MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’షోలు ఆపేసారు, మండిపడ్డ ‘మైత్రీ మూవీస్’, అసలు గొడవ వేరే?

‘మంజుమ్మల్‌ బాయ్స్‌’షోలు ఆపేసారు, మండిపడ్డ ‘మైత్రీ మూవీస్’, అసలు గొడవ వేరే?

పీవీఆర్ మల్టీప్లెక్స్‌ వ్యవహారంపై నిర్మాతల మండలి అత్యవసర సమావేశం కానుంది. అయితే అసలు ఏం జరిగిందంటే?

2 Min read
Author : Surya Prakash
Published : Apr 11 2024, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Manjummel Boys

Manjummel Boys

రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ హిట్‌ ఫిల్మ్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ (Manjummel Boys)ను ‘మైత్రీ మూవీస్‌’ తెలుగులో డబ్‌ చేసి, విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అనుకోకుండా  పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌ తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శనలను గురువారం అర్ధంతరంగా నిలిపివేసింది. దీంతో, మైత్రీ మూవీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌రెడ్డి నిర్మాతల మండలిని ఆశ్రయించారు. ప్రసుత్తం ఈ చిత్రం  మంచి వసూళ్లు రాబడుతుండగా నిలిపివేయడంపై మండిపడ్డారు. మలయాళం నిర్మాతతో ఇబ్బంది ఉంటే తెలుగు వెర్షన్‌ ఎలా ఆపుతారని ప్రశ్నించారు. పీవీఆర్ మల్టీప్లెక్స్‌ వ్యవహారంపై నిర్మాతల మండలి అత్యవసర సమావేశం కానుంది. అయితే అసలు ఏం జరిగిందంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Manjummel Boys film

Manjummel Boys film

పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌ (PVR Multiplex)కి మళయాళ చిత్ర పరిశ్రమ కు మధ్య వివాదం మొదలైంది. అందుకు కారణం   డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు.  డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు లలో ముఖ్యంగా UFO,Qube మనవాళ్లు వినియోగిస్తూంటారు .  నిర్మాతలు తమ సినిమాలను ఆ  డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు  ఫార్మెట్ లోకి మార్చి ఇస్తూంటారు. అయితే అక్కడే సమస్య మొదలైంది.

36
manjummel boys

manjummel boys

భారీ స్థాయిలో కోట్లు ఖ‌ర్చు చేసి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాత‌లు గ‌త కొంత కాలంగా క్యూబ్‌, యు ఎఫ్ ఓ కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ భారీ స్థాయిలో న‌ష్ట‌పోతున్నార‌ట. గ‌తంలో ప్రింట్ సిస్ట‌మ్ మాత్ర‌మే వుండేది. అయితే డిజిట‌లైజేష‌న్ లో భాగంగా డిజిట‌ల్ ప్రింగ్ భారీ స్థాయిలో వాడ‌కంలోకి వ‌చ్చేసింది. దీంతో చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌ని టిజిట‌లైజ్ చేసేశారు. అయితే నిర్మాత‌ల‌కు ఇది పెను భారంగా మారుతూ వ‌స్తోంద‌ని, డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు ఈ విష‌యంలో త‌మ‌ని దోపిడీకి గురి చేస్తున్నార‌ని నిర్మాత‌లు వాపోతున్నారు. గ‌త కొంత కాలంగా దీనిపై చ‌ర్చ జ‌రుగుతున్నా స‌మ‌స్య కొలిక్కి రాక‌పోవ‌డంతో  ఈ వివాదంపై కేరళ నిర్మాత‌లు ఓ నిర్ణయానికి వచ్చారు.

46
Manjummel Boys

Manjummel Boys

మళయాళ నిర్మాతలు తమ సొంత ప్రొడక్షన్ కంటెంట్ మాస్టరింగ్ సిస్టమ్ PDC (Producer’s Digital Content)ని ఏర్పాటు చేసుకుని పీవీఆర్ వారిని అవి వాడమని కోరారు. తమ సినిమాలను ఆ ఫార్మెట్ లో ప్రదర్శించమన్నారు. అయితే ఈ కొత్త ఫార్మెట్ ని ఎడాప్ట్ చేసుకోవటానికి పీవీఆర్ కు చాలా ఖర్చు అవుతుంది. దాంతో వాళ్లు మళయాళ సినిమాల ప్రదర్శననే ఆపేసారు. అందులో భాగంగానే  ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ (Manjummel Boys)తెలుగు వెర్షన్ ని ఆపేసారని తెలుస్తోంది. 

56

  ఇక పీవీపి తీరుపై డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ మైత్రీ మూవీస్‌ (Mythri Movies) ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయం కోసం నిర్మాతల మండలిని ఆశ్రయించింది.  మలయాళ నిర్మాతతో వివాదం అయితే తెలుగు వెర్షన్‌ నిలిపివేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఏదైన గొడవలు ఉంటే మీరు నేరుగా వారితో తేల్చుకోవాలని, వెంటనే మూవీ ప్రదర్శించాలని కోరిన పీవీఆర్‌ యాజమాన్యం వినిపించుకోలేదట. దీంతో ఆయన ఈ విషయమై తెలుగు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారంపై ఆయన ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఫిలిం ఛాంబర్‌   పీవీఆర్‌ యాజమాన్యంతో అత్యవసర సమావేశానికి పిలుపినిచ్చింది. 

66

ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా (గ్రాస్‌) వసూళ్లు సాధించిన తొలి మలయాళ సినిమాగా నిలిచిందీ చిత్రం. శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపత్‌, లాల్‌ జూనియర్‌, దీపక్‌ కీలక పాత్రల్లో దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైంది. ఏప్రిల్‌ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved