MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • శ్రీజ, శిరీష్‌ భరద్వాజ్‌ విడిపోవడానికి అసలు కారణం అదేనా? మాజీ భర్త ఎంత చెప్పినా మెగా డాటర్‌ వినలేదా?

శ్రీజ, శిరీష్‌ భరద్వాజ్‌ విడిపోవడానికి అసలు కారణం అదేనా? మాజీ భర్త ఎంత చెప్పినా మెగా డాటర్‌ వినలేదా?

ప్రేమించి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న చిరంజీవి కూతురు శ్రీజ, శిరీష్‌ భరద్వాజ్‌ విడిపోవడానికి కారణం ఏంటనేది పెద్ద సస్పెన్స్.  దీనిపై శిరీష్‌ ఏమన్నాడంటే? 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 06 2024, 10:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్‌ చిరంజీవి కూతురు శ్రీజ.. శిరీష్‌ భరద్వాజ్‌ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి ఫ్యామిలీని కాదని శ్రీజ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది అప్పట్లో పెద్ద దుమారం రేపింది. చాలా రోజులు హాట్‌ టాపిక్‌ అయ్యింది. మెగాస్టార్‌ గా రాణిస్తున్న చిరంజీవి కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. రకరకాలుగా దీనిపై చర్చ నడిచింది. అయితే దీనిపై ప్రారంభంలో ఆవేశానికి, బాధకి గురైనా మెగా ఫ్యామిలీ ఆ తర్వాత శ్రీజ సంతోషంగా ఉండటమే తమకు కావాల్సి ఉందని చెబుతూ చిరంజీవి ఓ వీడియోని విడుదల చేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత కొన్నాళ్లకి అంతా దీన్ని మర్చిపోయారు. ఈ నేపథ్యంలో మూడు, నాలుగేళ్లకి సీన్‌రివర్స్ అయ్యింది. శ్రీజ.. విడాకులు కోరుతూ కోర్ట్ మెట్లు ఎక్కింది. అప్పటికే వీరికి కూతురు నివృతి కూడా ఉంది. కానీ ఈ ఇద్దరు విడిపోవడానికి సిద్ధమయ్యారు. శిరీష్‌ వరకట్నం కోసం వేధిస్తున్నాడనే ఆరోపణలతో కేసు వేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. విడాకులు కోరుతూ ఆమె కోర్ట్ కి వెళ్లినట్టు తెలిసింది. 
 

36

అయితే దీనిపై అప్పట్లోనే శిరీష్‌ స్పందించారు. ఆయన వరకట్నం కోసం వేదిస్తున్నారనేది నిజం కాదని, అవి తప్పుడు ఆరోపణలు అని, దానికోసమే కోర్ట్ కి వెళ్లామని, కోర్ట్ లో అది తప్పు అని తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు శిరీష్‌. అయితే శ్రీజ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటనేది ప్రశ్నకి ఆయన చెబుతూ, ఆ విషయం శ్రీజనే అడగాలని చెప్పారు. ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలియదని, అసలు కారణం తెలియదని, అయితే ఇది తమ లైఫ్‌లో చిన్న డిస్టర్బెన్స్ మాత్రమే అని, సెట్‌ అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు శిరీష్‌. 

46

అంతేకాదు ఈ సందర్భంగా శిరీష్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. తాత్కాలిక మిస్ అండర్ స్టాండింగ్‌ అని చెప్పిన శిరీష్‌ తర్వాత తాము కలుస్తామని, శ్రీజతో తాను కలిసి ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తాను పాప, శ్రీజ ముగ్గురం కలిసే ఉంటామని చెప్పారు. కౌన్సిలింగ్‌కి వెళితే సమస్య సాల్వ్ అవుతుందని అనుకుంటున్నట్టు తెలిపారు. పెద్దలు కూర్చొని మాట్లాడితే ఈ ప్రాబ్లెమ్‌ సాల్వ్ అవుతుందని, అలానే సెట్‌ అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ గురించి చెబుతూ, ప్రేమ అనేది అంత ఈజీ కాదని, కష్టాలు, సుఖాలు అన్నీ ఎదుర్కొని గట్టిగా నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు శిరీష్‌. విడాకుల కేసు కోర్ట్ లో ఉన్న సమయంలో శిరీష్‌ మాహ న్యూస్‌తో  మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ 
 

56
Sreeja Konidela

Sreeja Konidela

కానీ కుదరలేదు. 2011లో శ్రీజ విడాకుల కేసు నమోదు చేయగా, మూడేళ్లకి కోర్టు విడాకులు జారీ చేసింది. అనంతరం కొంత గ్యాప్‌తో శ్రీజ మరో పెళ్లి చేసుకుంది. కళ్యాణ్‌ దేవ్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరితోనూ పిల్లలను కన్నారు. కానీ మళ్లీ వీరి మధ్య కూడా విభేదాలు వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. విడాకులకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. 
 

66

అలాగే శిరీష్‌ భరద్వాజ్‌.. శ్రీజతో విడాకుల తర్వాత కొంత డిస్టర్బ్ అయినట్టు తెలిసింది. తాగుడుకి బానిస అయ్యారనే వార్తలు వచ్చాయి. కానీ అవేమీ లేవని చెప్పింది శిరీష్‌ తల్లి. అయితే శిరీష్‌ మరో వివాహం కూడా చేసుకున్నారు. ఆమెతోనూ వైవాహిక బంధం సరిగా లేదని టాక్‌. అనారోగ్యంతో శిరీష్‌ గత నెలలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved