Happy Promise Day 2022: ప్రామిస్ డే రోజు మీ ప్రేయసికి ఇలా విషెస్ తెలియజేయండి!
Happy Promise Day 2022: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల వచ్చింది అంటే ప్రేమికులకు పండుగ అని చెప్పవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీన ప్రతి ఏడాది ప్రేమికుల రోజు వారోత్సవాలు వారం రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ వారం రోజులలో రోజ్ డే, ప్రపోజల్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే , ప్రామిస్ డే అంటూ ప్రేమికులు ఈ వారం రోజులపాటు ప్రతిరోజూ ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ విధంగా చాక్లెట్లు టెడ్డీ లు ఒకరికొకరు ఇచ్చుకుని వారి మధ్య మనస్పర్థలు ఉన్నప్పుడు విడిపోవడం కాదు.
వారి మధ్య ఉన్న ఈ ప్రేమను పది కాలాలపాటు చల్లగా ఉండేలా ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకునే రోజును ప్రామిస్ డే అంటారు. ఈ ప్రామిస్ డే రోజు ప్రేమికులు లేదా ఇతరులు ఒకరిపై ఒకరు ప్రేమను తెలియజేసుకుంటూ వారి ప్రేమ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ప్రామిస్ చేసుకుంటూ ఈ ప్రామిస్ డే రోజున సెలబ్రేట్ చేసుకుంటారు.ఫిబ్రవరి 11వ తేదీన ప్రామిస్ డే గా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈరోజు తమ ప్రేయసికి ఏదైనా కానుక ఇచ్చితనపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఈ ప్రేమను ఎల్లకాలం తనకు పంచుతానని ఎలాంటి సమయంలో కూడా తనకు తోడుగా నీడగా ఉంటానని మాట ఇస్తూ ప్రమాణం చేయాలి.
ఇలా ప్రమాణం చేసిన తర్వాత ఎప్పుడు కూడా తను చేసిన ప్రమాణం ఇచ్చిన మాటను తప్పననీ చెప్పాలి. ఎప్పుడు నీ చెయ్యి పట్టుకుని నీ వెంటే ఉంటాను ఎలాంటి పరిస్థితులలో నిన్ను ఒంటరిగా వదిలి వేయను. కష్ట సుఖాలలో తోడుగా నిలుస్తానని వాగ్దానం చేయాలి.
ఈ విధంగా తన ప్రేయసి పై ప్రేమను తెలియజేస్తూ తను ఎప్పటికీ తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తూ ప్రామిస్ డే విషెస్ తెలియజేస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రేమపై వారిలో ఉన్న భావాలను వ్యక్త పరుస్తూ ఈ ప్రామిస్ డే ను జరుపుకుంటారు.
ఈ విధంగా వారం రోజులపాటు ప్రేమికుల వారోత్సవాలను జరుపుకొని ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ ప్రామిస్ డే రోజున మీ ప్రియమైన వారికి ఇలా విష్ చెయ్యండి.. వారు ఎంతో సంబరపడిపోతారు...
నీ స్పర్శే కాదు నువున్నావనే భావనే చాలు.. నీతో నూరేళ్లు జీవించడానికి.. ఉదయానికి హృదయమే ప్రమాణం
హ్యాపీ ప్రామిస్ డే...
With every beat of my heart... I will love you more and more, After Years of Togetherness... This is my Solemn Vow for you.
Happy Promise Day sweet heart
With every beat of my heart... I will love you more and more, After Years of Togetherness... This is my Solemn Vow for you,
Happy Promise Day My love
No love story was ever so romantic and passionate. No promise was ever to effective. You and I are going to make history!
HAPPY Promise Day