసం: యష్ ఇంటర్వూ ఇదిగో

First Published Jan 9, 2021, 12:22 PM IST

రాఖీ భాయ్ 35వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.  “కేజీఎఫ్” సక్సెస్ తో కన్నడ స్టార్ యష్ ఇప్పుడు దేశమంతా పాపులర్ అవటంతో మీడియా కవరేజ్ కూడా ఓ రేంజిలో ఉంది. . అంతేకాదు ఈ పుట్టిన రోజుకు ఎంతగానో ఎదురుచూస్తున్న “కేజీఎఫ్ 2” టీజర్ వచ్చింది. అయితే, కోవిడ్ 19 కారణంగా 35వ బర్త్ డేని సింపుల్ గా జరుపుకున్నాడు. భార్య రాధికా పండిట్ తో కలిసి కేక్ కట్ చేశాడు. కాకపోతే మీడియాకు ఇంటర్వూలు తప్పవు కదా. ముఖ్యంగా యష్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాలని అతని టీం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అతని ఇమేజ్ పెరిగేలా సోషల్ మీడియాలో ట్రేండింగ్ కి ప్లస్ అయ్యే ఫోటోలు, వార్తలు ఉండేలా చూస్తున్నారు. ఈ నేపధ్యంలో యష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ లో ఏమి మాట్లాడాడో చూద్దాం.
 
‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’ సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది.. ఇప్పుడు ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ కూడా అలాంటి రికార్డులను క్రియేట్‌ చేస్తుందని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ...‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’ సినిమా స్టార్ట్‌ చేసే ముందు మాకు చాలా లిమిట్స్ ఉండేవి. అయితే ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఎంతో కష్టపడి సినిమాను రూపొందించాం. ఆ తపనే ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించే దిశగా మమ్మల్ని నడిపించింది అన్నారు యష్.

అలాగే  ఓ టీమ్‌లా మేం పడ్డ కష్టానికి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు, సినీ ఇండస్ట్రీల నుండి చాలా గొప్ప స్పందన వచ్చింది. ఇప్పుడు మా సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. దాంతో టీమ్‌ అందరం ఇంకా కష్టపడ్డాం అని చెప్పుకొచ్చారు.

ఇంకా బిగ్‌ స్కేల్‌లో ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌2’ సినిమాను రూపొందించాం. ఇంత కష్టపడటానికి కారణం.. ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్‌ చేసేలా ఓ సినిమాను రూపొందించడమే. ఈ ప్రాసెస్‌లో ఏవైనా రికార్డులు బ్రేక్‌ కావడం వంటివి జరిగితే మాకు అది బోనస్‌ అనే చెప్పాలి.

‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’ తో పోల్చితే ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’కి ఉన్న తేడా ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం ఇశ్తూ... ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’లో రాకీ భాయ్‌ పాత్రను పరిచయం చేశాం. అతను ఎక్కడి నుంచి వచ్చాడు. తన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. తన ముందున్న రాక్షసులను దాటి లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే అంశాలను చూపించాం.

అదే  ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’లో ఇప్పటి వరకు రాకీ భాయ్‌లో చూడని మరికొన్ని కోణాలను ఆవిష్కరించబోతున్నాం. ఈ రెండో భాగం తొలి భాగం కంటే ఎమోషనల్‌గా, యాక్షన్‌ సమ్మిళతంగా ఉంటుంది అన్నారు.

ఈ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’లో ఏమైనా సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశారా? అనే దానికి సమాధానం ఇస్తూ...ఉన్నాయండి.. అయితే ఇప్పుడే చెప్పలేను. చెప్పేస్తే అందులో సర్‌ప్రైజ్‌ ఏముంటుంది అన్నారు.

సంజయ్‌ దత్‌, రవీనాటాండన్‌లతో కలిసి పనిచేసిన వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ గురించి..? వివరిస్తూ.. సంజయ్‌ దత్‌, రవీనాటాండన్‌ గారితో కలిసి పనిచేయడం గొప్ప ఫీలింగ్‌. సంజయ్‌దత్‌గారు ఆరోగ్యం బాగా లేకపోయినా వర్క్‌పై ఆయనకున్న ప్యాషన్‌, వృతిపట్ల ఆయనకున్న అంకితభావం అన్నీ చూస్తే ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది అన్నారు.

ఇక రవీనాటాండన్‌ గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఆమె విలక్షణ నటి. ఆమె టీమ్‌ జాయిన్‌ కాగానే ఆమె శక్తిని యూనిట్‌కు అందించింది. వీరిద్దరితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది.

‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ పాత్ర కోసం ఎలా ప్రిపేర్‌ అయ్యారు?అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. దాదాపు ఈ పాత్రలో నాలుగేళ్లుగా ఉన్నాననే చెప్పాలి(నవ్వుతూ). పాత్ర కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. సహజ సిద్ధంగానే చేశాను అన్నారు.

‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ లో ఏ సీక్వెన్స్‌ మీకు ఛాలెంజింగ్‌గా అనిపించింది? చెప్తూ...సినిమాలో చాలా ఎగ్జయిటింగ్‌, ఛాలెంజింగ్‌ సన్నివేశాలున్నాయి. ఏదో ఒకదాని గురించి నేను చెప్పలేను. సినిమా రిలీజైతే మీకు సమాధానం కనిపిస్తుంది అని చెప్పారు యష్.

సినిమా షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుంది? అనే ప్రశ్నకు యష్ సమాధానం ఇస్తూ.. ఒక రోజు ప్యాచ్‌ వర్క్‌ మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది అని చెప్పుకొచ్చారు.

గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాఖీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? తన తమ్ముడి మరణవార్త తెలిసిన అధీర ఏం చేశాడు? గరుడ చనిపోయాడన్న వార్త తెలిసి ఇనాయత్‌ ఖలి దేశంపై దండెత్తడానికి ఎలాంటి ప్రణాళికలు వేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాఖీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ‘కేజీఎఫ్‌2’లో సమాధానం లభించనుంది.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడు అధీర పాత్రలో కనిపించనున్నారు. ప్రధానిగా రవీనా టాండన్‌ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్‌ నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది.

కన్నడ సినిమాగా మొదలై పాన్‌ ఇండియా సినిమాగా భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కేజీఎఫ్-చాప్టర్‌1’‌. ఈ ఒక్క చిత్రంతోనే కథానాయకుడు యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌లకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఆ చిత్రానికి రెండో భాగం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ విషయంలో రాజీ పడకుండా సన్నివేశాలను తెరకెక్కించడం, ప్రోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల వల్ల ఆలస్యమవుతోంది.

శుక్రవారం యశ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ సామాజిక మాధ్యమాల్లో రికార్డులు బద్దలు కొడుతోంది. గురువారం రాత్రి టీజర్‌ను విడుదల చేయగా, 24గంటల కన్నా ముందే 55 మిలియన్‌ వ్యూస్‌ను దాటి దూసుకుపోయింది. 3మిలియన్లకు పైగా లైక్స్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్స్‌లో టాప్‌లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ యశ్‌ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ‘పవర్‌ఫుల్‌ పీపుల్‌ మేక్‌ ప్లేసెస్‌ పవర్‌ఫుల్‌: కథ ఇప్పుడే ప్రారంభమవుతోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?