- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: ఊహించని పరిణామానికి కోపంతో రగిలిపోతున్న అభి.. అందరి ముందు భార్య పరువు తీసిన యష్!
Ennenno Janmala Bandham: ఊహించని పరిణామానికి కోపంతో రగిలిపోతున్న అభి.. అందరి ముందు భార్య పరువు తీసిన యష్!
Ennenno Janmala Bandham : స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. తనని అపార్థం చేసుకుని దూరం పెడుతున్న భర్తని ఎలాగైనా గెలుచుకోవాలని తపన పడుతున్న ఒక స్త్రీ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అందంగా ముస్తాబయి వచ్చిన కోడల్ని మెచ్చుకుంటుంది మాలిని. ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే అంటాడు రత్నం. భర్త సక్సెస్ వెనక భార్య ఉంటుంది అంటారు. యష్ సక్సెస్ వెనక నువ్వు ఉన్నావు మా అందరికీ అదృష్ట దేవతవి అయ్యావు అంటుంది మాలిని. అత్తయ్య ఇంక చాలు ఆలస్యం అవుతుంది ఈయనేరి అంటూ భర్తని పిలుస్తుంది. యష్ వెళ్ళిపోయాడు అంటుంది మాలిని. వెళ్లిపోయారా అంటూ బాధపడుతుంది వేద. కలిసే వెల్దామన్నాడు కానీ అర్జెంటుగా ఫోన్ రావటంతో వసంత్ తో కలిసి వెళ్లిపోయాడు మీటింగ్ ఉందంట అంటూ అబద్ధం చెప్తాడు రత్నం.
నేను లేకుండా ఒంటరిగా వెళ్ళినందుకు చిన్న బుచ్చుకున్నారో ఏంటో సారీ చెప్పాలి ఫంక్షన్ కి బయలుదేరుతుంది వేద. మరోవైపు యష్ ప్రెసిడెంట్ అయిన విషయం పేపర్లో చూసి తట్టుకోలేక పోతాడు అభిమన్యు. నాకు కావలసిన పోస్టు వాడికి ఎలా వచ్చింది అంటూ చిందులు వేస్తాడు. నాకు అదే అర్థం కావట్లేదు నీ దగ్గర లంచాలు తీసుకున్న ఛాంబర్ మెంబెర్స్ వాడిని గెలిపించారు మా బామ్మర్ది కి రాసి పెట్టింది వదిలేయ్ అంటాడు కైలాష్.
ఆ మాటలకి కోప్పడ అభిమన్యు కైలాష్ ని చంప దెబ్బ కొట్టి ఎలా వదిలేస్తాను అనుకున్నావు నా లైఫ్ లో ఉన్న ఒకే ఒక శత్రువు వాడు లైఫ్ లో కానీ బిజినెస్ లో కానీ నా మీద గెలవటానికి వీలు లేదు అంటాడు అభిమన్యు. ఇంతలో ఛాంబర్ మెంబర్స్ ఫోన్ చేసి ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఏ ఫంక్షన్ కి నేను రాకపోవడం ఏంటి తప్పకుండా వస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు అభి. అదేంటి అప్పుడు శత్రువు అన్నారు ఇప్పుడు మిత్రుడు అంటున్నారు అంటాడు కైలాష్.
మిత్రుడిని పట్టించుకోకూడదు కానీ శత్రువు కదలికలని పట్టించుకోవాలి ఫంక్షన్ లో పక్కనే ఉండే అడుగడుగునా వాడికి ఆనందం లేకుండా చేస్తాను అంటాడు అభి. పార్టీలో విన్ని యష్ ని విష్ చేస్తాడు కానీ యష్ అసలు కేర్ చేయడు. నువ్వు ఇలా బిహేవ్ చేయడంలో తప్పులేదు నా తప్పు కూడా ఉంది. వేదు లైఫ్ లోకి గెస్ట్ గా వచ్చాను గెస్ట్ గాని వెళ్ళిపోతాను వేదు ఎప్పటికీ నీదే అనుకుంటాడు విన్ని. మరోవైపు పార్టీలో విన్నీ, వేద కలిసి మాట్లాడుకోవడం చూసి కోపంతో రగిలిపోతాడు యష్. విన్నీ మాట్లాడుతూ ఇంతకుముందు వేద అంటే నా ఫ్రెండ్ పేద మాత్రమే అనుకునేవాడిని కానీ వేద అంటే ఒక ఫ్యామిలీ. నీకు నీ భర్త పెద్ద గీత నేను చిన్న గీత అయినా కూడా నాకు సంతోషమే అంటాడు విన్ని.
ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ అందం భార్య పోస్టుదా అని అడుగుతాడు విన్ని. కాదు భర్త పోస్ట్ ది ఆడదానికి భర్తే అందం అంటుంది వేద. ఇదంతా చూస్తున్న యష్ పోసెసివ్ గా ఫీల్ అవుతాడు. నీవల్ల నా లైఫ్ లో ఆనందం వచ్చిందనుకున్నాను. కానీ ఆనందం ఇంత త్వరగా ఆవిరైపోతుందనుకోలేదు అనుకుంటాడు యష్. అంతలోనే పార్టీకి అభి, మాళవిక వస్తారు. వాళ్లని చూసిన వేద ఇక్కడ ఏమైనా డిస్టబెన్స్ చేస్తారేమో అంటూ కంగారు పడుతుంది. నేను చేయనివ్వను కదా అంటూ వెళ్లి అభిని విష్ చేస్తాడు విన్ని.
మరోవైపు వేద చేతిలో బ్రాస్లెట్ ఏంటి అని అడుగుతుంది మాలిని. ఆయనకి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం తెచ్చాను అంటుంది వేద. ఇచ్చేయాల్సింది కదా పెట్టుకునేవాడు అంటాడు రత్నం. గెస్ట్ లతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఇదే కరెక్ట్ టైం వెళ్లి మీరే చేతికి పెట్టేయండి అంటాడు వసంత్. మాలిని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడంతో వెనకగా వెళ్లి యష్ చేతికి బలవంతంగా బ్రేస్లెట్ పెడుతుంది. వండర్ఫుల్ గిఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ వైఫ్ అంటూ యష్ ని అప్రిషియేట్ చేస్తారు అక్కడ ఉన్నవాళ్లు. దీనికి ఎమోషనల్ వాల్యూ ఏమి లేదు పైకి కనిపించేదంతా మంచిదే అవ్వక్కర్లేదు అంటాడు యష్.
ఒకసారిగా అందరి ముందు అలా అనేసరికి బాధపడుతుంది వేద. అలా అనేసారేంటి అయినా పర్వాలేదులే నా భర్తే కదా అని తనకి తానే సర్దిచెప్పుకుంటుంది వేద. తరువాయి భాగంలో మీ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉన్నట్లుంది అంటూ వెటకారంగా వేద ని అడుగుతుంది మాళవిక. మనసులు కలిసాయి అని మురిసిపోవడం కాదు, శరీరాలు కలవని పెళ్లి ఎప్పటికీ పెటాకులు కాకుండా పోదు అంటుందిమాళవిక.