మా ఇంటి క్రింద ఇస్త్రీ చేసేవాడు అలా అనేసరికి ..,: తరణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్
పెళ్లి చూపులు అయ్యాక నా సెకండ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మళ్లీ పేరు తెలవని వాళ్లతో తీస్తున్నారేంటి అన్నారు. నేను జబర్దస్త్ కు వెళ్లాను.
Tharun Bhascker, Vijaya Devarakonda, pellichoopulu, tollywood
పెళ్లి చూపులు, ఏమైంది ఈ నగరానికి, కీడాకోలా సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే తరుణ్ ప్రస్తుతం దర్శకుడిగానే కాక నటుడిగా, వేరే వర్క్స్ తో కూడా బిజీ అవుతున్నాడు. అయితే దర్శకుడుగా తరుణ్ భాస్కర్ కు కల్ట్ ఫాలోయింగ్ ఉంది.
వరసపెట్టి డైరక్టర్ గా సినిమాలు చేసుకోక మధ్యలో యాక్టింగ్ పిచ్చి ఏమిటని చాలా మంది ఆయన్ని ప్రశ్నిస్తూంటారు. మీడియా వాళ్లు సైతం అడుగుతూంటారు. నిజమే అనిపిస్తోంది కదా, తరుణ్ భాస్కర్ వంటి టాలెంట్ ఉన్న దర్శకుడు నటనతో టైమ్ వేస్ట్ చేసుకోవటం ఏమిటని. అయితే దీనికి తరణ్ భాస్కర్ ఓ గమ్మత్తైన సమధానం ఇచ్చారు.
Tharun Bhascker, Vijaya Devarakonda, pellichoopulu, tollywood
నవతరం ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు తరుణ్ భాస్కర్. ఆయన రచన సైతం జనాన్ని ఆకట్టుకుంది. తరుణ్ భాస్కర్ దాస్యం ‘న్యూ యార్క్ ఫిలిమ్ అకాడమీ’లో సినిమా మేకింగ్ లో పట్టాపొందారు. తరువాత సొంతగా ‘పెళ్ళిచూపులు’ కథ తయారు చేసుకొని ప్రయత్నాలు మొదలెట్టారు. రాజ్ కందుకూరి, యశ్ రంగినేనికి తరుణ్ కథ నచ్చింది. తత్ఫలితంగా ‘పెళ్ళిచూపులు’ సినిమాగా జనం ముందు నిలచింది. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండకు హీరోగా గుర్తింపు లభించడం విశేషం! .
Tharun bhascker
మొదటి సినిమాతోనే దర్శకునిగా మంచి గుర్తింపు సంపాదించిన తరుణ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే పరుగెత్తి పాలు తాగడం కంటే నిల్చుని నీళ్ళు సేవించడమే మేలని భావించిన తరుణ్ ఆచి తూచి అడుగులు వేశారు. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేశ్ బాబు కూడా తరుణ్ కు అవకాశం కల్పించారు. సురేశ్ బాబు కోసం ‘ఈ నగరానికి ఏమయింది?’ చిత్రం రూపొందించారు తరుణ్. ఈ సినిమా కూడా యువతను ఆకట్టుకుంది.
తరుణ్ భాస్కర్ లో రచయిత, దర్శకుడే కాకుండా నటుడు కూడా ఉన్నాడని గుర్తించింది ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్. ‘మహానటి’ చిత్రంలో సింగీతం శ్రీనివాసరావు పాత్రలో తరుణ్ కనిపించారు. ఆ తరువాత ‘సమ్మోహనం’, ‘ఫలక్ నుమా దాస్’ వంటి చిత్రాల్లోనూ తరుణ్ తెరపై తళుక్కుమన్నారు.
మిత్రుడు షమ్మీర్ సుల్తాన్ రూపొందించిన ‘మీకు మాత్రమే చెప్తా’లో కీలక పాత్ర పోషిస్తూనే, సంభాషణలు పలికించారు తరుణ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘కీడా కోలా’ చిత్రంలోనూ తరణ్ భాస్కర్ కీలకపాత్రను రాసుకుని పోషించి మెప్పించారు.
Tharun Bhasker
నటనపై తన ఆసక్తిని చెప్తూ... నా రెండు సినిమాలకు కొత్త వాళ్లు కావటంతో మార్కెట్ కష్టమైపోయింది. దాంతో డైరక్ట్ చేసే నా ఫేస్ కు అయినా కొంత మార్కెట్ ఉంటే బాగుండును అనిపించింది. నేను జనాలకు కనిపిస్తే బిజినెస్ ఈజీ అవుతుంది అని అర్దం చేసుకున్నా. మనం సామాన్య మనుష్యులం. కానీ సినిమా మనకి కొంత పవర్ ఆపాదిస్తుంది. లార్జర్ దేన్ లైఫ్ ఇస్తుంది. నాకు ఎప్పుడైతే ఈ విషయం అర్దమైందో అప్పుడు నేను కెమెరా ముందుకు రావటం మొదలెట్టాను. నాకు డైరక్షన్ అంటే ప్రాణం.
Tharun bhascker
యాక్టింగ్ అనేది ఓ తీట. నాకు అది ఉంది. దాంతో అది తీర్చుకుందామనుకున్నాను. చేస్తుంటే చేయబుద్ది అవుతోంది. పెళ్లి చూపులు అయ్యాక నా సెకండ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మళ్లీ పేరు తెలవని వాళ్లతో తీస్తున్నారేంటి అన్నారు. నేను జబర్దస్త్ కు వెళ్లాను.
మా ఇంటిక్రింద ఇస్త్రీ చేసేవాడు మీరు జబర్దస్త్ లో వచ్చారు కదా అన్నాడు. నాకు రెండు నేషనల్ అవార్జ్ లు కూడా వచ్చాయి రా, కానీ జబర్దస్త్ లో వచ్చినప్పుడే గుర్తుపట్టావు అన్నాను. ఇది వాస్తవం. కాబట్టి నేను ఫేస్ బయిట పెడితే నాకు వర్కవుట్ అవుతుంది. నా ఫేస్ మెల్లిగా చూసేలా ఉంది. కానీండి..ఏదో ఒకటి టిక్కెట్ సేల్ అవుతుంది కదా అన్నారు.