విజయ్ దేవరకొండ మీద ఎందుకంత నెగిటివిటీ ?..డ్యామేజ్ జరిగింది అక్కడేనా..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ తన మార్క్ మ్యానరిజమ్స్ తో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ తన మార్క్ మ్యానరిజమ్స్ తో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అదే సమయంలో నెగిటివిటి కూడా పెరుగుతోంది. విజయ్ దేవరకొండతో పాటు ఎదుగుతున్న చాలా మంది యువ హీరోలు ఉన్నారు. కానీ వారెవరికీ ఈ స్థాయి నెగిటివిటీ అయితే లేదు.
Actor Vijay Devarakonda
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. షూర్ షాట్ హిట్ అన్నట్లుగా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరిగాయి. కానీ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. కానీ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం పై ఉన్న నెగిటివిటి తగ్గించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఎంత వరకు ఫలిస్తుందో చెప్పలేం.
ఏది ఏమైనా ఫ్యామిలీ స్టార్ వల్ల విజయ్ ఇమేజ్ కి ఎంతోకొంత డ్యామేజ్ జరిగేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో నెగిటివిటి ఆ రేంజ్ లో ఉంది. విజయ్ పై వివిధ రకాల మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
వాళ్ళు విజయ్ దేవరకొండ సినిమాలపై ట్రోల్ చేస్తున్నారా లేదా అతడి యాటిట్యూడ్ పైనా అనేది అర్థం కాని విషయం. విజయ్ కెరీర్ కి లైగర్ చిత్రంతోనే డ్యామేజ్ జరిగిందనేది కొందరి అభిప్రాయం. కానీ ఒక్కటి మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. ఒకే తరహా సక్సెస్ ఫార్ములాని పట్టుకుని దాని వెంటే వెళుతున్నాడు ఈ రౌడీ హీరో. అదే దెబ్బ కొడుతోంది అని అంటున్నారు.
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం రెండు వైవిధ్యమైన చిత్రాలు. ఒక్కో హీరోకి ఒక్కో తరహా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగని సినిమా మొత్తం హీరోల బాడీ లాంగ్వేజ్ పై నడవదు. విజయ్ దేవరకొండ చిత్రాల్లో అదే జరుగుతున్నట్లు అనిపిస్తోంది. అతడి యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ని హైలైట్ చేస్తున్నారు కానీ.. కథని గాలికి వదిలేస్తున్నారు.
Vijay Devarakonda
ముఖ్యంగా విజయ్ దేవరకొండ పబ్లిక్ ఈవెంట్స్ లో చేస్తున్న కామెంట్స్ కూడా రిపీటెడ్ గా ఉంటున్నాయి. తన కెరీర్ కష్టాల గురించి.. ఇప్పుడు తానున్న పొజిషన్ గురించి పోల్చుకుంటున్నాడు. ఇది కూడా నెగిటివిటి కి కారణం అని అంటున్నారు. విజయ్ దేవరకొండ ట్రోలర్స్ కి చెక్ పెట్టాల్సింది తన సినిమాలతో తప్ప మాటలతో కాదని అంటున్నారు. యువతలో తనకున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మంచి కథలతో వస్తే చాలా బావుంటుందని ప్రేక్షకులు అంటున్నారు.