- Home
- Entertainment
- RRR అసలు పాయింట్‌ని లీక్ చేసిన విజయేంద్రప్రసాద్.. ఎన్టీఆర్ చెప్పిన ఆటం బాంబ్ అదేనా?
RRR అసలు పాయింట్‌ని లీక్ చేసిన విజయేంద్రప్రసాద్.. ఎన్టీఆర్ చెప్పిన ఆటం బాంబ్ అదేనా?
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమాలో రాజమౌళి ఏం చూపించబోతున్నారు. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిసి ఏం చేయబోతున్నారనే సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో రైటర్ విజయేంద్రప్రసాద్ `ఆర్‌ఆర్‌ఆర్` కథ గురించి అసలైన పాయింట్ లీక్ చేశారు.

rrr movie story leak
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్‌ఆర్‌ఆర్`(RRR) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇద్దరు సూపర్ స్టార్స్ ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram Charan) కలిసి నటించిన సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్ ఇండియా వైడ్‌గా చేసిన ప్రమోషన్ సైతం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇందులో ఏం చూపించబోతున్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలతో జక్కన్న ఏం మ్యాజిక్ చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
rrr movie story leak
అయితే ఇప్పటి వరకు రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ చెప్పిన దాన్ని ప్రకారం.. కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజు స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ముందు ఏం చేశారనే కథతో `ఆర్‌ఆర్‌ఆర్` తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ఫిక్షన్ కథతో సినిమా సాగుతుందని, అయితే ఈ రెండు పాత్రల మధ్య స్నేహాన్ని, వీరిద్దరు కలిసి చేసే పోరాటాన్ని చూపించబోతున్నారని తెలుస్తుంది.
rrr movie story leak
ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ హైలైట్‌గా ఉంటుందని, దీన్ని ఆటంబాంబ్‌గా వర్ణించారు ఎన్టీఆర్. అంతేకాదు ఈ ఎపిసోడ్ కోసం ఆరవై రాత్రులు షూటింగ్ చేశారట. ఈ సమయంలోనే రాజమౌళి తమని టార్చర్ చేశారని, పిండేశారని ఆవేదన వ్యక్తం చేశారు తారక్, చరణ్. సినిమాకి ఇదే హైలైట్ అంటున్నారు. ఆ తర్వాత సినిమా వేరేలా టర్న్ తీసుకుంటుందని చెప్పారు. అయితే ఆ పాయింట్ ఏంటనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు.
rrr movie story leak
కానీ ఎట్టకేలకు రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ అసలు పాయింట్‌ని లీక్ చేశారు. ఇన్నాళ్లు `ఆర్‌ఆర్‌ఆర్` ప్రమోషన్‌కి దూరంగా ఉన్న ఆయన ఎట్టకేలకు బయటకు వచ్చారు. పలు టీవీ ఛానెల్స్ కి ఇంటర్య్వూలిచ్చారు. ఇందులోనే `ఆర్‌ఆర్‌ఆర్` కథ అసలు పాయింట్‌ని వెల్లడించారు విజయేంద్రప్రసాద్. ఎన్టీఆర్ చెప్పిన ఆటం బాంబ్‌ని లీక్ చేశారు.
rrr movie story leak
సినిమాలో చరణ్, తారక్ ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారట. కానీ వారిద్దరి ఐడియాలజీ వేరని చెప్పారు. సినిమా ప్రారంభంలోనే వీరిద్దరు ఆలోచనలు పూర్తి భిన్నమైనవని తెలుస్తుందని, ఆ ఉత్తర, దక్షిన ధృవాల మధ్య ఎక్కడో ఒక్క చోట గొడవ వస్తుందని, ఆడియెన్స్ గొడవ పడకుండా ఉంటే బాగుండు అని ఫీలవుతుంటారు. కానీ ఇద్దరి మధ్య భీకరమైనపోరు జరుగుతుందని చెప్పారు. ఇద్దరూ సింహాల్లా ఫైట్ చేసుకుంటారని, ఇది చూసినప్పుడు తనకు ఏడుపొచ్చిందని చెప్పారు. తనలాగే థియేటర్‌లో ఆడియెన్స్ కూడా ఫీల్ అవుతారని తెలిపారు.
rrr movie story leak
అయితే ఇది ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఎపిసోడ్ అని, సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని విజయేంద్రప్రసాద్ చెప్పారు. అంటే ఓ ఇంటర్వ్యూలో తారక్ చెప్పిన ఆటంబాంబ్ ఇదే అనే విషయాన్ని స్టార్ రైటర్ ఈ రూపంలో లీక్ చేశారని చెప్పొచ్చు. ఈ గొడవ తర్వాత వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ బలపడుతుందట. అప్పటి వరకు గొడవ పడే వీరు నిజం తెలుసుకుని, కలిసిపోతారని, ప్రత్యర్థులపై పోరు బాట చేపడతారనేది `ఆర్‌ఆర్ఆర్` అసలు కథ అని విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలని బట్టి అర్థమవుతుంది.
rrr movie story leak
ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి గూస్‌బంమ్స్ అనే చెప్పాలి. అదే సమయంలో ఇద్దరు గొడవపడే సమయంలో ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారింది. ఏదేమైనా ఈ సినిమా యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా సాగుతుందని రాజమౌళి తెలిపారు. సినిమా ప్రారంభమైన పది నిమిషాలకు ఆ రోలర్ కోస్టర్‌లో ఆడియెన్స్ జర్నీ చేస్తారని, ప్రపంచాన్ని మర్చిపోయి చూస్తారని చెప్పారు. ఎన్టీఆర్, చరణ్‌ల నటన హృదయాలను హత్తుకుంటుందని, ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉంటాయని చెప్పారు జక్కన్న. మరి సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే ఇంకా ఒక్క రోజు వెయిట్ చేయాల్సిందే.
rrr movie story leak
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్` ఈ నెల 25(శుక్రవారం) భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంతోపాటు ఇతర భాషల్లోనూ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. దాదాపు పదివేల స్క్రీన్లలో ప్రదర్శించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో అలియాభట్, ఒలివియా మోర్రీస్, అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 480కోట్లతో సినిమాని తెరకెక్కించారు. `బాహుబలి2`ని టార్గెట్‌గా ఈ సినిమా విడుదల కాబోతుంది. మరి దాన్ని మించుతుందా? అనేది చూడాలి.