శ్రీలీలకి రవితేజ మరోసారి లైఫ్ ఇస్తాడా?.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఇప్పుడు ఒక్కసారిగా డల్ అయ్యింది. ఆమెకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేవు. దీంతో మరోసారి రవితేజనే ఆమెకి లైఫ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

మాస్ మహారాజా ఓ రకంగా యంగ్ సెన్సేషన్ శ్రీలీలకి లైఫ్ ఇచ్చాడని చెప్పొచ్చు. `ధమాఖా` సినిమా హిట్ కావడంతో అందులోని శ్రీలీలకి ఫిదా అయిన మేకర్స్ ఆమె వెంటపడ్డారు. తమ సినిమాల్లో శ్రీలీల ఉండాల్సిందే అని పట్టుపట్టారు. అలాగే వరుసగా ఎనిమిది పది సినిమాలకు కమిట్ అయ్యింది శ్రీలీల.
`ధమాఖా` తర్వాత శ్రీలీలకి ఒక్క హిట్ రాలేదు. `భగవంత్ కేసరి` బాలయ్య జాబితాలో పడిపోయింది. దీంతో శ్రీలీల నటించిన చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి. బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేశాయి. ఇక ప్రస్తుతం ఆమె నితిన్‌తో `రాబిన్ హుడ్`, పవన్ తో `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రాలు చేస్తుంది. `రాబిన్ హుడ్` చిత్రీకరణ దశలో ఉంది. ఇది హిట్ ఇస్తుందా అనేది పెద్ద సస్పెన్స్. దీంతోపాటు పవన్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అనేది క్లారిటీ లేదు.
ఉన్నట్టుండి ఖాళీ అయిపోయింది శ్రీలీల. ఒకటి రెండు సినిమాల ఆఫర్ల్ కూడా పోయాయి. వరుసగా ఫెయిల్యూర్స్ పడటంతో ఈ బ్యూటీ బ్యాక్ అయ్యింది. ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి. కేవలం డాన్సులతోనే శ్రీలీల మ్యాజిక్ వెండితెరపై పనిచేయడం లేదు. దీంతో ఒక్కసారిగా పడిలేచిన కెరటంలా పడిపోయింది.
శ్రీలీల డైలమాలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆమెకి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాడు రవితేజ. మరోసారి ఆమెకి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా ఓకే చెప్పాడట. ఆమెనే తీసుకున్నారని తెలుస్తుంది. రవితేజ చేతిలో ఇప్పుడు రెండు మూడు ప్రాజెక్ట్ లున్నాయి. సితార బ్యానర్‌లో భాను భోగవరపు అనే కొత్త కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తే ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలని ఎంపిక చేశారట.
ప్రారంభంలో `ధమాఖా`తో శ్రీలీలకి హిట్ ఇవ్వడంతోపాటు విపరీతమైన క్రేజ్‌ని తీసుకొచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పుడు పరాజయాల్లో ఉన్న శ్రీలీలకి మరోసారి హిట్ ఇచ్చి అప్పటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. యంగ్ క్రేజీ బ్యూటీ కెరీర్ ని రవితేజ మరోసారి గాడిన పడేస్తాడా అనేది చూడాలి. చూడబోతుంటే ఇప్పుడు రవితేజమీదనే శ్రీలీల ఆశలన్నీ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.