- Home
- Entertainment
- అబ్బాయి అమ్మాయిగా మారితే పీరియడ్స్ వస్తాయా?: యాంకర్ ప్రశ్న.. గట్టిగా ఇచ్చిపడేసిన ప్రియాంక
అబ్బాయి అమ్మాయిగా మారితే పీరియడ్స్ వస్తాయా?: యాంకర్ ప్రశ్న.. గట్టిగా ఇచ్చిపడేసిన ప్రియాంక
‘‘ప్రియాంక సింగ్ ఈజ్ ఏ గల్, వుమెన్.. ఐ డోంట్ వాంట్ టూ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ యాజ్ ఏ ట్రాన్స్ జెండర్. నువ్వెందుకు అలా చూడలేకపోతున్నావ్.

Priyanka singh
పింకీ అలియాస్ ప్రియాంక సింగ్ తెలుగు టీవీ నటి. టీవీ షోలు, కామెడీ ప్రోగ్రామ్స్‌లో బాగా పాపులర్. జబర్దస్త్ లాంటి కామెడీ షోలతో బాగా ఫేమస్ అయ్యింది. జబర్దస్త్, ఇతర షోల్లో నటిస్తున్న సమయంలో అవకాశం రావడంతో బిగ్ బాస్ సీజన్-5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ కూడా ఇచ్చింది. అంతకు ముందు అంతంత మాత్రం ఫాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రియాంక సింగ్.. దాదాపు 90 రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉండి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెంచుకుంది. ఇది మామూలు విషయం కాదు.
Priyanka singh
యూట్యూబర్, యాంకర్ శివతో కలిసి ఢీ జోడీ డాన్స్ షోలోనూ ప్రియాంక్ సింగ్ పాల్గొంది. తోటి కంటెస్టెంట్లకు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో విపరీతంగా డాన్స్ ప్రాక్టీస్ ఓసారి ప్రాణాల మీదకు తెచ్చుకుందట. మరీ ఎక్కువగా డాన్స్ ప్రాక్టీస్ చేయడంతో అంతకు ముందు అలవాటు లేని కారణంగా విపరీతమైన ఒళ్లు నొప్పులు వచ్చాయట. దాంతో తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వేసుకుందట. అలా మాత్రలు అతిగా వేసుకొని తీవ్రమైన జ్వరంతో పరిస్థితి సీరియస్ అయి ఆసుపత్రిలో చేరింది ప్రియాంక సింగ్. ఈ విషయాన్ని స్వయంగా తానే యూట్యూబ్ ఛానెల్‌లో తెలియజేసింది. తాను చేసిన తప్పుకి ఆసుపత్రి పాలయ్యానని వివరించింది.
Priyanka singh
ప్రియాంక సింగ్ ట్రాన్స్ జెండర్ అయినప్పటికీ ఆమెది కళ్లు చెదిరే అందం. అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోని గ్లామర్‌తో కనిపిస్తూ ఉంటుంది. తన అందం, టాలెంట్‌తో బుల్లి తెరపై అనేక షోల్లో అవకాశం దక్కించుకుంది.
Priyanka singh
అయితే, ఇటీవల ఓ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం వేదికగా యాంకర్ శివ ప్రియాంక సింగ్‌ను చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది. యాంకర్ అడిగిన తిక్క ప్రశ్నకు ప్రియాంక సింగ్ దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. ఇలాంటి పిచ్చిపిచ్చి ప్రశ్నలు నన్ను అడగొద్దంటూ సూటిగా స్పష్టంగా చెప్పేసింది.
Priyanka singh
‘ప్రెజెంట్ నువ్వు పూర్తిగా అమ్మాయివి.. అమ్మాయిలకి ఎలా ఉంటుందో నీకు అలానే... మంత్లీ మంత్లీ మొత్తం అంటూ.. పీరియడ్స్ గురించి యాంకర్ అడుగుతాడు. దానికి అడ్డుపడిన ప్రియాంక సింగ్.. ‘‘నాకిలాంటివి నచ్చవు. అందర్నీ అడిగినట్లు నన్ను అడిగితే నేను రాను అని చెప్పా. అయినా మళ్లీ అదే ప్రశ్నలు అడుగుతున్నావ్... ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్లది. నాకు ఇది అవుతుంది, ఇది అవ్వదు.. నాకు ఇది చేయాలని ఉందని కెమెరా ముందు పెట్టాలా..?...’’ అంటూ గట్టిగా యాంకర్‌కి ఇచ్చిపడేసింది. ఓపెన్‌గా మాట్లాడటమంటే ఇదేనా... ఆఫ్ కెమెరాలో అయితే నీకు సరిగ్గా చెబుతా అని బదులిచ్చింది.
Priyanka singh
ఇంటర్వ్యూని అలాగే కొనసాగిస్తూ.. ట్రాన్స్ జెండర్లే ఆమెపై నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని.. చిన్నచూపు చూస్తున్నారని యాంకర్ ప్రస్తావించగా... ‘‘నేనందరికీ నచ్చాలని లేదు. నన్ను చిన్నచూపు చేసేవారిని నేను పట్టించుకోను. వాళ్లెవరూ నన్ను, నా ఫ్యామిలీని పోషించరు. అలా చూసేవారందరి కంటే నేను బెటర్ పొజిషన్‌లో ఉన్నా’’ అని ప్రియాంక సింగ్ సమాధానమిచ్చింది.
Priyanka singh
మీరందరూ ఒకటే కదా.. అని ట్రాన్స్ జెండర్స్ గురించి యాంకర్ ఒత్తి పలకడాన్ని ప్రియాాంక సింగ్ తప్పుపట్టింది. అలా మీరందరూ, ట్రాన్స్ జెండర్లు అనడం తనకు నచ్చదని చెప్పింది. ‘‘ప్రియాంక సింగ్ ఈజ్ ఏ గల్, వుమెన్.. ఐ డోంట్ వాంట్ టూ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ యాజ్ ఏ ట్రాన్స్ జెండర్. నువ్వెందుకు అలా చూడలేకపోతున్నావ్. అదేదో ఇంటిపేరులా తగిలించొద్దు. అందరం మనుషులం. ఎవరికి నచ్చినట్లు వాళ్లు బతుకుతారు. నువ్వు మగాడివని.. మాటమాటకు మగాడు మగాడు అంటే ఎలా ఉంటుంది. ఎవరేంటో జనానికి తెలుసు. ఎందుకు ట్యాగ్‌లైన్‌లు ఇస్తున్నారు’’ అంటూ యాంకర్‌కి దిమ్మదిరిగిపోయోలా సమాధానం చెప్పింది ప్రియాంక సింగ్.